ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఇటీవల డ్రగ్స్ కలకలం రేగిన సంగతి తెలిసిందే..! విజయవాడ (Vijayawada) నుంచి విదేశాలకు డ్రగ్స్ సరఫరా (Drugs smuggling) అవుతున్న సంగతి బయటపడింది. విదేశాలకు పార్శిల్ చేసిన కొరియర్ వెనక్కి రావడంతో బెజవాడ డ్రగ్స్ కు కేరాఫ్ అడ్రస్ గా మారిందన్న విమర్శలు వచ్చాయి. డ్రగ్స్ ఇష్యూని సీరియస్ గా తీసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో విచారణ జరిపారు. పార్శిల్ చేసిన వ్యక్తిని, సంబంధిత ఆధార్ కార్డు ఆధారంగా దర్యాప్తు చేశారు. విచారణలో పోలీసులకు విస్తుపోయే నిజాలు తెలిశాయి. ఈ దందా వెనుక చెన్నైకి చెందిన అరుణాచలం అనే వ్యక్తి హస్తమున్నట్లు తేలింది. పోలీసులకు చిక్కకుండా, ఎవరికీ అనుమానం రాకుండా స్మగ్లింగ్ జరుగుతున్నట్లు గుర్తించారు.
విజయవాడ నుంచి డ్రగ్స్ కొరియర్ చేసిన అరుణాచలం అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న అతడ్ని విచారించగా అసలు నిజం చెప్పాడు. విజయవాడకు చెందిన సాయి గోపి అనే యువకుడి ఆధార్ కార్డును మార్ఫింగ్ చేసిన అరుణాచలం దాని ఆధారంగా విజయవాడ నుంచి డ్రగ్స్ సరఫరా చేశాడు. ఇతర ప్రాంతాల నుంచి చెన్నై చేరిన డ్రగ్స్ ను సీక్రెట్ గా విజయవాడ తీసుకొస్తున్న అరుణాచలం.. ఇక్కడి ఆధార్ కార్డును ఫోర్జరీ చేసి అందులోని ప్రూఫ్స్ ఆధారంగా పార్శిల్ చేస్తున్నాడు. ఇలా విదేశాలకు పంపిన పార్శిల్ తిరిగిరావడంతో అసలు నిజం బయటపడింది.
విజయవాడ నంచి డ్రగ్స్ పార్శిల్ చేశారని.. ఇక్కడ ఎలాంటి మాఫియా లేదని పోలీసులు స్పష్టం చేశారు. ఇందులో మరో ఇద్దరి పాత్ర ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. చెన్నై నుంచి కొరియర్ చేస్తే అక్కడి పోలీసులకు చిక్కుతారనే అనుమానంతో విజయవాడను ఎంచుకున్నట్లు డీఎస్పీ మేరీ ప్రశాంతి వెల్లడించారు. విజయవాడ నుంచి విదేశాలకు కొరియర్ పంపే సంస్థలు జాగ్రత్తగా ఉండాలని.. ఇకపై కొరియర్ సంస్థలపైనా నిఘా ఉంచుతామన్నారు.
ఇదిలా ఉంటే గతంలో విజయవాడ అడ్రస్ తో భారీగా డ్రగ్స్ కొరియర్ వచ్చినట్లు అరోపణలు వచ్చాయి. ట్యాల్ కమ్ పౌడర్ వ్యాపారం పేరుతో కస్టమ్స్ అధికారులను నమ్మించిన ఓ వ్యక్తి.. ఇక్కడికి లోడ్ తెప్పించుకొని ఇతర ప్రాంతాలకు పంపుతున్నాడు. ఐతే గుజరాత్ పోర్టులో అధికారులకు అనుమానం రావడంతో ఆరా తీయగా విజయవాడ అడ్రస్ బయటపడింది. దీనిపై విచారణ జరపగా విజయవాడలో ఎలాంటి సంస్థ లేకపోయినా ఓ ఇంటి అడ్రస్ చూపించి డ్రగ్స్ సరఫరా చేసినట్లు విచారణలో తేలింది. అప్పట్లో ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Drugs racket, Vijayawada