హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Love cheat: ప్రేమించినట్లు నటించాడు.. అసలు విషయం తెలిశాక యువతి ఏం చేసిందో తెలుసా?

Love cheat: ప్రేమించినట్లు నటించాడు.. అసలు విషయం తెలిశాక యువతి ఏం చేసిందో తెలుసా?

ప్రాణ హాని ఉంది..కాపాడండి

ప్రాణ హాని ఉంది..కాపాడండి

ప్రేమించినానని నమ్మించాడు. పెళ్లీ చేసుకుంటానని మొదట్లో నటించాడు.. కొన్నాళ్లు హ్యాపీగా ఎంజయ్ చేద్దామని షో చేశాడు.. చాలా కాలం పాటు ప్రేమ ఉన్నట్లే బిల్డప్ ఇచ్చాడు.. తీరా చివరికి కులం పేరు చెప్పి పెళ్లీ చేసుకోనంటూ షాక్ ఇచ్చాడు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

(పవన్ కుమార్, న్యూస్18 తెలుగు, రిపోర్టర్, విజయవాడ)

ప్రేమించినానని నమ్మించాడు. పెళ్లీ చేసుకుంటానని మొదట్లో నటించాడు.. కొన్నాళ్లు హ్యాపీగా ఎంజయ్ చేద్దామని షో చేశాడు.. చాలా కాలం పాటు ప్రేమ ఉన్నట్లే బిల్డప్ ఇచ్చాడు.. తీరా చివరికి కులం పేరు చెప్పి పెళ్లీ చేసుకోనంటూ షాక్ ఇచ్చాడు. తనకు ప్రాణహాని ఉందని.. కాపాడండి అంటూ పోలీసులను ఆశ్రయించింది ఓ దళిత యువతి. ఎన్టీఆర్ జిల్లా నందిగామ ముక్క పాటి నగర్ కు చెందిన దళిత యువతిని ప్రేమ పేరుతో నమ్మించి మోసం చేశాడు బాణావత్ సతీష్ . ఆ యువతి సతీష్ ఇంటి వద్దకు వెళ్లి పెళ్లి చేసుకోమని అడగగా పెళ్లికి అంగీకరించేదేలేదని సతీష్ కుటుంబ సభ్యులు తేల్చి చెప్పడంతో ఏం చేయాలో అర్థంకాని పరిస్థితుల్లోకి వెళ్లిపోయింది ఆ యువతి.

ప్రేమ.. ఈ పేరు వినడానికి బాగానే ఉన్నా.. ప్రేమ పేరుతో ఎన్నో జీవితాలు నాశనం అవుతున్నాయి. ప్రేమించుకొని పెళ్ళి చేసుకోవాలని అనుకున్న నిజమైన ప్రేమికులకు కులం లేదా పెద్దలు అడ్డు వస్తుంటారు. కానీ ఇక్కడ ఏకంగా ప్రేమించిన వ్యక్తి పెళ్లి చేసుకోవడం కుదరదంటే ఆ యువతి జీవితం ఏమవ్వాలి..? ఇద్దరు ప్రేమించుకున్నారు. కొన్నాళ్ళు వారి మధ్య ప్రేమాయణం బానే కొనసాగింది. ఎన్నాళ్ళు గడుస్తున్నా పెళ్లి సంగతి మాట్లాడకుండా దాటేయ్యడంతో ఆ యువతి సతీష్ ఇంటికి నేరుగా వెళ్లి పెళ్లి చేసుకోమని అడగింది. అయితే సతీశ్ తో పాటు అతని కుటుంబ సభ్యులు పెళ్లికి నిరాకరించారు. దీంతో మోసపోయానని తెలుసుకుని యువతి కేసు పెట్టడంతో జైలుకు వెళ్లిన యువకుడు బెయిల్ పై తిరిగి వచ్చి బెదిరింపులకు దిగాడు.

బాణావత్ సతీష్ కు జైల్లో ఓ నిందితుడు పరిచయమయ్యాడు. అతని ద్వారా యువతిని ఫోన్లో రాజీ చేసుకొని బతికి పోమని లేదంటే నిన్ను చంపేస్తామని ఆమెను రౌడీ మూకలు బెదిరించడంతో యువతి హడలిపోయింది. తనకు నాకు ప్రాణహాని ఉందని తనని కాపాడండంటూ ఏసీపీ నాగేశ్వర్ రెడ్డిని ఆశ్రయించింది ఆ యువతి. అతడికి ఇచ్చిన బెయిల్ ను వెంటనే రద్దు చేయాలని హైకోర్టు న్యాయవాది జై భీమ్ శ్రీనివాస్ ను వేడుకుంది. మరి చూడాలి యువతి సమస్యను పోలీసులు, లాయర్లు ఎలా సాల్వ్ చేస్తారో..!

First published:

Tags: Local News, Vijayawada

ఉత్తమ కథలు