K Pawan Kumar, News18, Vijayawada
తెలుగు రాష్ట్రాల్లో నిత్యం ప్రేమోన్మాదులు చేస్తున్న దారుణాలు జరుగుతునే ఉన్నాయి..ఇలా జరిగే దారుణాలుకు కూడా బ్రేక్స్ పడటం లేదు. తాజాగా గుంటూరు జిల్లాలో మరొక దారుణం జరిగింది. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిని బ్లేడ్‌తో గొంతు కోసి చంపాడు ఉన్మాది. జిల్లాలోని పెద్దకాకని మండలం తక్కెళ్లపడు లో ఈ ఘటన జరిగింది.
కృష్ణా జిల్లా పమిడి ముక్కల మండలం కృష్ణా పురానికి చెందిన తపస్వి ఆమెకు కృష్ణా జిల్లా.. ఉంగుటూరు మండలం మానికొండకు చెందిన జ్ఞానేశ్వర్ ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయమయ్యాడు. రోజు మాట్లాడుకుంటూ వుండేవారు అలా వారి మధ్య స్నేహం మొదలై అది కాస్తా ప్రేమగా మారింది. తపస్వి విజయవాడలోని ఓ మెడికల్ కాలేజీలో BDS థర్డ్ ఇయర్ చదువుతోంది. జ్ఞానేశ్వర్ సాప్ట్వేర్ ఇంజినీర్. వీరిద్దరూ కొన్నాళ్లు గన్నవరంలో ఉన్నట్లుగా తెలుస్తుంది. అప్పుడు వీరి మధ్య ఎప్పుడూ గొడవలు జరుగుతూ ఉండేవి. ఆ గొడవలు కాస్త ముదరడంతో తపస్వి అతనిపై కృష్ణా జిల్లాలోని పోలీస్‌స్టేషన్‌లో కంప్లైంట్ ఇచ్చింది.
అలా గొడవలు పడొద్దని పోలీసులు జ్ఞానేశ్వర్ కి కౌన్సెలింగ్ ఇచ్చి పంపారు . దానితో అతడు ఆమె జోలికి వెళ్లను అన్నాడే కానీ అతని తీరు ఏ మాత్రం మార్చుకోక పొగ రోజు ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు. ఇబ్బందిని భరించలేక తపస్వి తక్కెళ్లపాడులోని తన స్నేహితురాలికి విషయం చెప్పుకుని బాధ పడింది. అప్పుడు ఆ స్నేహితురాలు అతనితో ఓసారి మాట్లాడి చూద్దాం అని చెప్పి జ్ఞానేశ్వర్‌ని తన ఇంటికి పిలిపించింది. సోమవారం రాత్రి 9 గంటల సమయంలో గుంటూరు జిల్లా పెదకాకాని మండలం తక్కెళ్లపాడులోని స్నేహితురాలి ఇంటిపై అంతస్థులో వారు మాట్లాడుకోటం మొదలు పెట్టారు. యథవిధిగా వారు మళ్ళీ గొడవ పడ్డారు అప్పుడు కూడా జ్ఞానేశ్వర్ తనను పెళ్లిచేసుకోమని ఇబ్బందికి గురి చేశాడు. అది భరించలేని తపస్వి తాను మరో అబ్బాయిని పెళ్లి చేసుకుంటున్నానని చెప్పింది.
దానితో జ్ఞానేశ్వర్లోని సైకో బయటకు వచ్చాడు. వెంటనే జేబులోంచీ బ్లేడ్ తీసి ఆమె గొంతు కోసేశాడు. అది చూసిన ఆమె స్నేహితురాలు గట్టిగా అరుస్తూ తమ స్నేహితురాలిని కాపాడుకునేందుకు పై అంతస్తు నుంచి కిందకు పరుగులు తీసింది.వారి నివాసం ఉంటున్న ఇంటి యజమానికి చెప్పి పైకి తీసుకెళ్లింది. అప్పటికే ఆ దుర్మార్గుడు ఆమెను మరో గదిలోకి లాక్కెళ్లి .తలుపులు వేసి జ్ఞానేశ్వర్ అతి దారుణంగా అదేపనిగా గాయపరుస్తూనే వున్నాడు.
చుట్టూ పక్కల నివాసం ఉంటున్న స్థానికులు వచ్చి తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లారు. అతన్ని ఆ గదిలోనే బంధించి బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. జ్ఞానేశ్వర్ అదే బ్లేడ్‌తో తన చేతిపై గాయం చేసుకుని సూసైడ్ చేసుకో పోగా స్థానికులు అడ్డుకుని పోలీసులకు అప్పగించారు. గాయపడిన తపస్విని ఆస్పత్రికి తరలించిన కాసేపటికే తపస్వి చనిపోయింది. తపస్వి తల్లిదండ్రులు ముంబైలో ఉండటంతో వారికి సమాచారం అందించారు పోలీసులు.అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.ఇది తెలిసిన వారు చుట్టుపక్కల వారంతా ఇలాంటి వారిని ఇప్పటికైనా కఠినంగా శిక్షించాలని అప్పుడే ఇలాంటి దారుణాలు జరగవని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Local News, Vijayawada