Home /News /andhra-pradesh /

VIJAYAWADA HERE IS THE EXPERTS SUGGESTIONS FOR STUDENTS WHO COMPLETED 10TH CLASS IN ANDHRA PRADESH FULL DETAILS HERE PRN VPR NJ

Vijayawada: పదో తరగతి తర్వాత దారెటో తెలియట్లేదా..? ఒక్కసారి ఈ కెరీర్ చార్ట్‌ చూడండి..

ప్రతీకాత్మక

ప్రతీకాత్మక చిత్రం

ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) లో తాజాగా పదో తరగతి ఫలితాలు (AP SSC Results) వెలువడ్డాయి. టెన్త్ క్లాస్ పాస్ అయిన విద్యార్థులు భవిష్యత్తులో ఏ రంగం వైపు అడుగులు వేయాలా అని ఆలోచనలో ఉన్నారు.

    Prayaga Raghavendra Kiran, News18, Vijayawada

    ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) లో తాజాగా పదో తరగతి ఫలితాలు (AP SSC Results) వెలువడ్డాయి. టెన్త్ క్లాస్ పాస్ అయిన విద్యార్థులు భవిష్యత్తులో ఏ రంగం వైపు అడుగులు వేయాలా అని ఆలోచనలో ఉన్నారు. రెగ్యులర్ కోర్స్‌లతో పాటు ఇంకా ఎలాంటి కోర్స్ ఉన్నాయి అని తల్లిదండ్రులు ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం మన విద్యా వ్యవస్థలో ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్‌ వరకు విద్యార్థులు కచ్చితంగా ఆరు సబ్జెక్టులు చదవాల్సిందే. ఏ సబ్జెక్ట్‌ చదవాలి..ఏది వద్దు అనే ఆప్షన్ ఉండదు. కానీ పదో తరగతి తర్వాత పిల్లలకు చాలా ఆప్షన్స్‌ ఉంటాయి. మ్యాథ్స్‌ అంటే భయపడే వాళ్లకు ఆప్షన్‌గా.. అవి లేని కోర్సులు ఉంటాయి. సైన్స్‌ అంటే భయపడే వాళ్లు.., హ్యాపీగా సైన్స్‌ లేని కోర్సులు ఎంచుకోవచ్చు.

    ఇలా పదోతరగతి తర్వాత పిల్లలకు ఎన్నో ఆప్షన్స్‌ ఉంటాయి. వాళ్ల ఆసక్తిని బట్టి వాళ్లకు నచ్చిన కోర్సును తీసుకోవచ్చు. అయితే ఈ సమయంలోనే విద్యార్థులు, వాళ్ల తల్లిదండ్రులు కాస్త ఆలోచనతో ముందడుగు వేయాలంటున్నారు నిపుణులు. విద్యార్థుల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని.. అన్ని కోర్సులపై పూర్తిస్థాయి సమాచారం తెలుసుకున్నాకే ముందుకెళ్లాలని సలహా ఇస్తున్నారు.

    SSC Students, Courses after SSC, 10th students, Suggestions for SSC Students, AP SSC Students, Andhra Pradesh SSC Students, Educational Updates, Andhra Pradesh News, Andhra News, AP News, Telugu News, Latest Telugu Breaking news, Andhra Breaking news, andhra pradesh news today, andhra pradesh news headlines, andhra pradesh news telugu, andhra pradesh news today telugu, telugu breaking news, telugu news today, telugu news paper, ఏపీలో టెన్త్ విద్యార్థులు, ఆంధ్రప్రదేశ్ లో టెన్త్ విద్యార్థులు, పదో తరగతి తర్వాత కోర్సులు, ఆంధ్రప్రదేశ్ వార్తలు, ఆంధ్రా వార్తలు, ఏపీ వార్తలు, ఏపీ తాజా వార్తలు, తెలుగు వార్తలు, తెలుగు బ్రేకింగ్ న్యూస్

    ఇంటర్, పాలిటెక్నిక్‌లను మించిన కోర్సులెన్నో..!
    విద్యార్ధులు సాధారణంగా టెన్త్ క్లాస్ పూర్తి అవగానే ఇంటర్ లేదా పాలిటెక్నిక్‌లో చేరుతారు..అలా కాకుండా వివిధ రకాల కెరీర్ ఆప్షన్స్‌ కూడా ఉన్నాయని..అందులో గొప్పగా రాణించవచ్చని అంటున్నారు విశ్లేషకులు. సాధారణంగా ఇంజినీరింగ్ చేయాలి అనుకునే వాళ్ళు యంపిసి (MPC) గ్రూప్ సెలెక్ట్ చేసుకుంటారు. మెడిసిన్ చేయాలి అనుకునే వాళ్ళు బైపీసీ (Bipc) లో జాయిన్ అవుతారు. అలానే సివిల్స్,చార్టెడ్ అకౌంటెంట్ చేయాలి అనుకునేవాళ్లు సీఈసీ (CEC), హెచ్‌ఈసీ(HEC), ఎంఈసీ (MEC)లో చేరతారు. మరికొంతమంది ఇవన్నీ కాదని డైరక్ట్‌గా పాలిటెక్నిక్‌లో జాయిన్ అవుతారు.

    ఇది చదవండి: స్కేటింగ్‌ నేర్చుకోవాలనుకునే వాళ్లకు గుడ్‌న్యూస్‌..! అక్కడ కోచింగ్ ఫ్రీ.. వివరాలివే..!


    షార్ట్‌ టర్మ్‌ కోర్సులు
    కాకుండా మాథ్స్ , సైన్స్ అంటే భయం ఉన్నవారి కోసం ఇంటర్‌లో సీఈసీ (CEC), హెచ్ఈసీ(HEC), లాంటి కోర్సులతో పాటు వివిధ రకాల వొకేషనల్ కోర్సులు , డిజిటల్ ఫోటోగ్రఫీ వంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
    లాంగ్ టర్మ్ కోర్సులతో పాటు షార్ట్ టర్మ్ కోర్సులు కూడా విద్యార్థులు ఎంపిక చేసుకోవచ్చు. ఫ్యాషన్ డిజైన్‌ (Fashion design), టెక్నాలజీ, ఇక పారామెడికల్ , హార్టికల్చర్ , ఆర్మీ (Army) ,నేవీ (Navy), ఏయర్ మెన్, హోటల్ మేనేజ్‌మెంట్ (Hotel management), టూరిజం (Tourism), అగ్రి బేస్డ్ కోర్స్ కూడా అందుబాటులో ఉన్నట్లు విశ్లేషకులు తెలిపారు.

    ఇది చదవండి: మహాత్ముడికి సరైన నివాళి ఆ కొండ.. అక్కడ ప్రత్యేకతలెన్నో..!


    డిప్లొమాలో మూడు రకాల కోర్సులు
    ఇక డిప్లొమా కోర్సులు విషయానికి వస్తే టెక్నికల్ ,నాన్ టెక్నికల్ , అగ్రికల్చరల్ మూడు రకాల కోర్సులు అందుబాటులో ఉన్నాయి. టెక్నికల్‌లో టూల్ డిజైన్ (Tool Design) , ప్లాస్టిక్ టెక్నాలజీ (Plastic Technology), పాలిటెక్నిక్ ఉంటాయని.., నాన్ టెక్నికల్ కోర్సెస్ లో హోమో సైన్స్ , డిప్లొమా ఇన్ కంప్యూటర్ టెక్నాలజీ , క్రాప్ డిజైనింగ్ , లాండ్‌ స్కేప్‌ డిజైనింగ్ , గార్మెంట్ టెక్నాలజీ కోర్సులు ఉన్నాయి. అగ్రికల్చరల్ కోర్స్ విషయానికి వస్తే హార్టికల్చర్‌, అగ్రికల్చర్, సెరికల్చర్ (Sericulture), వెటర్నరీ (Veterinary), ఫిషరీ (Fishery), పౌల్ట్రీ వంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయంటున్నారు విశ్లేషకులు. ఫైన్ ఆర్ట్స్ లో పెయింటింగ్ (Painting), వీడియోగ్రఫీ (Videography), టెంపుల్ డిజైన్, అప్లైడ్ ఆర్ట్స్ కోర్సులు ఉన్నాయి. లలిత కళలు విభాగంలో డాన్స్ (Dance), మ్యూజిక్ (Music), యాక్టింగ్, మిమిక్రీ, శిల్పకళా నైపుణ్యం వంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి.

    ఇది చదవండి: మహిళల స్వయం ఉపాధికి ఇదే పర్ఫెక్ట్ ఛాయిస్.. కాలేజీలోనే ఫ్రీ ట్రైనింగ్.. వివరాలివే..!


    ఇంజినీరింగ్ , నాన ఇంజినీరింగ్ విభాగంలో వివరాలు
    ఎలక్ట్రీషియన్ (Electrician), ఫిట్టర్, డీజిల్ మెకానిక్, ల్యాబ్ అసిస్టెంట్(Lab assistant), ప్లంబర్ (Plumber) కోర్సులు ఉన్నాయి. నాన్ ఎలక్ట్రిషన్ విభాగంలో స్టెనోగ్రాఫర్ , టైలర్, బ్యూటిషన్, డ్రెస్ మేకింగ్ , బుక్ బైండింగ్, కటింగ్, టైలరింగ్ వంటివన్నీ జాబ్ ఓరియంటెడ్ కోర్సెస్.

    ఇది చదవండి: మహిళల చేతిలో బ్రతుకు బండి.. స్పూర్తినిస్తున్న జీవిత గాధలు


    ఈ కోర్సులన్నీ ఏడాది నుంచి రెండేళ్ల కాల వ్యవధిలో ఉండే కోర్సులని విశ్లేషకులు తెలియజేశారు. ఇలా పదోతరగతి తర్వాత మనకు ఎన్నో ఆప్షన్స్‌ఉంటాయి. కానీ, మన భవిష్యత్‌ లక్ష్యానికి సాధ్యమైయ్యే ఫౌండేషన్‌ కోర్సులు సెలెక్ట్‌ చేసుకుంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. పైన ఇచ్చిన కెరీర్‌ చార్ట్‌ను ఒకసారి చూస్తే మీకు మరింత అవగాహన వచ్చే అవకాశం ఉంది. మీకు ఇప్పటికీ ఏమైనా సందేహాలుంటే విశ్లేషకులు అఖిల్‌ గారిని 9704714556 నెంబర్ ద్వారా సంప్రదించి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, AP SSC board exams, Local News, Vijayawada

    తదుపరి వార్తలు