రిపోర్టర్: పవన్ కుమార్ న్యూస్18
లొకేషన్ :విజయవాడ
ఇంట్లో ఏ కార్యక్రమాలు చేపట్టిన ఖచ్చితంగా ఈ పండు ఉండాల్సిందే.. అదేనండి... అరటి. ఈ అరటిలో వివిధ రకాలున్నాయి. ఇందులోఒక రకం... కూర అరటి పండు, మరో ఐదు రకాలు తినే అరటి కాయలుగా ఉన్నాయి. ఇందులో మూడు రకాల పంటలనుకొత్తూరు తాడేపల్లిలోని ఓ రైతు పండిస్తున్నారు. కర్పూరం, చక్కర కేళి, కూర అరటి కాయ ఈ 3 రకాలు అరటి పండ్లను పండిస్తున్నారు.
ప్రస్తుతం వీటికేఎక్కువ డిమాండ్ ఉండటంతోఇక్కడ రైతులు వాటికే ప్రాధాన్యత ఇస్తున్నారు. దానిలో రైతుకు కర్పూరం అరటి పంటపై ఎక్కువ లాభాలు వస్తాయని తెలుపుతున్నారు.ఈ కర్పూరపు అరటి పంటపైనే ఎక్కువ లాభాలు ఉంటాయి కావునే ఎక్కువగా ఈ పంటకి ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు.
ఈ పంటను ఇలా సాగు చేయాలి
అరటి పంట వేసే ముందు నేలను ముప్పై నుండి 40 సెంటిమిటర్ల లోతు వరకు ఉండాలి. తొలకరి జల్లు పడినప్పుడు నేలను 4 నుండి 5 సార్లు వరకు దున్నాలి. మొక్కను దగ్గర దగ్గర కాకుండా అడుగు దూరం పాటించి మొక్కను నాటలి. అలాగే 45 గణ సెంటి మీటర్ల వరకు గుంతలు తీయాలి. కానీ ఒక్కోరకపు అరటి పంటను పండించేప్పుడు ఒక్కొకరకంగా మొక్కను నాటలి.
అరటి మొక్కలకు నీళ్లు అందించే ముందు ఉన్న వాతావరణం బట్టి, నేల తేమను బట్టి తడులు అందిస్తూ ఉండాలి. ఎరువులు వేసినప్పుడు మాత్రం మొక్కలకు నీటిని తక్కువగా అందించాలి. అరటి సాగులో కలుపు మొక్కలు వంటి వాటిని ఎప్పటికప్పుడు తొలగిస్తూ ఉండాలి. 15 నుండి 20 రోజులకు ఒకసారి కలుపు మొక్కలను నాలుగు నెలలు వరకు తొలగిస్తుండాలి.
గెలలు కోసిన వెంటనే వాటిని నీడలో ఉంచాలి. ఎండలో పెడితే కాయ త్వరగా పండి పోయి ఎక్కువ కాలం నిల్వ ఉండటానికి వీలుండక త్వరగా పండి పాడైపో తుంది. అలాగే అరటి గలను గాలి దరి చేరని గదిలో నిల్వ ఉంచాలి. అలాగే అరటి పంటకు ఎలాంటి పురుగు పట్టకుండా నివారణకు మందులని వేస్తూ ఉండాలి.
అరటి గెలకు 8 నుండి 10 హస్తలతో ఉంటుంది. వాటికి 125 నుండి 150 పండ్లు వరకు ఒక్కో గెల బరువు 15 నుండి 20 కేజీలు ఉంటుంది. ఒక్కో ఎకరాకు 13 టన్నుల వరకు పంట పడుతుంది. అప్పుడు ఉన్న రేటుని బట్టి లాభం చేకూరవచ్చు.
కొత్తూరు తాడేపల్లిలో రమణ రెడ్డి అనే గత 27 ఏళ్లుగా అరటి పంటను పండిస్తున్నాడు. 3 రకాల పంటను పండిస్తున్నాడు. ఈ అరటి పంటకు కూడా పెట్టుబడి తక్కువ ఆదాయం ఎక్కువనే చెప్పాలి. కాకపోతే పంట చేతికి వచ్చి గెల మార్కెట్ కి వెళ్లెప్పుడు ఉన్న రేటుని బట్టి లాభాలు ఉంటాయని రైతు చెప్తున్నాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Banana, Local News, Vijayawada