హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Shaikh Rasheed: ధోనీ టీమ్‌‌లో గుంటూరు కుర్రాడు.. ఈ విజయం వెనక ఎంత కష్టముందో తెలుసా?

Shaikh Rasheed: ధోనీ టీమ్‌‌లో గుంటూరు కుర్రాడు.. ఈ విజయం వెనక ఎంత కష్టముందో తెలుసా?

X
షేక్

షేక్ రషీద్

Shaikh Rasheed: 2022 అండర్ -19 ప్రపంచకప్ లో రషీద్ 201 పరుగులు సాధించి కప్ గెలవడంలో కీ రోల్ ప్లే చేశాడు. దేశవాళీ క్రికెట్ లో కూడా రషీద్ ఎంట్రీ ఇచ్చాడు. గతేడాది జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో రషీద్ ఆంధ్ర తరఫున అరంగేట్రం చేశాడు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Guntur, India

లక్ష్యం జాతీయ జట్టుకు ఆడటం. ఈ ప్రయాణంలో ఎన్ని అవరోధాలు, అడ్డంకులు. అయినా గమ్యాన్ని ముద్దాడే వరకు విశ్రమించలేదు. ఆటుపోట్లకు ఎదురీదుతూ కష్టాల కడలిని దాటుకుంటూ తన కలల ప్రయాణంలో మరో మజిలీకి చేరాడు. తాను ఎంతగానో ప్రేమించే తండ్రి ఆశయం, భారత్‌కు ఆడాలన్న కాంక్ష ముందుకు నడిపించింది. కష్టాల కడలి దాటి ఐపీఎల్ వేలంలో సత్తా చాటి అందరికీ ఆదర్శంగా నిలిచాడు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన యువతకు క్రికెట్ అంటే ఊరిచివర గ్రౌండ్. ఇక ఇంటర్నేషనల్ మ్యాచ్ అంటే టీవీల్లో చూడటమే తప్ప.. ఆటడం అనే ఆలోచనే రాదు. కనీసం క్రికెటర్లను ప్రత్యక్షం చూడాలన్న కల కూడా నెరవేరదు. అలాంటి ఆంధ్రప్రదేశ్ లోని ఓ చిన్న గ్రామంలో పుట్టిన కుర్రాడు.. ఏకంగా దేశానికి ప్రపంచ కప్ అందించడంలో కీలక పాత్ర పోషించాడు. అంతేకాదు ఇప్పుడు ఐపీఎల్ వేలంలో మెరిసి.. ఏకంగా మహేంద్రసింగ్ ధోనితో డ్రెస్సింగ్ రూం పంచుకోనున్నాడు.అతడు ఎవరో కాదు గుంటూరు (Guntur) మిర్చి లాంటి కుర్రాడు షేక్ రషీద్ (Shaikh Rasheed).

రషీద్ సాధించిన ఘనతలన్నీ అంతగా ఈజీగా ఏం అతని చెంతన చేరలేదు. వీటి వెనుక రషీద్ పడ్డ ఎన్నో కష్టాలున్నాయి. అంతకుమించి రషీద్ తండ్రి త్యాగాలున్నాయి. గుంటూరు జిల్లాలోని ఒక​ మధ్య తరగతి కుటంబంలో జన్మించాడు షేక్‌ రషీద్‌. చిన్నతనం నుంచే క్రికెట్‌పై మక్కువ పెంచుకున్నాడు. అయితే, రషీద్ కు కోచింగ్ ఇప్పించేంత ఆర్థిక స్తోమత లేదు రషీద్ తండ్రికి. రషీద్ వాళ్ల నాన్నగారు చిన్న ఉద్యోగం చేసేవారు. రషీద్ ను మార్నింగ్ సమయంలో ట్రైనింగ్ కు తీసుకువెళ్లాల్సి వచ్చేది. అయితే.. తన జాబ్ టైమింగ్స్.. కొడుకు కోచింగ్ టైమింగ్ సెట్ కావడం లేదని ఏకంగా ఉద్యోగం మానేశారు. ఆ తర్వాత కుటుంబ పోషణ, రషీద్ కోచింగ్ కు డబ్బుల కోసం ఏ పని పడితే ఆ పని చేసేవారు. ఆర్ అండ్ బీ వర్క్స్, చెట్లు కొట్టడం.. ఇలా ఏ పని దొరికితే ఆ కూలి పని చేసేవారు. అయినా సరే.. కోచింగ్ కు ఈ డబ్బులు సరిపోయేవి కాదు.

దీంతో.. తన భార్య బంగారం అమ్మి తనయుడి కోచింగ్ కోసం డబ్బులు కట్టేవారు. రషీద్ కూడా తండ్రి కష్టాన్ని అర్థం చేసుకునేవాడు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వాళ్లు నిర్వహించే మ్యాచ్ ల కోసం వెళ్లేటప్పుడు ఒక్కోసారి రైల్వే స్టేషన్లలో, రైళ్లలోనే టాయిలెట్స్ లో రెడీ అయ్యి స్టేడియానికి వెళ్లేవాడు. తన తండ్రి ఆర్థిక స్తోమతకి తగ్గట్టుగా మెలిగేవాడు. ఇన్ని కష్టాలు భరించాడు కనుకే ఇప్పుడు ఐపీఎల్ లో ఆడే ఛాన్స్ దక్కించుకున్నాడు. అదీ కూడా ధోనితో. ధోని చేతిలో పడితే.. ఎలాంటి వాళ్లైనా సరే షైన్ అవాల్సిందే.

సూపర్ డూపర్ రికార్డుకు చేరువైన ధోని.. మరో 122 పరుగులు చేస్తే చాలు.. చేస్తాడా మరీ?

తండ్రి సహకారంతో రషీద్ గల్లీ స్థాయి క్రికెటర్ నుంచి భారత అండర్ 19 టీమ్ వైస్ కెప్టెన్ గా ఎదిగాడు. పదేళ్ళ వయసులోనే రంజీ మ్యాచ్ ల ద్వారా తన సొగసైన ఆట తీరుతో ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ పెద్దలను ఆకట్టుకున్నాడు.అప్పటి నుండి ఏ.సి.ఏ ఆధ్వర్యంలో శిక్షణ పొందుతూ భారత అండర్ 14,అండర్ 19 జట్లకు ప్రాతినిధ్యం వహించాడు.గత సంవత్సరం వరల్డ్ కప్ విజేతలు గా నిలిచిన భారత అండర్ 19 జట్టుకు వైస్ కెప్టెన్ గా సేవలు అందించాడు రషీద్.

గుంటూరుకు చెందిన సాధారణ మధ్య తరగతి కుటుంబానికి చెందిన షేక్.బాలీషా వలీ దంపతులకు రెండవ సంతానం రషీద్. రషీద్ విజయం వెనుక అతని కుటుంబ సభ్యుల ప్రోత్సాహం వెలకట్టలేనిది.ఎంతో కష్టపడి రషీద్ ఈ స్థాయికి వచ్చాడని ఆయన తండ్రి గర్వంగా చెప్తారు.

" మ్యాచ్ కు హాజరవ్వాలంటే జనరల్ భోగీలో 24 గంటల పాటు ప్రయాణించి విశాఖపట్టణం,చెన్నై స్టేడియంలకు వెళ్ళవలసి వచ్చేది.చాలా సార్లు ట్రైన్ టాయ్ లెట్ లోనే రెడి అయ్యి నేరుగా మ్యాచ్ కు అటెండ్ అయిన సందర్భాలు ఉన్నాయి. అలాంటిది ఇప్పుడు ఒక్కో మ్యాచ్ కు వేలల్లో డబ్బు,హోదాతో పాటు ఎన్నోమెడల్స్ సాధించడం చూస్తుంటే సంతోషంగా ఉంది. రషీద్ ఎదుగుదలను చూస్తుంటే ఇన్నాళ్ళూ పడిన కష్టమంతా ఒక్కసారిగా మటుమాయైమనట్టు ఉంది.

" అంటూ రషీద్ తండ్రి బాలీషా వలీ భావోద్వేగానికి గురయ్యారు.

ఇక, 2022 అండర్ -19 ప్రపంచకప్ లో రషీద్ 201 పరుగులు సాధించి కప్ గెలవడంలో కీ రోల్ ప్లే చేశాడు. దేశవాళీ క్రికెట్ లో కూడా రషీద్ ఎంట్రీ ఇచ్చాడు. గతేడాది జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో రషీద్ ఆంధ్ర తరఫున అరంగేట్రం చేశాడు. ఇప్పుడు ఐపీఎల్ మినీవేలం 2023తో ధోనితోనే ఆడే ఛాన్స్ దక్కించుకున్నాడు. ఐపీఎల్ లో కూడా సత్తా చాటి త్వరలోనే జాతీయ జట్టుకు కూడా ఎంపిక్వవాలని అతని కుటుంబ సభ్యులతో పాటు బంధుమిత్రులు కోరుకుంటున్నారు.

First published:

Tags: Andhra Pradesh, AP News, Guntur, IPL 2023, Local News

ఉత్తమ కథలు