K Pawan Kumar, News18, Vijayawada
గ్రామ దేవతలే గ్రామానికి అధిష్టాన దేవతలు అని మన సంస్కృతిలో గ్రామదేవతలకు పెద్దపీట వేశారు. గ్రామదేవతలు ఆదిశక్తి అంశలు ప్రకృతి శక్తులు అంటుంది దేవి భాగవతం.. పేరు ఏదైనా కావచ్చు ఆరాధన పద్ధతి మారవచ్చు కానీ శక్తి ఒకటే.. గ్రామ దేవత అంటే ఆ గ్రామంలో ఉండే అందరి ఇంటి ఆడపడుచు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామ ప్రజలు గంగానమ్మ దేవిని గ్రామ దేవత.. అమ్మవారుగా పూజిస్తుంటారు.
ఒకసారి ఒక వ్యక్తి భరించలేని కష్టం రాగ గంగానమ్మ తల్లికి కష్టాన్ని తీర్చు తల్లి అని మొక్కుకున్నాడట ఆయన కొరగానే అమ్మవారు అతడి కోర్కె తీర్చిందట అప్పుడు వెంటనే అమ్మవారి గుడికి వెళ్లి ఈ భక్తుడి కోర్కె తీర్చవమ్మా అంటూ ఒక చెట్టు కింద కూర్చోగా అప్పుడు అతడి భుజాల పై ఎదో మొయ్యలేని అంత భారంగా బరువుగా అనిపించిందట. వెంటనే అమ్మవారు అతడిని ఒరేయ్ నీ కోర్కె ని తీర్చాను. మరి నాకు ఒక కోరిక ఉంది అని కోరగా అప్పుడు భక్తుడు నేను నీకేమి ఇవ్వగలనమ్మ అని అనగానే అమ్మవారు నేను నీభుజాలపై కూర్చుంటాను. నీవు నన్ను ఎంతవరకు మోయగలవో మొయ్యి అనగానే అతడు సరే అని అమ్మవారిని భుజాలపై మోస్తూ వెళ్లగా ఉండవల్లి రాగానే ఇంకా మొయ్యలేక అక్కడ ఆగిపోవడంతో గంగానమ్మ తల్లి ...ఆ ఉండవల్లి గ్రామంలో వెలసింది.
ఆ అమ్మవారికి 108 మంది అక్కా చెల్లెల్లు ఉన్నారు. వారిలో ఒకరు మహాలక్షమ్మగా పిలువబడే వేప చెట్టుని అక్కడి ఉండవల్లి గ్రామస్తులు పూజిస్తుంటారు. అయితేఅమ్మవారికి వివాహం కాలేదని ఆవిడ ఎప్పుడు తెల్లటి చీరలో కనిపిస్తూ ఉంటుందని అక్కడి గ్రామస్తులు చెప్తూ వుంటారు. భక్తులు కూడా అమ్మవారికి తెల్ల చీర, నైవేద్యమే పెడుతుంటారు. గాజులు,పూలు,పసుపు,కుంకుమ వంటివి ఆ అమ్మవారికి పెట్టారు. కానీఆ వేప చెట్టుకి చాకలి వారు కల్లు బాండవలో తీసుకొచ్చి నైవేద్యంగా పెట్టేవారు. వారు నైవేద్యంగా పెట్టిన మరుసటిరోజు కి అక్కడ కల్లు కనిపించేవి కాదని చెప్తూ ఉంటారు.
అక్కడ ఇదివరకు ప్రతి ఏటా ఉండవల్లి గ్రామ ప్రజలు అంత కలిసి ఎంతో ఘనంగా జాతర చేసే వారు గత 30 సంవత్సరాలు గా జాతర లాంటివి ఏమి చేయడం ఆపేసారని దానికి కారణం ఒక మహిళ అని చెవుతుంటారు. ఒక మహిళ ఓ రోజున అమ్మవారికి నైవేద్యం పెట్టి దీపారాధన చెయ్యబోతుండగా ఒక అతను వచ్చి ఆమెని నెట్టడాని అలా నెట్టడం వలన అవన్నీ నేల పాలయయ్యాని చెప్పడంతో ఆవిడా ఆయనతో చాలా పెద్ద గొడవ చేసిందని అలా జరిగిన వారం రోజులు ఆవిడ చనిపోయిందని అప్పటి నుండి అక్కడ కుల,మతాల, విబేధాలు వచ్చి జాతర జరపడం ఆపేసారని అక్కడి గ్రామస్తులు చెప్తున్నారు.
గ్రామ దేవతలు తమ గ్రామాల్లో సంభవించే కలరా, అమ్మవారు, పశువ్యాధులు వ్యాపించకుండా అరికడతారని, సకాలంలో వర్షాలు పడేటట్టు చేస్తారని ప్రజల విశ్వాసం. అందుకే ఊరి పొలిమేరల్లోనే ఈ గ్రామ దేవతల్ని ప్రతిష్ఠిస్తారు. మానవుల చేత మొట్టమొదట పూజలందుకున్న దేవతలు గ్రామ దేవతలే. ప్రాచీన కాలం నుంచీ నేటి వరకు గ్రామ దేవతలే గ్రామాల్లో ఆధిక్యతను కలిగి ఉన్నారు. గ్రామ దేవత విగ్రహ రూపంలో ఉండాలనే నియమం ఏదీ లేదు. ఆమె ఓ చిన్నరాయి రూపంలో కూడా ఉండొచ్చు. ఆ రాతికి పసువు కుంకుమ బొట్లు పెడతారు.
గ్రామాలలో వెలిసే దేవత దేవుళ్ళను ముఖ్యముగా స్త్రీ దేవతా రూపలను గ్రామదేవతలని అందురు. సంప్రదాయాలను అనుసరించి గ్రామ రక్షణగా ఈ దేవతలను ఊరి పొలిమేరలలో ఏర్పాటు చేసేవారు. ప్రాచీన కాలములో మానవుడు ఎంతో తెలివైనవాడు, ఇంట్లోవున్న చిన్నా, పెద్దా, ఆడ, మగ- అందరూ దేవీనవరాత్రుల కాలములో ఎక్కడోవున్న మధుర మీనాక్షమ్మ వద్దకో, కంచి కామాక్షమ్మ దగ్గరికో, బెజవాడ కనకదుర్గమ్మ చెంతకో వెళ్ళాలంటే కుదరకపోవచ్చు.
ఒక్కోక్కప్పుడు వెళ్ళే వీలుండక పోవచ్చు. వీలుచిక్కినా అందరికీ ఒకేసారి వెళ్ళడము సాద్యపడకపోవచ్చు. ఇలాంటి సంధర్బాలలో అలాంటి వాళ్ళు అమ్మ దర్శనానికి వెళ్ళలేక పోయామే అని నిరాశ పొందకుండా వుండేందుకు ఎక్కడో వున్న తల్లిని ఇక్కడే దర్శించు కొన్నామనే తృప్తిని పొందేందుకు గ్రామదేవత వ్యవస్థని ఏర్పాటు చేసారు పెద్దలు. ఎదో వ్యాధులు బారిన పడితేనో ,పంటలు పండకపోతేనో అమ్మవారికి మొక్కులు తీరిచే విధంగా అయ్యిందని అక్కడి వారు చెప్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Local News, Vijayawada