రిపోర్టర్ : పవన్ కుమార్ : న్యూస్ 18 విజయవాడ
పోలీస్ శాఖలో ఉద్యోగ బాధ్యతలు చేపట్టి సుదీర్ఘ కాలంగా పారదర్శకత మరియు అంకిత భావంతో సమర్ధవంతంగా సేవలు అందించి తద్వారా ప్రతిష్టాత్మకమైన ఇండియన్ పోలీస్ మెడల్ కు ఎంపికైన సిటీ ఆర్మడ్ రిజర్వు ఇన్స్పెక్టర్ డి.సూర్య నారాయణని విజయవాడ నగర పోలీస్ శాఖ తరపున పోలీస్ కమీషనర్ కాంతి రాణా టాటా, అభినందించడం జరిగింది.
సిటీ ఆర్మడ్ రిజర్వు ఇన్స్పెక్టర్ డి.సూర్య నారాయణ పోలీస్ శాఖలో సమర్ధవంతంగా పని చేసి, తద్వారా ప్రజలకు విశిష్టమైన సేవలు అందించినందుకు గాను కేంద్ర ప్రభుత్వం గుర్తించి 2023 సంవత్సరం గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఇండియన్ పోలీస్ మెడల్ ప్రకటించడం జరిగింది.
డి.సూర్య నారాయణ గారి స్వగ్రామం బాపట్ల జిల్లా పిట్లవానిపాలెం మండలం, గోకరాజు నల్లిబోయిన వారి పాలెం. ఆయన 1998 వ సంవత్సరం నుండి సివిల్ పి.సి.గా సర్వీసు లోనికి వచ్చారు అనంతరం 2008 లో జరిగిన పరీక్షలలో ఆర్. ఎస్. ఐ.గా అర్హత సాధించి 2009 వ సంవత్సరంలో గుంటూరు నందు ఆర్.ఎస్.ఐ. గా బాధ్యతలను స్వీకరించడం జరిగింది. 2017వ సంవత్సరంలో ఇన్స్పెక్టర్ గా పదోన్నతి పొంది అక్టోపస్ కు వెళ్ళినారు. 2019వ సం॥లో బదిలీపై విజయవాడ ఆర్.ఐ.గా వచ్చినారు. వీరికి 25 కమాండేషన్లు, 29 గుడ్ సర్వీస్ ఎంట్రీలు, 76 నగదు రివార్డులు మరియు 19 ప్రతిభా ప్రశంసాపత్రాలను మొత్తం 149 రివార్థులను అందుకున్నారు.
ఈ నేపధ్యంలో ఈ రోజు నగర పోలీస్ కమీషనర్ వారి కార్యాలయం నందు నగర పోలీస్ కమీషనర్ కాంతి రాణా టాటా నగర పోలీస్ కమీషనరేట్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారులు అభినందించి, మున్ముందు ఇదే స్ఫూర్తితో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించాలని ప్రోత్సహించడం జరిగింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Local News, Vijayawada