VIJAYAWADA HERE ARE THE SENSATIONAL FACTS BEHIND YOUNG INDUSTRIALIST KARANAM RAHUL MURDER CASE IN VIJAYAWADA FULL DETAILS HERE PRN GNT
Vijayawada Murder Case: రాహుల్ హత్య కేసులో సంచలన నిజాలు... అందుకే చంపేశారా..? ఇంతకీ ఆ మహిళలు ఎవరు..?
రాహుల్ (ఫైల్)
Andhra Pradesh: విజయవాడలో సంచలనం సృష్టించిన యువ పారిశ్రామిక వేత్త కరణం రాహుల్ హత్య కేసులో పోలీసుల దర్యాప్తు ముందుకు సాగుతున్నకొద్దీ విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి.
విజయవాడలో సంచలనం సృష్టించిన యువ పారిశ్రామిక వేత్త కరణం రాహుల్ హత్య కేసులో పోలీసుల దర్యాప్తు ముందుకు సాగుతున్నకొద్దీ విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసును సీరియస్ గా తీసుకున పోలీసులు అన్ని కోణాల్లోనూ దర్యాతు చేస్తున్నారు. A1 కోరాడ విజయ్, A2 కోగంటి సత్యం, A3 విజయ్ భార్య పద్మజ A4 పద్మజ, A5 గాయత్రిగా ఎఫ్ఐఆర్లో పోలీసులు వెల్లడించారు. ఇప్పటికే A1 కోరాడ విజయ్ పోలీసులకు లొంగిపోయారు. ఈ హత్య కేసులో నిందితుడైన కోరాడ విజయ్.. రాహుల్ వ్యాపార భాగస్వాములుగా. 2016లో కృష్ణాజిల్లా మైలవరం సమీపంలోని జి.కొండూరులో జిక్సన్ సిలిండర్ కంపెనీ ప్రారంభించారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో విజయవాడ వెస్ట్ నుంచి పోటీ చేసి విజయ్ ఆర్ధికంగా నష్టపోయారు. దీంతో తన షేర్లు తీసుకుని డబ్బు ఇవ్వాలని రాహుల్పై విజయ్ ఒత్తిడి తెచ్చారు. ఐతే రాహుల్ వద్ద డబ్బు లేకపోవడంతో షేర్లు తీసుకోలేదు. ఈ లోగా వ్యవహారంలో రౌడీ షీటర్ కోగంటి సత్యం ఎంటర్ అయ్యారు.
కోరాడ విజయ్ వాటాను కొనేందుకు కోగంటి ముందుకు రావడంతోనే అసలు కథ మొదలైనట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. కోగంటి సత్యం కంపెనీ మొత్తం తనకే ఇచ్చేయాలని లేదా తనను సంస్థలోకి తీసుకోవాలని కోరినట్లు సమాచారం. కోగంటిని కంపెనీలోకి తీసుకునేందుకు రాహుల్ నిరాకరించడంతోనే ఈ మర్డర్ జరిగినట్లు భావిస్తున్నారు. రాహుల్ తండ్రి కంప్లైంట్ మేరకు ఐదుగురిలోని ఒక మహిళ వద్ద రాహుల్ ఆరు కోట్ల రూపాయలు తీసుకున్నట్లుగా ప్రాధమిక విచారణలో తేలింది.
ఐతే రాహుల్ కి ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు ఎందుకు ఇచ్చారు..? అసలు మర్డర్ జరిగినప్పుడు వీరు హత్యజరిగిన ప్రాంతంలో ఉన్నారా..? అనే కోణంలో దర్యాప్తు జరుగుతుంది. ఐతే రాహుల్ ఇంటి నుండి వెళ్లేటప్పుడు రెండు ఫోన్లు తీసుకెళ్లినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. హత్య జరిగిన వాటిలోని ఒక ఫోన్ మిస్ అయిందని వాటి నుండి చివరిగా ఎఫ్ఐఆర్ లో ఉన్న మహిళలకు కాల్ వెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో వారి పాత్రపై అనుమానాలు రేకెత్తుతున్నాయి.
ఐతే ప్రస్తుతం తెర ముందుకొచ్చినోళ్లు అసలు సూత్రధారులు కాదని.. కుట్రధారులు వేరే ఉన్నారన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి. అసలు, రాహుల్ ను ఎవరు చంపారు దీని వెనుకున్న అసలు కుట్రదారులు ఎవరన్నది హత్యకు పధకం వేసిందెవరు అమలు పరిచిందెవరు అనే కోణంలో విచారణ జరుగుతోంది. కోరాడ విజయ్ డ్రైవర్ బాబు ఇచ్చిన వాంగ్మూలమే కేసులో అత్యంత కీలకంగా మారిందని ఐతే నిన్న ఏ1 గా వున్నా కోరాడ విజయ్ తన న్యాయవాదితో వచ్చి పోలీసుల ఎదుట లొంగి పోవటంతో రాహుల్ మర్డర్ లోని చిక్కు ముడులు విడిపోనున్నాయి. రాహుల్ జిక్సిన్ కంపెనీని తక్కువ ధరకు కొట్టేసేందుకు బడా బాబులు చేసిన కుట్రలు కుతంత్రాలు పనిచేయకపోవడంతోనే హత్య జరిగిట్లు నిర్ధారణ అయింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.