Home /News /andhra-pradesh /

VIJAYAWADA GOVERNMENT TEACHERS TENSION ABOUT FIRST DAY FACE RECOGNITION SYSTEM NOT WORKING NGS

Teachers Attendance: టీచర్లకు తప్పని నిమిషం టెన్షన్.. టైమ్ కు వెళ్లినా.. పనిచేయని నెట్ వర్క్

ప్రభుత్వ టీచర్లకు హాజరు షాక్

ప్రభుత్వ టీచర్లకు హాజరు షాక్

Teachers Attendance: విద్యారంగం సమూల మార్పులకు శ్రీకారం చుట్టిన ఏపీ ప్రభుత్వం.. టీచర్ల హాజరు విషయంలో కొత్తగా ఫేస్ రికగ్నేషన్ అటెండెన్స్ విధానం ప్రవేశ పెట్టింది. నిమిషం ఆలస్యమైనా.. ఆ రోజు ఆబ్సెంట్ కిందే లెక్క కట్టాలని నిర్ణయించింది. దీంతో తొలిరోజే టీచర్లకు అగచాట్లు తప్పలేదు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Visakhapatnam, India
    Teachers Attendance: సాధారణంగా పోటీ పరీక్షలకు.. పబ్లిక్ పరీక్షలకు ఒక్క నిమిషం నిబంధన అమలు చేస్తుంటారు.. ఒక్క నిమిషం నిబంధనను కఠినంగా అమలు చేస్తుంటారు. ఇప్పుడు ఉపాధ్యాయులకు ప్రభుత్వం (Government Teachers) అదే నిబంధన అమలు చేస్తోంది. నిమిషం ఆలస్యమైనా అంతే సంగతి.. ఆ రోజు సెలవు కిందే లెక్కేస్తున్నారు. స్కూల్
    ఉదయం 9 గంటలు అయితే ఓ పది నిమిషాలు అటూఇటూగా వెళ్దాంలే అనుకుంటే ఆ పప్పులు ఉడకవ్. ఖచ్చితంగా ఉదయం 9గంటలకు
    పాఠశాల (School) ప్రాంగణంలో ఉండాల్సిందే. లేదంటే ఆ సెలవే.. దీని కోసం టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ (Facial recognition) విధానాన్ని ఏపీ విద్యాశాఖ అమల్లోకి తెచ్చింది. ‘సిమ్స్ – ఏపీ’ (Sims AP) అనే మొబైల్
    యాప్ ను రూపొందించింది. ఉపాధ్యాయులు సహా పాఠశాలలో పనిచేసే అందరూ ఈ యాప్ ను డౌన్‌లోడ్ (Download App) చేసుకుని... స్కూల్ కు హాజరు కావాలని స్పష్టం చేసింది.

    అయితే ఈ విధానంలో తొలి రోజే.. ప్రభుత్వ టీచర్లకు పెద్ద కష్టమే వచ్చిపడింది. ఇప్పటికే పలు పాఠశాలల్లో ఫేస్ రికగ్నేషన్ అటెండెన్స్ విధానం అమల్లోకి తీసుకు వచ్చింది. కానీ నెట్ వర్క్ ప్రాబ్లమ్ తో టీచర్లకు తిప్పలు తప్పలేదు. ఏపీ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నెట్ వర్క్ ప్రాబ్లమ్ తో టీచర్లు అటెండెన్స్ కోసం తెచ్చిన ఏపీ సిమ్స్ యాప్ సరిగా పనిచేయకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే టైమ్ కు టీచర్లకు అటెండెన్స్ పడకుంటే ఈరోజు జీతం కట్ అంటూ హుకుం జారీ చేసింది జగన్ సర్కార్. దీంతో నెట్ వర్క్ లేకపోవటంతో వారు స్కూల్ కు టైమ్ కు హాజరు అయినా అటెండెన్స్ పడక నానా ఇబ్బందులు పడ్డారు.



    అటెండెన్స్‌కు ఒక్క నిమిషం ఆలస్యమైనా ఆఫ్ డే లీవ్‌గా పరిగణిస్తామని విద్యాశాఖ హెచ్చరించింది. దీంతో ఉపాధ్యాయులకు ఏం చేయాలో
    అర్ధంకాని పరిస్థితి ఏర్పడింది. అటెండెన్స్ యాప్‌ను వినియోగిస్తుంటే.. క్యాప్చా ఎర్రర్ అని వస్తోంది. కొన్ని చోట్ల నెట్‌వర్క్ సమస్య.. సాంకేతిక సమస్యలు, డౌన్‌లోడ్, అప్‌లోడ్ సమస్యలు ఇలా రకరకాల సంకేతిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో ఈ యాప్ విధానంపై టీచర్లు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. దీన్ని తీసివేయాలను డిమాండ్ చేస్తున్నారు. ఏపీ విద్యాశాఖ ఉత్తర్వులపై ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

    ఇదీ చదవండి : ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మనవైపే పెద్ద కంపెనీల చూపు.. 56 కంపెనీలు వస్తున్నాయన్న సీఎం జగన్

    కొన్ని చోట్ల మాత్రమే ఇది పని చేసినట్టు తెలుస్తోంది. కొత్త నిబంధన ప్రకారం. ఉదయం తొమ్మిది గంటలకల్లా స్కూల్ ఆవరణలోనే ఫోటో దిగాలి.. ఆ ఫోటోను విద్యాశాఖకు పంపించాలి. కానీ ఉపాధ్యాయులు స్కూల్ కు టైమ్ కే వచ్చినా ఫోటో దిగినా..నెట్ వర్క్ ప్రాబ్లమ్ వల్ల దాన్ని ఫార్వాడ్ చేయటంలో ఇబ్బందులు వస్తున్నాయి. దీంతో ఆరోజు వారికి ఆఫ్ సెంట్ పడుతుందని వాపోతున్నారు. ఉదయం 8-30 నిమిషాలకు ముందే పాఠశాలలకు చేరుకుని ఆన్‌లైన్ అటెండెన్స్ వేద్దామని ప్రయత్నం చేస్తూనే ఉన్నామని.. సర్వర్ బిజీ, టైం అవుట్ అని
    వస్తుండటంతో ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, Ap government, AP News, AP Schools

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు