(K Pawan Kumar, News18, Vijayawada)
జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమాన్ని పెనుగంచిప్రోలు గ్రామంలో అధికారులు ఘనంగా నిర్వహించారు. పెనుగంచిప్రోలు మండల అధికార యంత్రాంగం కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్నారు. సీనియర్ ఓటర్లను సన్మానించారు. యువ ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రతిజ్ఞ చేయించారు
ఓటు హక్కు ప్రాధాన్యం పై అవగాహన కలిగేలా విద్యార్థులతో మానవహారం నిర్వహించారు. ఓటు ఉపయోగాలు వినియోగించుకోకపోతే కలిగే అనర్ధాలు వివరించారు మంచి వ్యక్తిని ప్రజాప్రతినిధిగా ఎంపిక చేసుకొని సహమాజ అభివృద్ధికి ఓటు బాటలు వేయాలని ఓటర్లను కోరారు.
కాకాని వెంకటరత్నం జిల్లా పరిషత్ ఉన్నత బాలురు పాఠశాలలో విద్యార్థులకు ఓటు హక్కు పై అవగాహన కల్పించారు. గ్రామ సీనియర్ ఓటర్లు, రెవిన్యూ అధికారులు గ్రామ నాయకులు అంగన్వాడి కార్యకర్తలు విద్యార్థులతో కలిసి మానవహారంగా ఏర్పడి ఓటరు ప్రతిజ్ఞ నిర్వహించారు. పాఠశాలలోని విద్యార్థులకు ముగ్గుల పోటీలు నిర్వహించి విద్యార్థులకు బహుమతులు అందజేశారు
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Local News, Vijayawada