Home /News /andhra-pradesh /

VIJAYAWADA INDEPENDENCE DAY CELEBRATIONS IN ANDHRA PRADESH CM JAGAN MOHAN REDDY FLAG HOSTING VIJAYAWADA NGS GNT

Independence Day: అణిచివేతపై పోరాడాల్సిన సమయం ఇదే.. సీఎం జగన్ పతాకావిష్కరణ

ఏపీలో ఘనంగా స్వతంత్ర్య వేడుకలు

ఏపీలో ఘనంగా స్వతంత్ర్య వేడుకలు

Independence Day Celebrations: ఆంధ్రప్రదేశ్ లో స్వాతంత్య్ర దినోత్స వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. విజయవాడలోని పతాకావిష్కరణలో పాల్గొన్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి.. కీలక వ్యాఖ్యలు చేశారు.

 • News18 Telugu
 • Last Updated :
 • Vijayawada, India
  Independence Day Celebrations:  మేరా భారత్ మహాన్ అంటూ యావత్ భారత దేశంలో అట్టహాసంగా స్వాతంత్ర దినోత్సవ సంబరాలు (Independence Day Celebrations) అంబరాన్ని అంటుతున్నాయి. ఎక్కడ చూసిన దేశ భక్తి ఉప్పొంగుతోంది. త్రివర్ణ పతాకం రెప రెపలాడుతోంది. ఆంధప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (CM YS Jagan Mohan Reddy), విజయవాడ (Vijayawada)లోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ఏపీ ప్రభుత్వం నిర్వహించిన వేడుకలకు హాజరయ్యారు పతాకావిష్కరణ చేశారు. ఈ వేడుకల్లో భాగంగా సోమవారం జాతీయ జెండా ఆవిష్కరించారు సీఎం జగన్‌. తరువాత పోలీస్‌ గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.. ఇప్పటికీ సమాజంలో వివక్ష కొనసాగుతోందని.. సామాజికంగా పలు వర్గాలపై అణచివేత కొనసాగుతోంది అన్నారు. అయితే వాటిపై సంఘటితంగా అందరూ పోరాడాలని.. ఎవరికి వారు చిత్తశుద్ధితో ఉంటే సామాజిక న్యాయం సాధ్యమే అన్నారు. అణచివేతపై ప్రతి ఒక్కసారి పోరాడాల్సిన సమయం ఆసన్నమైంది.

  అలాగే ఏపీలో మూడేళ్ల పాలనతో అందిస్తున్నసంక్షేమ పథనాల చక్కగా సాగుతున్నాయని.. అయినా విపక్షాలు.. కొన్ని వర్గాలు ఆరోపణలు చేయడం బాధాకరమన్నారు. పేద వర్గాల అభ్యున్నతి కోసం.. అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెడుతున్నామన్నారు. పేత విద్యార్థులకు ఉన్నత విద్య అందించాలనే లక్ష్యంగా  ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టామన్నారు. విద్యా రంగంలో సమూల మార్పుల కోసం అనేక పథకాలు ప్రవేశ పెడుతున్నామన్నారు. అమ్మఒడి, విద్యా దీవెన, విద్యా కానుక, జగనన్న గోరుముద్ద, నాడు నేడు లాంటి ఎన్నో కార్యక్రమాలకు శ్రీకారం చట్టామన్నారు.  ఆరోగ్య రంగపై ఫోకస్ చేస్తూ.. ఆరోగ్య శ్రీ పరిధిని పెంచామని గుర్తు చేశారు. ఐదు లక్షల లోపు ఆదాయం ఉన్న వారందరికీ ఆరోగ్య శ్రీ కింద వైద్యం అందిస్తున్నామన్నారు. వేయి రూపాయిలు దాటి అయ్యే ప్రతి చికిత్సను ఉచితంగా అందించే ప్రయత్నం  చేస్తున్నామన్నారు.

  ఇదీ చదవండి : మంత్రి రోజాకు మొదలైన తలనొప్పి.. అధినేత దగ్గరకు ఎలా వెళ్లాలని టెన్షన్

  మూడేళ్ల పాలనలో రాష్ట్రంలో కొత్తగా 40 వేల ఉద్యోగాలు ఇవ్వగలిగామన్నారు. అలాగే అనేక పాలనా సంస్కరణలు తీసుకొచ్చామన్నారు. పౌర సేవల్లో మార్పు తీసుకొచ్చామన్నారు. ప్రతీనెలా ఒకటో తేదీనే ఇంటి దగ్గరకే పింఛన్‌ ఇస్తున్నామని గుర్తు చేశారు. విత్తనం కొనుగోలు దగ్గర్నుంచి పంట అమ్మకం వరకూ ఆర్‌బీకేల ద్వారా సేవలు అందిస్తున్న ఘనత మనదే అన్నారు. అన్నం పెట్టే రైతన్నకు రైతు భరోసా అందిస్తున్నామని.. రైతు సంక్షేమానికి 1.27 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేశామన్నారు. ప్రతి మండలానికి రెండు పీహెచ్‌పీలు తీసుకొచ్చామని.. అమ్మ ఒడితో చదువుకు భరోసా కల్పించామని ఈ సందర్భంగా వెల్లడించారు జగన్..

  ఇదీ చదవండి : ఆంధ్రా సరిహద్దులో భూతల స్వర్గం.. ఆకట్టుకుంటున్న పర్యాటక ప్రాంతం.. ప్రత్యేకతలు ఎన్నో?

  ఇన్‌పుట్‌ సబ్సిడీ, సున్నా వడ్డీకే పంట రుణాలు అందిస్తున్నామని.. సామాజిక న్యాయానికి పెద్ద పీట వేశామన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు అన్ని పదవుల్లోనూ.. పథకాల్లోనూ పెద్ద పీట వేశాం అని గుర్తు చేశారు. నామినేటెడ్‌ పదవుల్లో 50 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ చట్టం చేశామన్న విషయాన్ని గర్వంగా చెబుతున్నాను అన్నారు. అలాగే మహిళలకు 50 శాతం రిజర్వేషన్‌ కల్పించిన ప్రభుత్వం మనది అన్నారు. ప్రాంతీయ ఆకాంక్షలకు, ప్రాంతాల ఆత్మ గౌరవానికి అన్ని ప్రాంతాల సమతుల్యత ప్రస్తుతం చాలా అవసరమని జగన్ అభిప్రాయపడ్డారు..
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, Independence Day

  తదుపరి వార్తలు