VIJAYAWADA GOVERNMENT PERMITTED TO RE OPEN SEIZED THEATRES AFTER R NARAYANA MURTHY MEETS MINISTER PERNI NANI FULL DETAILS HERE PRN
AP Movie Theatres: సీజ్ చేసిన సినిమా థియేటర్ల తెరిచేందుకు ప్రభుత్వం ఓకే.. ఆర్.నారాయణమూర్తి విజ్ఞప్తికి సరేనన్న మంత్రి
పేర్ని నాని, ఆర్ నారాయణ మూర్తి (File)
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో నిబంధనలు పాటించని కారణంగా సీజ్ చేసిన థియేటర్ల యాజమాన్యాలకు ప్రభుత్వం ఊరటనిచ్చింది. ప్రభుత్వం ఇప్పటివరకు సీజ్ చేసిన థియేటర్లను మళ్లీ ఓపెన్ చేసేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. పీపుల్స్ స్టార్ ఆర్.నారాయణ మూర్తి (R Narayana Murthy).. మంత్రి పేర్ని నాని (Perni Nani) తో భేటీ అయిన తర్వాత ఈ మేరకు ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో నిబంధనలు పాటించని కారణంగా సీజ్ చేసిన థియేటర్ల యాజమాన్యాలకు ప్రభుత్వం ఊరటనిచ్చింది. ప్రభుత్వం ఇప్పటివరకు సీజ్ చేసిన థియేటర్లను మళ్లీ ఓపెన్ చేసేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఇప్పటికి సినిమా హాళ్లు తెరిచేందుకు అంగీకరించిన ప్రభుత్వం లైసెన్సులు, ఇతర సర్టిఫికెట్లు రెన్యువల్ చేసుకునేందుకు గడువు ఇచ్చింది. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా కలెక్టర్లు, జేసీలు, పోలీసులు, రెవెన్యూ అధికారులు థియేటర్లలో తనిఖీలు నిర్వహించారు. లైసెన్సులు రెన్యువల్ చేసుకోకపోవడం, టికెట్లు అధిక ధరలకు విక్రయించడం, ఇతర నిబంధనలు ఉల్లంఘించడం వల్ల రాష్ట్రంలో 130 థియేటర్లను సీజ్ చేసినట్లు డిస్ట్రిబ్యూటర్లతో సమావేశం సందర్భంగా మంత్రి పేర్ని నాని తెలిపారు. మరికొన్ని థియేటర్లను లైసెన్స్ లేదని ముందుగానే మూసివేసిన పరిస్థితి నెలకొంది. ఐతే ఇలాంటి వారికి మరో అవకాశమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.35ను అమలు చేయకపోవడం, సినిమాటోగ్రఫీ చట్టంలో పేర్కొన్న విధంగా ఫైర్, ఎలక్ట్రిసిటీ, ఆర్ అండ్ బీ, ఫుడ్ సేఫ్టీ అధికారుల నుంచి ఎన్ఓసీ తీసుకోని వాటిని రెవెన్యూ అధికారులకు సమర్పించి బీ ఫారమ్ లైసెన్స్ తీసుకోవాల్సి ఉంది. వీటిని ప్రతి ఏడాది రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇటీవల ఇలాంటి అనుమతులు లేని థియేటర్లను మాత్రమే అధికారులు సీజ్ చేశారు. చర్యలకు గురైన థియేటర్ యాజమాన్యాలు సంబంధిత జిల్లా జాయింట్ కలెక్టర్ కు దరఖాస్తు చేసుకొని సినిమాలను ఆడించుకునే అవకాశముంది.
ఇక ఇటీవలే సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని.. డిస్ట్రిబ్యూటర్లతో సమావేశమై సమస్యలపై చర్చించిన సంగతి తెలిసిందే. సినిమా టికెట్ల అంశంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ సిఫార్సుల ఆధారంగా ప్రభుత్వం అందికీ సముచితమైన నిర్ణయం తీసుకుంటుందని మంత్రి తెలిపారు. ఐతే ప్రభుత్వం నిర్ణయించిన ధరల ప్రకారం సినిమాలు వేయడం గిట్టుబాటు కాదని కొన్ని థియేటర్లను యజమానులే స్వచ్ఛందంగా మూసివేసిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే కొందరు సినిమా థియేటర్ల ఓనర్లు నటుడు నారాయణ మూర్తితో కలిసి గురువారం ఉదయం కృష్ణాజిల్లా మచిలీపట్నంలోని మంత్రి పేర్ని నానితో భేటీ అయి సమస్యలు వివరించారు. నారాయణమూర్తి కూడా మంత్రితో చర్చించడంతో సీజ్ చేసిన తియేటర్లను రీ ఓపెన్ చేసేందుకు అనుమిచ్చారు. సీజ్ చేసిన వారందరూ అప్లికేషన్ పెట్టుకోవాలని సూచించారు. అధికారులు గుర్తించిన లోపాలను నెలరోజుల్లోగా సరిచేసుకోవాలని మంత్రి నాని స్పష్టం చేశారు. ప్రస్తుతానికి జరిమానా చెల్లించి షోలు వేసుకోవచ్చన్నారు. దీంతో 9 జిల్లాల్లో 83 థియేటర్లు పునఃప్రారంభం కానున్నాయి.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.