Home /News /andhra-pradesh /

VIJAYAWADA GOVERNMENT HOSPITAL TO BE CHANGED AS FIRST E HOSPITAL IN THE STATE FULL DETAILS HERE PRN

Andhra Pradesh: ఏపీలో ఫస్ట్ పేపర్ లెస్ హాస్పిటల్.. ఇక్కడ చీటి అవసరమే లేదు.. ఆధార్ నంబర్ తో ట్రీట్మెంట్..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో తొలిసారి పేపర్ లెస్ హాస్పిటల్ రానుంది. రాష్ట్రంలోని ప్రముఖ ఆస్పత్రుల్లో ఒకటైన విజయవాడ (Vijayawada) ప్రభుత్వాస్పత్రి పూర్తి e-ఆస్పత్రిగా మారనుంది.

    సాధారణంగా ఆస్పత్రులంటే రిపోర్టులు, మందుల చీటీలు పట్టుకొని వెళ్లాలి. ఫస్ట్ టైమ్ ట్రీట్ మెంట్ కోసం వెళ్లినా టెస్టుల రిపోర్టులు చేతిలో పట్టుకొని రావాల్సిందే. కానీ ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో తొలిసారి పేపర్ లెస్ హాస్పిటల్ రానుంది. రాష్ట్రంలోని ప్రముఖ ఆస్పత్రుల్లో ఒకటైన విజయవాడ (Vijayawada) ప్రభుత్వాస్పత్రి పూర్తి e-ఆస్పత్రిగా మారనుంది. పేపర్ లెస్ డిజిటల్ ట్రీట్ మెంట్ ఇచ్చేందుకు రాష్ట్రంలోని మోడల్ ఆస్పత్రిగా ఎంపికైంది. గత రెండువారాలుగా దానికి సంబంధించిన పనులు జరుగుతున్నాయి. మరో రెండు మూడు రోజుల్లో అత్యాధునిక టెక్నాలజీతో కూడిన పరికరాలు కూడా రానున్నాయి. అంతా సవ్యంగా సాగితే మార్చి 15వ తేదీ నాటికి డిజిటల్ సైవలు ప్రారంభంకానున్నాయి. ఆయుష్మాన్‌ భారత్‌ డివిజన్‌ హెల్త్‌ మిషన్‌లో భాగంగా ఈ ఆస్పత్రినని ఇ ఆస్పత్రిగా మారుస్తున్నారు.

    ప్రతి ఒక్కరికీ హెల్త్ ఐడీ..
    ఆస్పత్రికి వచ్చే ప్రతి రోగికీ ఆధార్ తో అనుసంధానంతో గ్లోబల్ బేస్డ్ ఐడీని క్రియేట్ చేస్తారు. ఆ నంబర్ ఎంటర్ చేస్తే చాలు సదరు వ్యక్తికి సంబంధించిన హెల్త్ అండ్ మెడికల్ రికార్డ్స్ అన్నీ వచ్చేస్తాయి. ఆ వివరాల ఆధారంగా డాక్టర్లు ట్రీట్ మెంట్ ఇస్తారు. ఒకవేళ ట్రీట్ మెంట్ కోసం తొలిసారి వెళ్లినా సరే అప్పటికప్పుడు ఐడీ కేటాయించి చికిత్స చేస్తారు. ఒక్కసారి ఐడీ క్రియేట్ అయితే జీవితాంతం కొనసాగుతుంది. సదరు వ్యక్తి ఏ ఆస్పత్రికి వెళ్లినా ఐడీ ఎంటర్ చేస్తే గత రికార్డులన్నీ చూపిస్తాయి. గతంలో రోగి ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నారు..? ఏమైనా దీర్ఘకాలిక జబ్బులున్నాయా అనే అంశంపై డాక్టర్లకు వెంటనే క్లారిటీ వస్తుంది. ఒక్క దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా ఈ ఐడీ ఆధారంగా చికిత్స తీసుకోవచ్చు. ఎవరైనా ఐడీ మర్చీపోతే ఆధార్ నెంబర్ ఆధారంగా హెల్త్ రికార్డులు పొందవచ్చు.

    విజయవాడ ప్రభుత్వాస్పత్రి (ఫైల్)

    ఇది చదవండి: టెక్నాలజీలో ఏపీ పోలీసులే టాప్.. జాతీయ స్థాయిలో అవార్డుల పంట..


    పేపర్ లెస్ సేవలు..
    ఇ-ఆస్పత్రిగా మారిన తర్వాత ఆస్పత్రిలో పేపర్ లెస్ ట్రీట్ మెంట్ కొనసాగుతుంది. రోగి ఐడీ ఆదారంగా రిజిస్టర్ చేయడంతో పాటు వారికి చేసిన టెస్టులు, వారిలో ఉన్న సమస్యలు, బ్లడ్ టెస్ట్ రిపోర్ట్స్, స్కానింగ్, సిటీ స్కాన్, ఎంఆర్ఐ రిపోర్టులు ఇలా అన్నీ ఐడీ రోగి హెల్త్ ప్రొఫైల్ లో ఉంటాయి. ఇన్ పేషెంట్ గా చేరినా రికార్డులన్నీ ఆన్ లైన్లో నమోదు చేస్తున్నారు. రోగి ఐడీ ఎంటర్ చేసిన తర్వాత ఒక్క క్లిక్ తో సంబంధిత రికార్డులన్నీ చూపిస్తాయి.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Aayushman bharath, Andhra Pradesh, Government hospital, Vijayawada

    తదుపరి వార్తలు