Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ (Andha Pradesh) లో ఎన్నికల హీట్ కనిపిస్తోంది. అన్ని పార్టీలు గెలుపే లక్ష్యంగా జనల్లోకి వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇటే అధికార వైసీపీ (YCP), అటు ప్రధాన ప్రతిపక్షం తెలుగు దేశం (Telugu Desam) రెండూ జనల్లోనే ఉన్నాయి. ఈ రేసులో జనసేన (Janasena) మాత్రం రేసులో వెనుకబడింది అనే చెప్పాలి. అయితే పార్టీ ఆవిర్భావ దినోత్సవం తరువాత పూర్తిగా యాక్టివ్ అయ్యే అవకాశం ఉంది. మార్చి 14న మచిలీపట్నం వేదికగా జరిగే ఆవిర్భావ సభలోనే అధినేత పవన్ కళ్యాణ్ (Pawan kalyan) సమర శంఖం పూరించే అవకాశం ఉంది అంటున్నారు. అయితే 14వ తేదీన సమావేశం ఉంటే.. రెండు రోజుల ముందే ఆయన అవరావతి చేరనున్నారు. అక్కడ రెండు కీలక సమావేశాల్లో ఆయన పాల్గోనున్నారు. ముందుగా కాపు సంక్షేమ సంఘాల ( Kapu Welfare Assocations) నేతలతో సమావేశం అవుతున్నారు. ఆ సమావేశంలో కాపు రిజర్వేషన్ పై వారి సలహాలు సూచనలు తీసుకుని.. ఆవిర్భావ సభలో ప్రకటించే అవకాశం ఉంది.
ఇక రెండోది అంత్యంత కీలక సమావేశం.. పార్టీ కీలక నేతలతో ఆయన సమావేశం అవుతారు. ఆ సమావేశంలోనే పార్టీ భవిష్యత్తు.. ఎన్నికల వ్యూహాల క్లారిటీపై క్లారిటీ ఇస్తారని సమాచారం. ముఖ్యంగా టీడీపీతో పొత్తు ఉంటుందా.. ఉండదా.. ఉంటే ఎన్ని సీట్లు ఆశించాలి.. ఎలాంటి హామీలు తీసుకోవాలి అనేదానిపై పార్టీ కీలక నేతలతో ఆయన చర్చించనున్నారు.
ఈ రెండు సమావేశాల్లో చర్చించిన అంశాల ఆధారంగానే ఆయన పార్టీ ఆవిర్భావ సమావేశంలో ఆయన మాట్లాడుతారని తెలుస్తోంది. అంతేకాదు మార్చి 14నే వారాహి యాత్రపైనే పూర్తి స్పష్టత ఇస్తారు. ఆ రోజు మంగళగిరి పార్టీ కార్యాలయం నుంచి వారాహిలో బయలుదేరి సభా ప్రాంగణానికి పవన్ చేరుకుంటారు. యాత్రకు సిద్ధమయ్యాను అనే సంకేతాలు అక్కడ నుంచే ఇస్తారు.
ఇదీ చదవండి : అనంతపురంలో హై టెన్షన్.. టీడీపీ-వైసీపీ మద్దతు దారుల మధ్య రాళ్లదాడితో ఉద్రిక్తత
అలాగే వచ్చే ఎన్నికల్లో తమ నినాదం ఏంటి..? ఏఏ అంశాలతో ప్రజల్లోకి వెళ్లాలి.. పార్టీ మేనిఫెస్టో ఏంటి.. ఎలా ఉండబోతోంది.. అన్న విషయాలపైనా ఆయన ఆ రోజే క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.. ముఖ్యంగా వైసిపి విముక్త ప్రభుత్వాన్ని తీసుకు రావాలన్నదే తమ లక్ష్యం అని చెప్పనున్నార. అలాగే బీజేపీ రోడ్ మ్యాప్.. ఆ పార్టీతో కలిసి వెళ్లాలా లేదా అన్నదానిపైనా ఆయన క్లారిటీ ఇస్తారని తెలుస్తోంది. దీనికి తోడు పవన్ కళ్యాణ్ పోటీ చేసేది ఎక్కడ నుంచి అన్నదానిపైనా క్లారిటీ ఇస్తారని ప్రచారం జరుగుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, AP Politics, Janasena, Pawan kalyan