KanakaDurga Temple: ఇంద్రకీలాద్రిపై మరో భారీ స్కామ్... దుర్గమ్మ సంపద దోచేస్తున్న ఇంటిదొంగలు

విజయవాడ దుర్గగుడి (ఫైల్)

Andhra Pradesh: ఇంద్రకీలాద్రిపై అవినీతికి సంబంధించిన ఆరోపణలన్నీ ఈవో సురేష్ బాబుపైనే వేలెత్తి చూపిస్తున్నాయి. ఇంత అవినీతి జరుగుతున్నా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

 • Share this:
  బెజవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను (Vijayawada Durga Temple)  దర్శించుకుంటే అంతా మంచి జరుగతుందని భక్తులు నమ్ముదారు. ఒక్కసారి దుర్గమ్మకు పూజచేస్తే చేసిన పాపాలన్నీ పోతాయని భావిస్తారు. క్షణంపాటు అమ్మ దర్శనం కలిగితే చాలు జన్మ తరించినట్లేనని నమ్ముతారు. అందుకే తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా అమ్మదర్శం కోసం భక్తులు భారీగాతరలివస్తారు. భక్తులు అత్యంత పవిత్రంగా భావించే అమ్మవారి సేవలో తరించాల్సిన ఉద్యోగులు వక్రబుద్ధి చూపిస్తున్నారు. దుర్గమ్మను కొలవాల్సింది పోయి అమ్మ సంపదను అడ్డంగా బొక్కేస్తున్నారు. ఇప్పటికే ఇంద్రకీలాద్రిపై కోట్లాది రూపాయల అవినీతిని ఏసీబీ బట్టబయలు చేసింది. ప్రసాదం, సరుకుల కొనుగోళ్లు, దర్శనం టికెట్లు, సెక్యూరిటీ టెండర్లు, శానిటైజేషన్ కాంట్రాక్టులు ఇలా ఒకటేమిటి అందినకాడికి దోచుకునేందుకు దుర్గగుడిని అడ్డాగా చేసుకున్నారు అక్రమార్కులు. తాజాగా భక్తులు అమ్మవారికి సమర్పించే చీరల్లోనూ కక్కుర్తి ప్రదర్శించారు. అమ్మవారికి వచ్చే వందలాది చీరలుకు లెక్కాపత్రం లేకుండా అడ్డగోలుగా దోచేశారు. అంతేకాదు ఖరీదైన చీరలను తక్కువదరకు సిబ్బందే కొనుగోలు చేసినట్లు సీన్ క్రియేట్ చేశారు.

  కనకదుర్గమ్మకు భక్తులు నిత్యం, చీరలు, పసుపు కుంకుమ సమర్పిస్తారు. ప్రతిరోజూ వందలాది చీరలు అమ్మవారికి చెంతకు చేరతాయి. ఐతే ఈ చీరలను వేలం పాట ద్వారా విక్రయిస్తుంటారు. వంద రూపాయల నుంచి లక్ష రూపాయలు విలువ చేసే చీరలను భక్తులు అమ్మవారికి సమర్పిస్తుంటారు. భక్తుల మనోభావాలను ఆసరాగా చేసుకుంటున్న ఆలయ సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తోంది. ముఖ్యంగా అమ్మవారి పట్టుచీరల లెక్కల్లో అవకతవకలు జరిగినట్లు ఏసీబీ గుర్తించింది. చీరలను రికార్డుల్లో నమోదు చేయకుండా పక్కన పెడుతున్నట్లు వెల్లడైంది.

  ఇది చదవండి: వైద్య శాస్త్రంలో ఇదో అద్భుతం... మూడుకాళ్ల శిశువుకు పునర్జన్మ ప్రసాదించిన డాక్టర్లు...


  చీరలు విక్రయించిన ధరలకు, బార్ కోడింగ్ ధరలకు భారీ వ్యత్యాసం కనిపించింది. రూ.15 వేలు విలువ చేసే చీరలను రూ.2,500లకే సిబ్బందే కొనుగోలు చేశారు. అలాగే రూ.7వేలు, రూ.3500 విలువ చేసే చీరలు చాలా వరకు మాయమయ్యాయి. కౌంటర్లో ఉండాల్సిన చీరలు బీరువాల్లో దర్శనమిచ్చాయి. చీరల కౌంటర్లో ఇన్ని అక్రమాలు జరుగుతున్నా ఈవో సురేష్ బాబు పట్టించుకోనట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈవో సురేష్ బాబుపై తీవ్ర అవినీతి ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.

  ముఖ్యంగా టెండర్ల కేటాయింపులు, కాంట్రాక్టర్లకు చెల్లింపుల వంటి అంశాల్లో ఈవో సురేష్ బాబు అడిట్ అభ్యంతరాలను పట్టించుకోలేదని స్పష్టం చేసింది. చెల్లింపులపై ప్రీ ఆడిట్ అభ్యంతరాలున్నా ఆవో బేఖాతరు చేసినట్లు ఏసీబీ వెల్లడించింది. డైరెక్టర్ ఆఫ్ స్టేట్ ఆడిట్ జనరల్ ఇచ్చిన మార్గదర్శకాలు విరుద్ధంగా చెల్లింపులు ఈవో చెల్లింపులు చేసినట్లు తెలిపింది. అలాగే రూల్స్ కు విరుద్ధంగా కేఎల్ టెక్నాలజీస్ కు కాంట్రాక్టులు ఇచ్చారని.. శానిటరీ టెండర్ల కేటాయింపులోనిబంధనలు పట్టించుకోలేదని పేర్కొంది. ఈ టెండర్ల విషయంలో సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ మార్గదర్శకాలను పట్టించుకోకుండా.. తక్కువ సొమ్ముకు కేట్ చేసిన స్పార్క్ కంపెనీని పక్కనబెట్టారని ఆరోపించింది. ఇంద్రకీలాద్రిపై సెక్యూరిటీ సిబ్బంది టెండర్లను అక్రమంగా మ్యాక్స్ సంస్థకు కట్టబెట్టినట్లు ఈవో సురేష్ బాబుపై ఆరోపణలున్నాయి.
  Published by:Purna Chandra
  First published: