హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Vijayawada: బెజవాడలో ఎవరిష్టం వాళ్లది..! ఏం చేసినా పట్టించుకోరా..?

Vijayawada: బెజవాడలో ఎవరిష్టం వాళ్లది..! ఏం చేసినా పట్టించుకోరా..?

విజయవాడలో జోరుగా అక్రమ నిర్మాణాలు

విజయవాడలో జోరుగా అక్రమ నిర్మాణాలు

Vijayawada: ఒక బిల్డింగ్ నిర్మించాలి అంటే దానికి కావాల్సిన నియమాలను పాటిస్తూ, వాటికి కావాల్సిన పర్మిషన్ తెచ్చుకోవాలి. అనంతరంప్రభుత్వం అనుమతి ఇచ్చిన మేరకు బిల్డింగ్‌ని నిర్మిస్తారు. కానీ అంతటి విజయవాడ (Vijayawada) మహా నగరంలో నియమ నిబంధనలకు విరుద్ధంగా కట్టడాలు నిర్మిస్తున్నారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Vijayawada | Andhra Pradesh

K Pawan Kumar, News18, Vijayawada

ఒక బిల్డింగ్ నిర్మించాలి అంటే దానికి కావాల్సిన నియమాలను పాటిస్తూ, వాటికి కావాల్సిన పర్మిషన్ తెచ్చుకోవాలి. అనంతరంప్రభుత్వం అనుమతి ఇచ్చిన మేరకు బిల్డింగ్‌ని నిర్మిస్తారు. కానీ అంతటి విజయవాడ (Vijayawada) మహా నగరంలో నియమ నిబంధనలకు విరుద్ధంగా కట్టడాలు నిర్మిస్తున్నారు. బిల్డింగ్ నిర్మిస్తున్నాం అని పర్మిషన్ తీసుకొని..విరుద్ధంగా బిల్డింగ్ నిర్మిస్తున్నారు. విజయవాడ 25 వ డివిజన్లో విరుద్ధంగా బిల్డింగ్ నిర్మిస్తున్నారు. అదేమంటే అక్కడ ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులు అండ దండలతో నిర్మిస్తూ ఎవరు ఏమి చెప్పినఎవరినైనా డోంట్ కేర్ అంటూ లెక్క చేయడం లేదు. వారికి నచ్చిన విధంగా అడ్డగోలుగా నిబంధనలకు విరుద్ధంగాబిల్డింగ్ నిర్మిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. తీసుకునేది ఒకటి కానీ మరొక ప్లాన్‌తో బిల్డింగ్‌ని నిర్మిస్తున్నారు.

రాజకీయ నాయకులు పేరు చెప్పి ఇష్టానుసారంగా వ్యవహరిస్తు భారీ నిర్మాణాలకు తెర లేపుతున్నారు. ఇప్పటికే సీఎం జగన్ పలుమార్లు హెచ్చరించినప్పటికి ఆ హెచ్చరికలు జారీ  చేసినా.. ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారు. సీఎం ఆదేశాలను సైతం ఆ ప్రాంతంలోని వారే లెక్కచేయకుండా వ్యవహరిస్తున్నారని అనేక విమర్శలు వస్తున్నాయి. ఎక్కడ చూసినా అంత అవినీతి మయంగా మారింది. జాతీయ రహదారికి ఆనుకుని గోరంత అనుమతితో భారీ భవంతులను నిర్మిస్తున్నారు.

ఇది చదవండి: రైలు పట్టాలపై సినిమాటిక్ సీన్.. నిజంగా నువ్వు దేవుడు సామీ

అక్కడ ఉన్న  బిల్డింగ్ ఇన్స్పెక్టర్ ఆ బిల్డింగ్​లను పరిశీలించనేలేదు. ఆ ప్రాంతంలో అనేక నిర్మాణాలునిబంధనలకు విరుద్ధంగా కడుతున్న అక్కడున్న అధికారులు ప్రశ్నించిన దాఖలలులేవు. అలా ప్రశ్నించడంలో అధికారులుపూర్తిగా విఫలం చెందారని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఒకవేళ అధికారులు అడిగిన పొంతన లేని సమాధానం చెప్పడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఇది చదవండి: బెజవాడలో బ్లడ్ మాఫియా.. వాట్సాప్ మెసేజ్ తో టోకరా

ఏలూరు రోడ్డులోని హుస్సేన్ సాహెబ్ వీధిలో అడ్డగోలుగా నిర్మాణం జరుగుతుంది. దీనిపై టౌన్ ప్లానింగ్ అధికారిని ప్రశ్నించగా అనుమతులు ఉన్నాయని. మిగతా వాటి గురుంచి తర్వాత మాట్లాడదాం అనడం విశేషం. కానీ అనుమతి ఉన్నప్పుడు అర్ధరాత్రి స్లాబ్ వేయాల్సిన పని లేదు కదా.. పగలే వేయచ్చు కదా అని పలు విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పదించి తగిన చర్యలు తీసుకుంటారో లేక ఏమి పట్టనట్లు వ్యవహరిస్తారో వేచి చూడాలి.

First published:

Tags: Andhra Pradesh, Local News, Vijayawada

ఉత్తమ కథలు