Vijayawada Murder Mystery: కారులో యువకుడి డెడ్ బాడీ.., పోలీసుల దర్యాప్తులో సంచలన నిజాలు.. చంపింది వీళ్లేనా..?

రాహుల్ (ఫైల్)

బుధవారం రాత్రి రాహుల్ ఫోన్ రావడంతో ఒక్కడే బయకు వెళ్లాడు. కాని తర్వాతి రోజు కూడా ఇంటికి రాకపోయేసరికి..

 • Share this:
  విజయవాడ నడిబొడ్డులో నడిరోడ్డుపై దారుణహత్య జరిగింది. వ్యాపార వాటాలు, లావాదేవీల్లో తేడాలు రావడంతో ఓ యువకు పారిశ్రామిక వేత్తను వాటాదారులతో పాటు ఓ రౌడీషీటర్ హతమార్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. విజయవాడకు చెందిన కరణం రాహుల్.. కెనడాలో ఉన్నతవిద్యను అభ్యసించాడు. అనంతరం స్వదేశానికి వచ్చి.. కృష్ణాజిల్లా, జి.కొండూరు మండలం చెరువు మాధవరంలో గ్యాస్ సిలెండర్ల కంపెనీ స్థాపించాడు. ఇందులో ముగ్గురు వాటాదారులున్నారు. కొన్నాళ్ల క్రితం చిత్తూరు జిల్లా పుంగనూరులో కొత్త ప్లాంట్ కు శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం వ్యాపారం సవ్యంగానే సాగుతోంది. ఐతే బుధవారం రాత్రి రాహుల్ కు ఓ ఫోన్ కాల్ రాగా కారులో ఒక్కడే బయటకు వెళ్లాడు. రెండు గంటల తర్వాత తండ్రి రాఘవ.. రాహుల్ కు ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ వచ్చింది. గురువారం ఉదయమైనా ఇంటికి రాకపోయేసరికి తండ్రి పెనమలూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ లోగా మొగల్రాజపురం వద్ద కారులో మృతదేహాన్ని గుర్తించిననట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. వెంటనే పోలీసులు రాఘవతో సహా అక్కడికి చేరుకోగా.. ఆయన కుమారుడి మృతదేహాన్ని గుర్తించారు.

  వ్యాపార లావాదేవీల్లో వివాదం కారణంగానే హత్య జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. సిలిండర్ల పరిశ్రమలో భాగస్వామిగా ఉన్న కోరాడ విజయ్ కుమార్ గత అసెంబ్లీ ఎన్నికల్లో విజయవాడ వెస్ట్ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఓడిపోయారు. ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న ఆయన తన వాటా తీసుకొని డబ్బులు ఇచ్చేయాల్సిందిగా కొన్నాళ్లుగా రాహుల్ పై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మాట్లాడాలని పిలిచి హత్య చేసినట్లు ప్రాధమిక విచారణలో వెల్లడైంది.

  ఇది చదవండి: మహిళ టిక్ టాక్ వీడియోల మార్ఫింగ్.. సోషల్ మీడియాలో యువకుల వ్యాపారం


  బుధవారం అర్ధరాత్రి కారులో మూడు గంటల పాటు వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. రాహుల్ డ్రైవింగ్ సీట్లో ఉండగా.. వెనుక కూర్చున్న ఓ వ్యక్తి చేతులు పట్టుకోగా.. మరొకరు తాడుతో మెడను బిగించగా.. ఇంకొకరు ముఖాన్ని దిండుతో అదిపెట్టి హత్య చేసినట్లు విచారణలో తేలినట్లు సమాచారం. అనుమానితుల ఫోన్ కాల్ డేటా, ఇతర వివరాల ఆధారంగా కోరాడ విజయ్ కుమార్ తో పాటు ఆయన భార్య పద్మజ, గాయత్రి అనే మరో మహిళ, రడీషీటర్ కోగంటి సత్యం పేర్లను నిందితుల జాబితాలో చేర్చినట్లు సమాచారం. ప్రస్తుతం నిందితులు పరారీలో ఉన్నందున వారి కోసం ఐదు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. రాహుల్ హత్యకు కోగంటి సత్యమే సూత్రధారిగా అనుమానిస్తున్నారు. పరిశ్రమ మొత్తం తనకే ఇచ్చేయాలని సత్యం రాహుల్ పై ఒత్తిడి తెచ్చినట్లు దర్యాప్తులో తేలింది. ఈ హత్య వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
  Published by:Purna Chandra
  First published: