దిశ హంతకుల ఎన్‌కౌంటర్... ఆ హోటల్లో ఫ్రీ... ఫ్రీ.. ఫ్రీ..

‘నలుగురిని ఎన్‌కౌంటర్ చేసిన పోలీసులను అభినందిస్తూ... ఈ రోజు ఇక్కడకు వచ్చి కాఫీ, బూస్ట్, పాలు తాగే వారికి ఉచితంగా ఇస్తాం.’ అని ప్రకటించారు.

news18-telugu
Updated: December 6, 2019, 5:58 PM IST
దిశ హంతకుల ఎన్‌కౌంటర్... ఆ హోటల్లో ఫ్రీ... ఫ్రీ.. ఫ్రీ..
నమూనా చిత్రం
  • Share this:
హైదరాబాద్‌ దిశ హంతకుల ఎన్‌కౌంటర్ జరిగింది. దీంతో బాధితురాలి ఆత్మకు శాంతి చేకూరిందని, ఆమె కుటుంబసభ్యులకు న్యాయం జరిగిందంటూ ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. పోలీసులను పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు. ఇది కేవలం తెలంగాణకు మాత్రమే కాకుండా, ఇతర రాష్ట్రాల్లో కూడా ప్రజలు వివిధ రకాల్లో తమ ఆనందాన్ని పంచుకుంటున్నారు. ఈ క్రమంలో విజయవాడకు చెందిన ఓ హోటల్ యజమాని దిశ హంతకుల మృతికి ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయిపోయాడు. ఈ రోజు మొత్తం హోటల్లో కాఫీ, బూస్ట్, పాలు తాగేవారికి ఫ్రీగా ఇస్తానని ప్రకటించాడు. ‘దిశ హత్యకు కారకులైన నలుగురిని ఎన్‌కౌంటర్ చేసిన పోలీసులను అభినందిస్తూ... ఈ రోజు ఇక్కడకు వచ్చి కాఫీ, బూస్ట్, పాలు తాగే వారికి ఉచితంగా ఇస్తాం. ఈ రోజు మాత్రమే.’ అని తెలుపుతూ ఓ పేపర్ మీద ప్రింట్ తీయించి తన హోటల్‌కు అతికించాడు.

హోటల్ యజమాని అంటించిన పోస్టర్


ఈ రోజు ఉదయం 5.45 నుంచి 6.15 మధ్య దిశ హంతకుల ఎన్‌కౌంటర్ జరిగింది. కేసు విచారణ కోసం పోలీసులు దిశను కాల్చిచంపిన స్థలానికి తీసుకెళ్లారు. అక్కడ సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేయడానికి తీసుకెళ్లారు. అయితే, అక్కడకు వెళ్లిన తర్వాత ఆరిఫ్, చెన్నకేశవులు పోలీసుల వద్ద నుంచి గన్‌లు లాక్కొని పోలీసుల మీదే కాల్పులు జరిపారని సజ్జనార్ తెలిపారు. మిగిలిన ఇద్దరు నిందితులు కూడా పోలీసులపై రాళ్లు రువ్వడంతో ప్రాణరక్షణ కోసం పోలీసులు ఎదురుకాల్పులు జరిపినట్టు చెప్పారు. ఈ ఘటనలో నలుగురు నిందితులు చనిపోయారు. ఓ ఎస్ఐ, మరో కానిస్టేబుల్ గాయపడ్డారు.

First published: December 6, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>