Home /News /andhra-pradesh /

భగ్గుమన్న బెజవాడ.. దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రత...

భగ్గుమన్న బెజవాడ.. దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రత...

రాగల మూడు రోజుల పాటు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతాయని స్పష్టం చేశారు.

రాగల మూడు రోజుల పాటు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతాయని స్పష్టం చేశారు.

విజయవాడ నగరంలో గత 24 గంటల్లో అత్యధికంగా 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

    ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ నగరంలో ఎండ ఎంత బీభత్సంగా ఉందో చెప్పేందుకు ఇది నిదర్శనం. విజయవాడ నగరంలో గత 24 గంటల్లో అత్యధికంగా 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దేశంలోనే ఇది అత్యధికం. దేశంలోని ఏ నగరంలో కూడా గత 24 గంటల్లో ఈ స్థాయిలో ఉష్ణోగ్రత నమోదు కాలేదు. ఈ విషయాన్ని స్కైమెట్ వెదర్ వాతావరణ సంస్థ ధ్రువీకరించింది. విజయవాడ తర్వాత స్థానంలో బాపట్ల (45.6 డిగ్రీలు), ఖమ్మం (45.6 డిగ్రీలు), రాజస్ధాన్‌లోని బికనీర్ (45.4 డిగ్రీలు), రెంటచింతల (45.4), రాజస్థాన్‌లోని బార్మేర్ (45 డిగ్రీలు), జై సల్మేర్ (45 డిగ్రీలు), మధ్యప్రదేశ్‌లోని ఖర్‌గావ్ (45 డిగ్రీలు), రాజస్థాన్‌లోని ఫలోడీ (45 డిగ్రీలు), గుజరాత్‌లోని దీసా (44.9 డిగ్రీలు) టాప్ టెన్ లిస్టులో ఉన్నాయి.

    మరోవైపు నాలుగు రోజుల పాటు భారీ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ తెలిపింది. ఐఎండి వాతావరణ సూచనల ప్రకారం మే 22 నుంచి 25 వరకు నాలుగు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ లో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు పేర్కొన్నారు. ఈ క్రమంలో ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు చేయవలసినవి, చేయకూడని పనులు అంటూ విపత్తు నిర్వహణ శాఖ కొన్ని సూచనలు చేసింది.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: Andhra Pradesh, Summer, Vijayawada, WEATHER

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు