Drugs Racket: హెరాయిన్ కేసులో సంచలన నిజాలు.. విజయవాడతో లింక్ ఎలా కుదిరిందంటే.!

ప్రతీకాత్మక చిత్రం

గుజరాత్ (Gujarat) లోని ముంద్రా పోర్టులో (Mundra Port) హెరాయిన్ (Heroin) పట్టుబడిన వ్యవహారంపై దర్యాప్తు కొనసాగుతోంది. ఆఫ్ఘనిస్తాన్ నుంచి విజయవాడ (Vijayawada) అడ్రస్ తో కంటైనర్లో వస్తున్న డ్రగ్స్ ను అధికారులు సీజ్ చేసిన సంగతి తెలిసిందే.

 • Share this:
  గుజరాత్ (Gujarath) లోని ముంద్రా పోర్టులో (Mundra Port) హెరాయిన్ (Heroin) పట్టుబడిన వ్యవహారంపై దర్యాప్తు కొనసాగుతోంది. ఆఫ్ఘనిస్తాన్ (Afghanisthan) నుంచి ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లోని  విజయవాడ (Vijayawada) అడ్రస్ తో కంటైనర్లో వస్తున్న డ్రగ్స్ ను అధికారులు సీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఐతే ఈ వ్యవహారంలో దర్యాప్తు కొనసాగుతున్న కొద్దీ సంచలన విషయాలు బయటపడుతున్నాయి. ఆఫ్ఘనిస్తాన్ నుంచి డ్రగ్స్ ను ఎవరు తరలిస్తున్నారు.. ఇక్కడ ఎవరు కో-ఆర్డినేట్ చేస్తున్నారు.. ఎవరిద్వారా ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారనే అంశంపై అధికారులు క్లారిటీకి వచ్చినట్లు తెలుస్తోంది. ఆఫ్ఘనిస్తాన్ కు చెందిన హసిఫ్ హసన్ అనే వ్యక్తి అక్కడి నుంచి డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. భారత్ లో అమిత్ అనే వ్యక్తిని హసన్ ప్రతినిధిగా పెట్టుకున్నాడు. అతడితో పాటు మరికొందరు కలిసి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన సుధాకర్, అతడి భార్య వైశాలి పేరిట విజయవాడలో ఒక ఫేక్ ట్రేడింగ్ కంపెనీను మొదలుపెట్టారు.

  విజయవాడ గాంధీనగర్లోని చిరుమానా ద్వారా ఎక్స్ పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ కు సంబంధించిన పర్మిషన్ తీసుకున్నారు. ఆతర్వాత టాల్కంపౌడర్ ఇతర సరుకులను దిగుమతి చేసుంటున్నట్లు నమ్మిస్తూ హెరాయిన్ తెప్పిస్తున్నారు. సెమీ ప్రాసెస్డ్ టాల్కం పౌడర్ ద్వారా పోర్టు గుండా డ్రగ్స్ ని విజయవాడ తీసుకొచ్చి ఇక్కడి నుంచి అమిత్ ఆదేశాల ద్వారా దేశంలోని వివిధ ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. అమిత్ కు సరుకు విక్రయిస్తున్నట్లు సుధాకర్ ఇన్వాయిస్ లు రూపొందిస్తూ వారికి సహకిరించాడు.

  ఇది చదవండి: ఆ ఐడియా మనకెందుకు రాలేదబ్బా..? జగన్ ప్రచార వ్యూహంపై టీడీపీలో చర్చ..!  ఇదే విధానంలో హసన్ ఈ ఏడాది జూన్ లో డ్రగ్స్ ను అషీ కన్ ట్రేడింగ్ కంపెనీ పేరుతో విజయవాడకు పంపి.. అక్కడి నుంచి ఢిల్లీలోని కుల్ దీప్ సింగ్ అనే వ్యక్తికి చేరవేశారు. మరోసారి ఇదే తరహాలో డ్రగ్స్ తరలించేందుకు యత్నించగా డీఆర్ఐ అధికారులకు పట్టుబడ్డారు. ఈ డ్రగ్స్ రాకెట్ కు సంబంధించిన డబ్బులు హవాలా రూపంలో సుధాకర్ భార్య వైశాలి బ్యాంక్ ఎకౌంట్లో జమయ్యేవి.

  ఇది చదవండి: కీలక పదవుల భర్తీకి సీఎం జగన్ కసరత్తు... లిస్టులో ఉన్న నేతలు వీళ్లేనా..?  ఈ డ్రగ్స్ వ్యవహారం ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ దుమారం రేగిన సంగతి తెలిసిందే. దీని వెనుక అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల హస్తముందని ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపించారు. ఐతే రాష్ట్రంతో సంబంధం లేని అంశాన్ని ప్రభుత్వానికి అంటగట్టి పరువు తీస్తున్నారంటూ అధికార పార్టీ నేతలు కౌంటర్ ఇచ్చారు. అలాగే కాకినాడ పోర్టులో బోటు దగ్ధమైన ఘటన వెనుక డ్రస్ మాఫియా హస్తముందని టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర ఆరోపించగా.. ఆయనకు పోలీసులు నోటీసులిచ్చిన సంగతి తెలిసిందే.

  ఇది చదవండి: అమ్మఒడిపై సీఎం జగన్ కీలక నిర్ణయం.. వచ్చేఏడాది నుంచి ఈ మార్పులు...  ఇదిలా ఉంటే గత నెలలో గుజరాత్ లోని ముంద్రా పోర్టులో వేలకోట్లు విలువచేసే హెరాయిన్ ను డీఆర్ఐ అధితాకులు పట్టుకున్నారు. కంటైనర్లోని సరుకు డెలివరీ అడ్రస్ విజయవాడకు చెందిన ఓ ఇల్లు కావడంతో ఏపీలో కలకలం రేగింది.
  Published by:Purna Chandra
  First published: