భార్యాభర్తల మధ్య సవాలక్ష గొడవలుంటాయి. కాపురంలో చిన్నచిన్న కలహాలు చాలా కామన్. సర్దుకుపోయి ఇద్దరూ ముందుకు సాగుతుంటారు. చిన్న చిన్న విషయాలకే జరిగే గొడవలు.. ఒక్కోసారి తీవ్రస్థాయికి వెళ్తుంటాయి. అలా ఓ భర్త.. చిన్న కారణానికే భార్యతో గొడవ పట్టుకున్నాడు. అక్కడితో ఆగలేదు ఎవరూ ఊహించని నవిర్ణయం తీసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని కృష్ణా జిల్లా (Krishna District) పెడన (Pedana) నియోజకవర్గం గూడూరు మండలం పిండివారిపాలెంకు చెందిన చింతల తిరుమలరావుకు రెండేళ్ల క్రితం నిర్మల జ్యోతితో పెళ్లైంది. వీరికి ఎనిమిది నెలల పాప కూడా ఉంది. ఇదిలా ఉంటే గురువారం ఉదయం కూర సరిగా వండలేదన్న నెపంతో భార్యతో గొడవపడ్డాడు. ఈ కాసేపు ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది.
ఆ తర్వాత పెడనలోని ఒకటవ వార్డులో ఉన్న అతడి స్నేహితుడు గోపీ ఇంటికి వెళ్లి పురుగుమందు తాగాడు. అపస్మారక స్థితిలో ఉన్న తిరుమలరావును స్థానికులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. వెంటనే అతడ్ని మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. భార్య ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చిన్నపాటి కారణానికే ఆత్మహత్య చేసుకోవడంపై తిరుమలరావు ఇంట్లో విషాదం నెలకొంది. ఐతే ఆత్మహత్య చేసుకోవడానికి కేవలం కూరవిషయమే కారణమా.. లేక మరేదైనా ఉందా అనేది తెలియాల్సి ఉంది.
ఇదిలా ఉంటే ఈ ఏడాది మార్చిలో ఇలాంటి దారుణమే జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా (West Godavari District) కూనవరం మండలం వెంకటాయిపాలెం పంచాయతీ పరిధిలోని వలస ఆది వాసీ గ్రామమైన సన్నాయిగూడెంలో చోటుచేసుకుందీ ఘటన. పోలీసులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. దివ్యాంగురాలైన తాటి సోమమ్మ అలియాస్ కోవ్వాసి సోమిడీ(20) అనే యువతి తన తల్లిదండ్రులు చనిపోవడంతో తెలంగాణలోని కరకగూడెం మండలం మద్దన్న గ్రామంలో తన అక్క దగ్గర ఉంటోం ది. వారం కిందట అన్నయ్యను చూద్దామని కూనవరం మండలం ఆదివాసీ గ్రామమైన కన్నాపురంలోని అన్నయ్య నందా ఇంటికి వచ్చింది. అన్న భార్య కొవ్వాసి ఉంగి తన పుట్టింటికి చత్తీస్‌గడ్ వెళ్లడంతో నంద గురువారం రాత్రి పది గంటలకు అతిగా మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. నిద్రపోతున్న చెల్లిని లేపి కోడి కూర వండాలని ఆమెతో గొడవకు దిగాడు.
చిన్నచిన్న గొడవలే పెద్దనష్టానికి దారితీస్తాయనడానికి ఈ రెండు ఘటనలే ఉదాహరణలుగా చెప్పవచ్చు. తిరుమలరావు ఆవేశంలో చేసిన పనికి పాపం భార్య, ఎనిమిదేళ్ల కూతురు దిక్కులేనివాళ్లయ్యారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.