VIJAYAWADA ICE CREAM DOSA WILL GIVE UNIQUE EXPERIENCE WHICH IS AVAILABLE IN VIJAYAWADA ANDHRA PRADESH FULL DETAILS HERE PRN VPR NJ
Ice Cream Dosa: ఆనియన్ దోశ తిన్నాం.. కానీ ఐస్ క్రీమ్, చాక్లెట్ దోశ తిన్నారా..? తింటే వదిలిపెట్టరు బాస్..
విజయవాడలో ఆకట్టుకుంటున్న ఐస్ క్రీమ్ దోశ
Vijayawada: వేడి వేడిగా పెనం మీద దోసెలు వేస్తుంటే లొట్ట లెట్టుసుకుంటూ తినడం ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అలానే దోసెలో కొబ్బరి చట్నీ, సెనగ, అల్లం చట్నీ ఇలా ఎన్నో వెరైటీ చట్నీలు వేసుకుని తింటే ఆ రుచే వేరే లెవెల్లో ఉంటుంది. దానికి ఐస్ క్రీమ్ తోడేతే..! ఆహా..!
ఆంధ్రులు ఆహారప్రియులు. ఫుడ్ ఎక్కడుంటే అక్కడుంటారు. అందుకే ఆంధ్రా వంటకాలు దేశవ్యాప్తంగా ఫేమస్. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో దొరికే ఫుడ్ లో టిఫిన్స్ కు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అందులో దోశలంటే తెలుగోళ్లకి ప్రాణం. వేడి వేడిగా పెనం మీద దోసెలు వేస్తుంటే లొట్ట లెట్టుసుకుంటూ తినడం ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అలానే దోసెలో కొబ్బరి చట్నీ, సెనగ, అల్లం చట్నీ ఇలా ఎన్నో వెరైటీ చట్నీలు వేసుకుని తింటే ఆ రుచే వేరే లెవెల్లో ఉంటుంది. ఐస్ క్రీమ్ కూడా అందరూ ఇష్టపడుతుంటారు. మరి ఈ రెండింటి కాంబినేషన్ ఎలా ఉంటుంది. ఎప్పుడైనా ఆలోచించారా? ఈ ఐడియానే ఆ బాబాయ్‌కు వచ్చింది. అలా సరికొత్త రెసిపీ తయారుచేశాడు.. దానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన రావడంతో.. ఇంకా కొన్ని వెరైటీ రెసెపీలతో దోశలు వేస్తున్నాడు.
దోశలో చట్నీ కాకుండా ఐస్ క్రీం ఎప్పుడైనా తిన్నారా? అలాంటి రుచి తెలియాలంటే విజయవాడ (Vijayawada) కేదారేశ్వరరవుపేటలోని ప్రభాస్ కాలేజీకు సమీపంలో ఏర్పాటు చేసిన శ్రీ గణేష్ భవన్టిఫిన్ సెంటర్ కు వెళ్ళాల్సిందే. అదేంటి అండి దోశలో ఐస్ క్రీమ్ అని ఆలోచిస్తున్నారా కేవలం ఐస్ క్రీమ్ ఒకట్టే కాదండి. ఇంకా ఇరువై నాలుగు రకాల దోశలు అక్కడ ప్రత్యేకం.
బాబోయ్.. ఇన్ని రకాల దోసెలా
ఐస్ క్రీం దోశ , చాక్లెట్ దోశ, లేస్ దోశ హార్లిక్స్ దోశ, ఉలవచారు దోశ, లేస్ దోశ.. ఇలా ఒకటెంటిరకరకాల దోశలు ఫుడ్ లవర్స్‌ను ఆకట్టుకుంటున్నాయి. కేవలం దోశలు మాత్రమే కాదు.. ఇక్కడ రకాల రకాల ఇడ్లీలు కూడా ఫుడ్ లవర్స్ ను ఆకర్షిస్తున్నాయి. శ్రీ గణేష్ భవన్ లో లభించే టిఫిన్ కోసం సుదూర ప్రాంతాల నుంచి కూడా ప్రతి రోజు అనేక మంది వస్తూ ఉంటారు.
30ఏళ్ల క్రితం ప్రారంభమైన హోటల్
1982లో ప్రారంభమైన ఈ హోటల్ కు మంచి ఆదరణ ఉంది. ఫుడ్ లవర్స్ ఎప్పుడు ఏదో ఒక కొత్తదనం కోరుకుంటుంటారు. సరికొత్త రెసీఫీలు ఉంటే ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటారు. వాళ్ళ కోసమే పదేళ్ల క్రితం నుంచిఈ ఇరవై నాలుగు రకాల దోసెలు రెసిపీలు తయారుచేసినట్లు హోటల్ నిర్వహకులు తెలిపారు. పది ఏళ్ల నుంచి పూర్తి స్థాయి హోటల్ మేనేజ్మెంట్ తో పాటు ఈ రేసిపలను కనుగొన్నట్లు నిర్వహుకులు తెలిపారు.
సామాన్యులకు సైతం అందుబాటు ధరలో
ఇన్ని రకాల వెరైటీస్ కదా…ఎక్కువ కాస్ట్ ఉంటుందేమో అనుకుంటే పొరపాటే. సామాన్యులకు సైతం అందుబాటు ధరలోనే ఇక్కడ ఇన్ని రకాల దోసెలు, ఇడ్లీలు అందిస్తున్నాం అంటున్నాడు బాబాయ్. ఇక్కడ దోసెలన్నీ రూ.30-70 మాత్రమే ఉంటాయి.
చిన్నపిల్లలకు మరింత ప్రియం
మాములుగా చిన్నపిల్లలు టిఫెన్ చేయాలంటే మారాం చేస్తారు. కానీ ఒక్కసారి బాబాయ్ హోటల్‌కు తీసుకెళ్తే…అక్కడ వాళ్లకెంతో ఇష్టమైన ఫుడ్‌తో దోసెలు చేయడం చూసి అవే కావాలంటారు. చిన్నపిల్లలకు ఎంతో ఇష్టమైన ఐస్‌క్రీమ్, లేస్, పిజ్జా దోసెలు ఇక్కడ చాలా స్పెషల్.
క్రేజీగా ఉందంటున్న ఫుడ్ లవర్స్
ఇప్పటి వరకు చాలా రకాల దోసెలు తిన్నాం కానీ ఇలా దోశతో ఐస్ క్రీం తినలేదని ఇది చాలా కొత్తగా ఉందని….దీన్ని తినడం కోసం గోదావరి జిల్లా నుంచి వచ్చినట్లు సదురు ఫుడ్ లవర్స్ తెలిపారు. ఉలవచారు ఇడ్లీ , మసాలా ఇడ్లీ , ఉలవచారు దోసె కూడా చాలా రుచికరంగా ఉన్నాయని రాబోయే రోజుల్లో మరిన్ని రేసిపీలు తయారు చేస్తే బావుంటుందని ఫుడ్ లవర్స్ తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.