ఉపరాష్ట్రపతి వెంకయ్య చొరవ...విజ‌య‌వాడ - గూడూరు మ‌ధ్య ఇంట‌ర్ సిటీ ఎక్స్‌ప్రెస్‌

ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సూచన మేరకు విజయవాడ-గూడూరు మధ్య ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ రైలు సేవలను త్వరలోనే ప్రారంభించేందుకు రైల్వే బోర్డు ఆమోదముద్ర వేసింది.

news18-telugu
Updated: July 26, 2019, 7:16 PM IST
ఉపరాష్ట్రపతి వెంకయ్య చొరవ...విజ‌య‌వాడ - గూడూరు మ‌ధ్య ఇంట‌ర్ సిటీ ఎక్స్‌ప్రెస్‌
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: July 26, 2019, 7:16 PM IST
దక్షిణ కోస్తా జిల్లాల ప్రజలు చిరకాల స్వప్నం నెరవేరనుంది. దక్షిణ కోస్తా జిల్లాల ప్రజలు నవ్యాంధ్రప్రదేశ్ రాజధానికి సులువుగా చేరేందుకు వీలుగా విజయవాడ-గూడూరు మధ్య కొత్త ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ రైలు సేవలను త్వరలో ప్రారంభించనున్నారు. ఈ మేరకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేసిన సూచనకు రైల్వే బోర్డు ఆమోదముద్ర వేసింది.

రైల్వేబోర్డు ఆదేశించిన మేరకు గూడూరు-విజయవాడ సూపర్ ఫాస్ట్ ఇంటర్‌సిటీ రైలు(నంబరు 12743) ప్రతిరోజూ గూడూరు నుండి ఉదయం 06:10 గంటలకు బయలుదేరి విజయవాడకు ఉదయం 10:40 గంటలకు చేరుతుంది. తిరుగు ప్రయాణంలో విజయవాడ-గూడూరు సూపర్ ఫాస్ట్ ఇంటర్‌సిటీ రైలు (నంబరు 12744) విజయవాడ నుండి ప్రతిరోజూ సాయంత్రం 06:00 గంటలకు బయలుదేరి గూడూరుకు రాత్రి 10:30 గంటలకు చేరుతుంది. కేవలం నాలుగున్నర గంటల వ్యవధిలో ఈ ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ గూడూరు నుంచి విజయవాడకు చేరుకుంటుంది.

మార్గమధ్యలో ఈ రైలు నెల్లూరు, కావలి, సింగరాయకొండ, ఒంగోలు, చీరాల, బాపట్ల, మరియు తెనాలి రైల్వేస్టేషన్లలో ఆగనున్నది. ఈ రైలు రెండు ఏసి చైర్ కార్, పది నాన్ ఏసి చైర్ కార్, రెండు పవర్ కార్ బోగీలతో మొత్తం పద్నాలుగు బోగీలతో నడవనున్నది. ఈ నూతన రైలుకు సంబంధించిన అధునాతన ఎల్‌హెచ్‌బీ బోగీలు ఇప్పటికే విజయవాడకు చేరుకోవడంతో అతి త్వరలో ఈ రైలు సేవలు ప్రారంభం కానుంది. ఈ రైలు రేక్ ని నిర్వహించే బాధ్యత విజయవాడ డివిజన్‌కు అప్పగించారు.ఈ రైలును ప్రారంభించేందుకు స్వయంగా వెంకయ్యనాయుడు వస్తారని స‌మాచారం.

First published: July 26, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...