హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

విజయవాడ దుర్గగుడిలో అవినీతి.. ఇప్పుడు మీరు చదివేది ఓ శాంపిల్ మాత్రమే..

విజయవాడ దుర్గగుడిలో అవినీతి.. ఇప్పుడు మీరు చదివేది ఓ శాంపిల్ మాత్రమే..

విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో సిబ్బంది అవినీతి

విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో సిబ్బంది అవినీతి

దుర్గ గుడిలో ఇప్పటికే అనేక సార్లు ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు. అయినా అధికారులలో ఏ మాత్రం మార్పు రావడం లేదు. దుర్గమ్మ సన్నిధిలో వారి ఇష్టారాజ్యంగా అవినీతి కి పాల్పడుతూ మాముళ్లను బహిరంగంగా వసూళ్ల చేస్తున్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Vijayawada, India

(K Pawan Kumar, News18, Vijayawada)

ఇంద్రకీలాద్రి గుడికి రోజుకి ఎంతోమంది భక్తులు వస్తూ ఉంటారు. అదే పండగలు సమయాల్లో వేల సంఖ్యలో వస్తుంటారు. దుర్గ గుడిలో రోజు రోజుకి అవినీతి పెచ్చు మీరుతుంది. మామూళ్ల మత్తులో దుర్గ గుడి అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు ఇదేంటి అని ప్రశ్నిస్తే దుర్గ గుడికి ఎదురు తిరుగుతున్న వైనం.

దుర్గ గుడిలో ఇప్పటికే అనేక సార్లు ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు. అయినా అధికారులలో ఏ మాత్రం మార్పు రావడం లేదు. దుర్గమ్మ సన్నిధిలో వారి ఇష్టారాజ్యంగా అవినీతి కి పాల్పడుతూ మాముళ్లను బహిరంగంగా వసూళ్ల చేస్తున్నారు. ఈ విషయం ఈఓ దృష్టికి తీసుకెళ్లినప్పటికి చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నట్లుగా తెలుస్తోంది. పర్యవేక్షణ లోపిస్తుంద లేక అవినీతి సిబ్బంది మామూళ్లు తీసుకుంటున్నారా అని దుర్గమ్మ దర్శనానికి వచ్చిన భక్తులనుండి వస్తున్న ప్రశ్నలు.

క్లాక్ రూమ్ వద్ద ఐదు రుపాయలు తీసుకోవాల్సిన చెప్పులు స్టాండ్ వద్ద రెండు రూపాయలు మాత్రమే తీసుకోవాలి అని నిబంధనలు పెట్టినప్పటికి వాటిని ఏ మాత్రం పట్టించుకోకుండా ఇక్కడ అవినీతికి అలవాటు పడిన సిబ్బంది రోజుకి వేలాది మంది భక్తులు అమ్మవారి దర్శనానికి వస్తుంటారు. వారి నుండి రెండు రూపాయలు తీసుకోవాల్సిన చోట ఐదు రూపాయలు, ఐదు రూపాయలు తీసుకోవాల్సిన చోట పది రూపాయలు వసూళ్లు చేస్తూ భక్తులు దగ్గర దోచుకుటున్నారు.

వారు దోచుకుంటున్న తీరుపై పలు మార్లు అధికారులకు తెలియచేసిన మరల ఇదే తీరు కొనసాగిస్తున్నారని భక్తులు వాపోతున్నారు. ఐతే రోజు క్లాక్ రూమ్ చెప్పుల స్టాండ్ వద్దఆ స్టాండ్లో పనిచేస్తున్న సిబ్బంది వేలాది రూపాయలు అవినీతికి బాగా అలవాటు పడి వసూలు చేస్తునట్లుగా తెలుస్తోంది. అసలు ఇంత జరుగుతున్న ఆ ప్రాంతానికి చెందిన పర్యవేక్షణ అధికారి ఎవరు ?

సిబ్బంది చెప్పినట్లు గానే అధికారికి వారానికి లేదా నెలకి మామూళ్లు వెళ్తున్నాయి. పేరుకే సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ అవినీతి చేస్తోంది స్పష్టంగా కనిపిస్తుంది. కెమెరాలు పెట్టేది ఎలాంటి అవినీతి కి పాల్పడకుండా ఉండటానికి అన్ని చోట్లా పెడుతూ ఉంటారు. కానీ కొందరు కెమెరాలకు కనిపిస్తున్నా అవినీతి చేస్తున్నారు. ఐతే దీన్ని బట్టి అధికారులుకి ఎంతెంత ముట్టుతున్నాయి. లేక ఇంత జరుగుతున్నా ఎందుకు ఏమి పట్టనట్లుగా వ్యవరిస్తున్నారు. అధికారులు ఇప్పుడైనా స్పందించి దేవాలయానికి వచ్చే భక్తుల వద్ద ఇలా అక్రమంగా వసూలు చేయటాన్ని ఆపాలని పలువురు భక్తులు కోరుతున్నారు.

First published:

Tags: Andhra Pradesh, Local News, Vijayawada

ఉత్తమ కథలు