Home /News /andhra-pradesh /

Shocking: గంటలో పెళ్లనగా గోడదూకి వరుడు పరారీ... కానీ పెళ్లి జరిగింది.. ఈ స్టోరీలో మలుపులెన్నో..

Shocking: గంటలో పెళ్లనగా గోడదూకి వరుడు పరారీ... కానీ పెళ్లి జరిగింది.. ఈ స్టోరీలో మలుపులెన్నో..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

గంటలో పెళ్లనగా సినిమాల్లో మాదిరిగా పెద్దకేక. పెళ్లికొడుకు కనిపించడం లేదంటూ ఇంట్లో హడావిడి. కాసేపట్లో పెళ్లనగా వరుడు కనిపించకపోవడంతో కలకలం రేగింది.

    అబ్బాయికి అమ్మాయి నచ్చింది.. అమ్మాయికి అబ్బాయి నచ్చాడు. కట్నకానుకలు, ఇతర లాంఛనాలన్నీ మాట్లాడుకున్నారు. నిశ్చితార్థం జరిగింది. శుభలేఖలు పంచేశారు. పెళ్లి పందిరి, మండపం అంతా సిద్ధమైంది. గంటలో పెళ్లనగా సినిమాల్లో మాదిరిగా పెద్దకేక. పెళ్లికొడుకు కనిపించడం లేదంటూ ఇంట్లో హడావిడి. కాసేపట్లో పెళ్లనగా వరుడు కనిపించకపోవడంతో అతడి తల్లిదండ్రులతో పాటు వధువు, ఆమె తరపు బంధువులు కూడా కంగారు పడిపోయాడు. సినీఫక్కీలో వరుడ్ని పట్టుకొచ్చిన పోలీసులు పెద్దల జోక్యంతో పెళ్లి చేశారు. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లోని విజయవాడ (Vijayawada) శివారు పెనమలూరుకు చెందిన అనిల్ అనే యువకుడి.. ఇటీవలే పెళ్లి కుదిరింది. ఈనెల 21న పెళ్లి ముహూర్తం నిర్ణయించారు. గురువారం ఉదయం 10.30 గంటలకు పెళ్లి జరగాల్సి ఉంది. ఐతే గంటలో పెళ్లనగా వరుడు అనిల్ ఇంటి గోడదూకి పారిపోయాడు.

    తిరిగొచ్చిన వరుడు..
    విజయవాడ నుంచి బైక్ పై హైదరాబాద్ (Vijayawada to Hyderabad) వెళ్లాడు. ఐతే అనిల్ వెళ్లిపోవడంతో వధువు తల్లిదండ్రులు పెనమలూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఐతే పోలీస్ కంప్లైంట్ విషయం తెలుసుకున్న అనిల్.. మళ్లీ విజయవాడకు రిటర్న్ అయ్యాడు. సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా అనిల్ ను ట్రాక్ చేసిన పోలీసులు కృష్ణాజిల్లా నందిగామ వద్ద అదుపులోకి తీసుకున్నారు. అతడ్ని పెనమలూరు తీసుకురావడంతో ఇరు వర్గాల పెద్దలు మాట్లాడుకొని మరో శుక్రవారం పెళ్లి జరిపించారు. ఐతే అనిల్ ఎందుకు వెళ్లిపోయాడు. పెళ్లి ఇష్టం లేక వెళ్లాడా..? లేక పెట్టిపోతల్లో అసంతృప్తి వల్ల వెళ్లిపోయాడా..? అనేది మాత్రం తేల్లేదు. ఐతే ఇరువర్గాల వారు రాజీకి వచ్చి పెళ్లి జరిపించడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

    ఇది చదవండి:వీడో సోషల్ మీడియా రోమియో.. అమ్మాయిలు, మహిళలకు వల.., మొబైల్ ఫోన్లో షాకింగ్ వీడియోలు..



    విశాఖలో ఇలాగే..
    ఇక ఇటీవల విశాఖపట్నంలోని (Visakhapatnam) అరిలోవ ప్రాంతానికి చెందిన ఓ అనే యువతి కాసేటట్లో పెళ్లనగా పోలీసులకు ఫోన్ చేసి తల్లిదండ్రులు తనకు బలవంతంగా పెళ్లి చేస్తున్నారని ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి పెళ్లిని ఆపేశారు. ఆమెను పోలీస్ స్టేషన్ కు తరలించి రక్షణ కల్పించారు. ఐతే ఆ తర్వాతి రోజే ఆమె తాను ప్రేమించిన వ్యక్తిని సింహాచలం ఆలయంలో పెళ్లి చేసుకుంది. ఈ ఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది.

    ఇది చదవండి: భర్త మర్మాంగంపై వేడినీళ్లు పోసిన భార్య... ఎంత కోపమొస్తే మాత్రం అలా చేస్తారా..?



    అలాగే చిత్తూరు జిల్లాలో ఓ యువతి కాసేపట్లో పెళ్లనగా అర్ధరాత్రి ముహూర్తం కావడంతో కల్యాణమండపం నుంచి పరారైంది. దీంతో పెళ్లి అర్ధాంతరంగా నిలిచిపోయింది. పెళ్లి ఇష్టం లేకపోవడం, పెద్దలను ఎదురించలేకపోవడం, ప్రేమ వ్యవహారాలను ధైర్యంగా చెప్పలేకపోవడంతో ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయి.

    మీ నగరం నుండి (​విజయవాడ)

    ఆంధ్రప్రదేశ్
    ​విజయవాడ
    ఆంధ్రప్రదేశ్
    ​విజయవాడ
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Krishna District, Marriage, Vijayawada

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు