Yashwanth, News18, Jaggayyapet
ఎన్టీఆర్ జిల్లా (NTR District) పెనుగంచిప్రోలులోని శ్రీ గోపయ్య సమేత తిరుపతమ్మ అమ్మవారి కళ్యాణ తలంబ్రాలకు ఎంతో విశిష్టత ఉంది. పూర్వకాలం నుంచి సంప్రదాయంగా వస్తున్న కళ్యాణం తిలకించేందుకు వచ్చిన భక్తులకు ఈ తలంబ్రాలను పంపిణీ చేయనున్నారు. శ్రీ గోపయ్య సమేత తిరుపతమ్మ అమ్మవారి కళ్యాణ మహోత్సవం ఈనెల 5వ తేదీన జరగనున్న నేపథ్యంలో అమ్మవారి కల్యాణానికి ఉపయోగించే తలంబ్రాలను ఆలయంలో వేద పండితుల వేదమంత్రోచ్చరణాల నడుమ సంప్రదాయపద్ధంగా గ్రామ ముత్తయిదువల చేత అమ్మవారి తలంబ్రాలు సిద్ధం చేయించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం కార్యనిర్వాహుకులు.. తిరుపతమ్మ దోసిట కెంపులు బ్రోవై.. గోపయ్య దోసిట నీలపు రాశై... ఆణిముత్యాలే తలంబ్రాలుగా ఇరుముల మెరిసిన గోపయ్య సమేత తిరుపతమ్మ కళ్యాణము చూద్దాం రారండి అంటూ గోపయ్య సమేత తిరుపతమ్మ కళ్యాణంలో తలంబ్రాల విశిష్టతను వివరించారు.
ఈనెల 5వ తేదీన జరగనున్న శ్రీ గోపయ్య సమేత తిరుపతమ్మ అమ్మవారి కళ్యాణ మహోత్సవం పెనుగంచిప్రోలు జరిగే కళ్యాణాన్ని తిలకించిన పుణ్యతలవుతారని శాస్త్రాలు చెబుతున్నాయి. స్వామివారి కల్యాణంలో ఉపయోగించే తలంబ్రాలను పొందేందుకు భక్తులు ఆసక్తిగా కనుబరుస్తారు. స్వామి అమ్మవారి నుదుటిపై జాలు వారే తమపై చల్లుకుంటే ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, భోగభాగ్యాలు కలుగుతాయని వారి విశ్వాసం. అలాంటి తలంబ్రాలను పొందేందుకు భక్తుల రద్దీ ప్రతి ఏడాది పెరుగుతుంది. దీంతో ఈ సంవత్సరం సుమారు లక్ష మందికి పైగా తలంబ్రాలు పంపిణీ చేసేందుకు సిద్ధం చేశారు.
పెనుగంచిప్రోలు మాత్రమే ప్రత్యేకం
అక్షతలు అంటే శాశ్వతమైనవని, నశించిపోని సుఖాలను కలుగజేసేవని పండితులు చెబుతున్నారు. వధూవరులు జీవితాంతం ఒకరికొకరు సహకరించుకుంటూ సుఖశాంతులతో గడపాలని కోరుకుంటూ ఇలా ఒకరి తలపై మరొకరు అక్షతలు పోసుకుంటారని, అయితే ఆది దంపతులైన శ్రీ గోపయ్య సమేత తిరుపతమ్మ శిరస్సుపై నుంచి జాలువారే ఈ తలంబ్రాలకు ఎంతో ప్రాధాన్యత ఉందని అంటున్నారు.
ముత్యం చంద్రునికి గుర్తు. చంద్రుడు మనసుకు అధిపతి. మనసుకు ప్రశాంతత కలిగించేవాడు చంద్రుడు గనుక అతడికి గుర్తుగా ముత్యాలను తలంబ్రాలలో కలుపుతారు. ఆలుమగల దాంపత్యం మనసుపై ఆధారపడి ఉంటుంది కాబట్టి ఇలా ముత్యాలు కలిపిన తలంబ్రాలను శిరస్సుపై పోసుకోవడం ద్వారా వారి మధ్య మరింత అనురాగం పెంపొందుతుందని, అన్యోన్యంగా జీవించడానికి ప్రతీకగా చేబ్రోలు పెనుగంచిప్రోలు లోని ముత్యాల తలంబ్రాలను శ్రీ గోపయ్య సమేత తిరుపతమ్మ తిరుకల్యాణోత్సవంలో ఉపయోగిస్తామని పండితులు వివరిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Local News, Vijayawada