• Home
 • »
 • News
 • »
 • andhra-pradesh
 • »
 • VIJAYAWADA IS IT SELF GOAL OF YSRPC REBEL MP RAGHURAMA KRISHNAM RAJU FOR CRITICIZING PARTY AND CM YS JAGANMOHAN REDDY FULL DETAILS HERE PRN GNT

Andhra Pradesh: రాజకీయాల్లో రఘురామ రాజు సెల్ఫ్ గోల్..? కోరి కష్టాలు తెచ్చుకున్నారా..?

రఘురామకృష్ణం రాజు

పార్టీ అండదండలు ఉంటేనే నాయకునికి బలం. అలా కాకుండా బలమైన పార్టీలో ఉండి ఎదురుతిరిగితే అంతా తలకిందులవడం ఖాయం.

 • Share this:
  నీటిలో ఉంటేనే మొసలికి బలం. ఇది జగమెరిగిన సత్యం. బలమైన పార్టీ అండదండలు ఉంటేనే నాయకునికి బలం. అలా కాకుండా బలమైన పార్టీలో ఉండి ఎదురుతిరిగితే అంతా తలకిందులవడం ఖాయం. ప్రస్తుతం ఏపీలో ఓ నాయకుడి గురించి విస్తృతంగా చర్చ జరుగుతోంది. సమకాలీన రాజకీయాలపై అవగాహన ఉన్నవారు ఎవరికైనా దేవేందర్ గౌడ్, ప్రొఫెసర్ కోదండరామ్, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి వంటి వారి ఉదంతాలకి వైసిపి యం.పి రఘురామక్రిష్ణంరాజు ఉదంతానికి పెద్దగా వ్యత్యాసమేమీ కనపడదు. దేవేంద్ర గౌడ్తె.., లుగు దేశం పార్టీ ఓ వెలుగు వెలుగుతున్న రోజుల్లో పార్టీలో నెంబర్ టూ గా చలామణీ అయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఓ వెలుగు వెలిగిన ఆయన చంద్రబాబుతో విభేధించి నవ తెలంగాణ ప్రజా పార్టీ పేరుతో ఓ పార్టీ స్థాపించి కనీసం తన సీటు కూడా తాను గెలవలేక పోయారు.

  ఇక ప్రొఫెసర్ కోదండరామ్ ఒకానొక దశలో కేసిఆర్ తో సైతం వంగివంగి దండం పెట్టించుకున్న ఆయన, తానులేనిదే టి.ఆర్.ఎస్ లేదు అన్నంతగా తెలంగాణలో వెలిగి పోయారు. ఎప్పుడైతే కే.సి.ఆర్ తో విభేధించి టి.ఆర్.ఎస్ నుండి బయట కి వచ్చి టి.ఎస్.ఎస్ స్థాపించారో ఆరోజు నుండి ఈ రోజు వరకు తన ఉనికిని కాపాడుకోవడానికి పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు. ఇక వై.ఎస్ రాజశేఖరరెడ్డి మరణం తరువాత జరిగిన పరిణామాలతో అనూహ్యంగా ముఖ్యమంత్రి పదవి వరించిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఆంధ్ర -తెలంగాణ విడదీయడంతో కాంగ్రెస్ పార్టీ నుండి బయటికి వచ్చి జై ఆంధ్ర పార్టీ స్తాపించి కనీసం నామమాత్రగానైనా ఓట్లు సంపాదించుకో లేక పోయారు. వీరంతా తమ వాపుని చూసి బలుపు అనుకుని పప్పులో కాలేసినోళ్ళే అనడంలో అతిశయోక్తి లేదు.

  ప్రస్తుతం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కూడా దీనికి అతీతుడేం కాదు. తనకి సీటిచ్చి గెలిపించిన పార్టీ పైనా.., ఆ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్ జగన్మోహనరెడ్డి పైన రాజుగారు దాదాపుగా యుధ్ధమే ప్రకటించారని చెప్పుకోవచ్చు. ఐతే రాజు కంటే మొండివాడు గొప్ప అన్న చందంగా జగన్మోహనరెడ్డి రాఘురామపై వివిధ కేసుల అస్త్రం సంధించాడు. ఇప్పుడు రఘురామరాజు లబోదిబోమంటూ కోర్టుల చుట్టూ తిరగటం, పార్లమెంటులో తనపై కక్ష్య సాధింపు అంటూ ఏకరువు పెట్టడం మినహా ఏమీ చేయలేని పరిస్థితి. పైగా వైసీపీ అధికారికంగా రఘురామ రాజుని తమ పార్టీ సభ్యునిగా గుర్తింపు రద్దు చేయాలని.., ఆయన లోక్ సభ సభ్యత్వాన్ని కూడా రద్డు చేయాలని కోరుతూ లోక్ సభ స్పీకర్ కు లేఖ అందజేయడం జరిగింది. ఇప్పటి వరకు వైసీపీ లేఖపై ఎటువంటి చర్య తీసుకోని లోక్ సభ ఇప్పుడు రఘురామ ఫిర్యాదు పై స్పందించే అవకాశాలు తక్కువనే అనుకోవచ్చు.

  ఏతావాతా చెప్పొచ్చే దేమిటంటే రఘురామ కృష్ణం రాజు అల్లరిచేసి తన కష్టాలను మరింత పెంచుకోవడమే తప్ప సాధించేది ఏమీ ఉండదు. చంద్రబాబు నాయుడి ప్రోద్భలంతోటే రఘురామ కృష్ణంరాజు తన స్వంత పార్టీపై అనవసర వ్యాఖ్యలు చేసి కోరికష్టాలు కొనితెచ్చుకుంటున్నారని రాజకీయ మేధావులు చర్చించుకుంటున్నారు.
  Published by:Purna Chandra
  First published: