K Pawan Kumar, News18, Vijayawada
దేశంలోని అనేక నగరాలు, పట్టణాలు నీటి ఎద్దడిని ఎదుర్కొంటుంటాయి. ఇంటింటికీ తాగునీటి సరఫరా చేసేలా సరైన ఏర్పాట్లు లేకపోవడం వల్ల ప్రజలకు ఈ పరిస్థితి తప్పడం లేదు. సాధారణంగా కొన్ని చోట్ల వేసవి కాలంలో నీరు దొరకక ఇబ్బందులు పడుతూ ఉంటారు. వేసవికి ముందేవీధుల్లోకి వచ్చే నీళ్ల ట్యాంకర్ల వద్ద బిందెలతో బారులు తీరుతున్నారు అక్కడ. ప్రభుత్వం అరకొరగా సరఫరా చేసే నీరు చాలక ప్రైవేటు ట్యాంకర్లనూ ఆశ్రయిస్తున్నారు అక్కడ ప్రజలంతా. నీటి కోసం ట్రాక్టర్లు ఎప్పుడు వస్తాయా అని కాలనీ వాసులు అంత ఎదురు చూస్తున్నారు. ట్యాంకర్లు రాగానే యుద్ధాలు, బల ప్రదర్శనలు చేసి మరీ నీరు పట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చిందక్కడ. ఇలా చేయడంతో బలవంతుడికి నాలుగు బిందేలు, బలహీనుడుకి ఒకటి లేదా రెండు బిందెలు నీరే లభిస్తుంది.
ఏంటి ఇదంతా ఎక్కడ జరుగుతుంది అని అనుకుంటున్నారా ఎమ్మెల్యేకొడాలి నాని నియోజకవర్గంలో గుడివాడ పట్టణానికి సమీపంలో ఉన్నటువంటి మళ్లాయపాలెం పంచాయతీకి చెందిన శ్రీకాళహస్తీశ్వర కాలనీలో ప్రజలు ఎదుర్కొంటున్న దుస్థితి.
గుడివాడ లోని పేద ప్రజలకు ఇల్లు కల్పించాలని వాల్మీకి, అంబేద్కర్, ఆవాస్ యోజన కింద రెండు దశబ్దాలు క్రితం మండలంలోని దొండపాడు రోడ్ లోని శ్రీకాళహస్తీశ్వర కాలనీలోనాటి కేంద్ర ప్రభుత్వం ఇల్లు స్థలాలు ఇచ్చి ఇంటిని ఏర్పాటు చేసుకోడానికి రుణాలు ఇచ్చింది. మౌలిక వసతులు కల్పించాల్సిన పురపాలక సంఘంసిమెంట్ రోడ్లు,కాలువలు,విద్యుత్ సరఫరా తదితరాలన్నీ ఏర్పాటు చేసింది.
మంచి నీటి కోసం పైపు లైన్లు వేసినప్పటికి తాగు నీటి మెయిన్ లైన్ కు అనుసంధానం చేయకుండా వదిలేశారు దీనితో కాలనీ వాసులకు బోరు నీరే దిక్కు అయ్యింది. సమస్యను పరిష్కరిస్తామని ప్రతి ఎన్నికల్లో హామీ ఇస్తున్నారు తీరా గెలిచాక తమ వైపు కన్నెత్తి కూడా చూడటం లేదని అక్కడి వారంతా లబోదిబోమంటున్నారు. బైపాస్ రోడ్లో నిర్మిస్తున్న మంచినీటి పథకం ట్యాంక్ నుండి ఆ కాలనీ వాసులకు పైప్ లైన్స్ అనుసంధానం చేయాలని ప్రజలు కోరుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Gudivada, Local News, Vijayawada