హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

కృష్ణమ్మ ఒడిలో చేపల వేటపైనే ఆధారం..! మత్స్యకారుల జీవన విధానం ఇదే..!

కృష్ణమ్మ ఒడిలో చేపల వేటపైనే ఆధారం..! మత్స్యకారుల జీవన విధానం ఇదే..!

X
నదిలో

నదిలో చేపలవేట ఎంతకష్టమో తెలుసా..?

చేపలు తీసుకునేప్పుడు మనం ఎక్కువ రేటు ఉన్నాయని, ఇలా ఉన్నాయని, అలా ఉన్నాయని ఎన్నో మాటలు అంటూ వంకలు పెడుతూ ఉంటారు. కానీ చేపలు పట్టడం ఎంత కష్టమో చాలా మందికి తెలీదు.

  • News18 Telugu
  • Last Updated :
  • Vijayawada, India

K Pawan Kumar, News18, Vijayawada

చేపలు అంటే ఇష్టపడని వారంటూ ఎవరు ఉండరు.. చేపలు తినడం వలన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. నది చేపలు అయితేఒక రుచి ఒక ధర ఉంటుంది. అదే చెరువు చేపలు అయితేఒక రుచి, ధర ఉంటాయి. అలాగే చేపలు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కానీ చేపలు తీసుకునేప్పుడు మనం ఎక్కువ రేటు ఉన్నాయని, ఇలా ఉన్నాయని, అలా ఉన్నాయని ఎన్నో మాటలు అంటూ వంకలు పెడుతూ ఉంటారు. కానీ చేపలు పట్టడం ఎంత కష్టమో చాలా మందికి తెలీదు. చెరువులో చేపలు పట్టడం అంటే... ఒడ్డున ఉండి వల వేసి చేపలు పట్టేస్తారు.

నదిలో చేపల వేట అంటే ఎంతో కష్టమైనది. నది ఒడ్డున చేపలు పడవు అందుకే నది మధ్యలోకి వెళ్లి మరీ చేపలు పట్టాల్సి ఉంటుంది. అది కూడా సాయంత్రం 4గం.ల తర్వాత నాటు పడవ వేసుకుని నదిలోకి వెళ్లి రాత్రి 7 వరకు చేపల వేట సాగిస్తారు. కొందరు రాత్రి సమయంలో వెళ్లి తెల్లవారుజాము వరకు చేపల వేట సాగిస్తారు. రాత్రంతా నాటు పడవపైనే ఉండి చేపలు పడుతుంటారు. చిమ్మచీకట్లోనే పడవపై ఉంటు చేపలు పడుతుంటారు. రాత్రిళ్లు దోమలు, హానికారక పురుగులు, పాముల వంటి వాటితో పోరాడుతూనే జీవన పోరాటం చేస్తామని మత్స్యకారులు చెప్తున్నారు.

ఇది చదవండి: గుంత ఆమ్లెట్ ఎప్పుడైనా తిన్నారా..? ఎలా చేస్తారో తెలుసా..?

తమకు చేపలవేట తప్ప మరో జీవనాధారం లేదని.. అందుకే ప్రాణాలకు తెగించి చేపలవేట సాగిస్తామని మత్స్యకారులు చెబుతుంటారు. నదిలో రాత్రంతా పడిగాపులుగాసి వేట సాగిస్తే.. ఉదయం 8గంటల లోపు వచ్చి వాటిని విక్రయించాల్సి ఉంటుంది. వానాకాలం, చలికాలంలో రాత్రళ్లు చేపలుపట్టడం కత్తిమీద సామేనంటున్నారు మత్స్యకారులు. చేపల కోసం ఒక్కసారి నదిలోకి వెళ్ళాక ఎప్పుడూ ఏమవుతుందో చెప్పలేమని ప్రాణాలు అరచేయిలో పెట్టుకుని వెళ్లి రావడమే అంటున్నారు. అంతటి ప్రాణాలు మీదకు తెచ్చుకుని ఇలా చేపలు పట్టడం దేనికి, వేరే పని చేసుకోవచ్చు కదా అని ప్రశ్నిస్తే తమ వృత్తి ఇదేనంటూ ఈ పని తప్ప తాము వేరేదీ చేయలేమంటున్నారు.

చేపల వేట వృత్తిసాగించడమంటే ఖర్చుతో కూడుకున్న పనేనంటున్నారు మత్స్యకారులు. పడవలు, వలలు కొనడానికి అప్పులు చేయాలని.. వచ్చే అరకొర ఆదాయం వాటికి వడ్డీలు చెల్లించడానికే సరిపోతుందటున్నారు. ఒకప్పుడు రూ.50వేల నుంచి రూ.60వేల మధ్య ఉండే నాటు పడవ ధర ఇప్పుడు రూ.లక్ష వరకు అవుతోంది. పడవల నిర్వహణ, వలల వంటివాటికి మరికొంత వెచ్చించాలని.. అంత పెట్టుబడి పెట్టినా వేట సరిగా సాగకపోతే నష్టాలు తప్పవంటున్నారు.

First published:

Tags: Andhra Pradesh, Krishna River, Local News, Vijayawada