VIJAYAWADA GOVERNMENT GIVES CLARITY OVER YSRCP COLORS LIGHT AT KANAKA DURGA TEMPLE VIJAYAWADA ANDHRA PRADESH FULL DETAILS HERE PRN
Fact Check on Durga Temple: దుర్గగుడిలో వైసీపీ రంగులు.. క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం.. అసలేం జరిగిందంటే..!
దుర్గగుడి అలంకరణపై అసత్యప్రచారం
విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో (Vijayawada Kanaka Durga Temple) దేవీ శరన్నవరాత్రి వేడుకలపైనా సోషల్ మీడియా (Social Media) వార్ స్టార్ట్ అయింది. దుర్గగుడిని వైసీపీ పార్టీ (YSRCP) రంగులతో కూడిన లైటింగ్ తో అలంకరించారంటూ సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు దర్శనమిచ్చాయి.
ప్రస్తుత రాజకీయాల్లో (Politics) నేతల మధ్య మాటల యుద్ధం కంటే పార్టీల మధ్య సోషల్ మీడియా (Social Media) వార్ హాట్ హాట్ గా నడుస్తోంది. ప్రెస్ మీట్ల కంటే ట్వీట్లకే ఎక్కువ క్రేజ్ ఉంటోంది. మీడియా ఎదుట, బహిరంగ సభల్లో గంటల గంటలు ఉపన్యాసాలు దంచినా రాని స్పందన.. సోషల్ మీడియాలో ఒక్క పోస్ట్ పెడితే చాలు రియాక్షన్స్ మాములుగా ఉండవు. ప్రస్తుతం ప్రభుత్వంపై సోషల్ మీడియాలో విమర్శలు బాగానే వస్తున్నాయి. ఈ విషయంలో అధికార, ప్రతిపక్షాల మధ్య ట్వీట్లు, మీమ్స్ యుద్ధమే నడుస్తోంది. మద్యం బ్రాండ్ల దగ్గర్నుంచి ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగుల వరకు ప్రతి అంశంపైనా సోషల్ మీడియాలో యుద్ధం జరుగుతోంది.
తాజాగా విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో (Vijayawada Durga Temple) దేవీ శరన్నవరాత్రి వేడుకలపైనా సోషల్ మీడియా వార్ స్టార్ట్ అయింది. దుర్గగుడిని వైసీపీ పార్టీ (YSRCP) రంగులతో కూడిన లైటింగ్ తో అలంకరించారంటూ సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు దర్శనమిచ్చాయి. ఈ ఫోటోలు తక్కువ సమయంలోనే వైరల్ అయ్యాయి. విషయం ప్రభుత్వం వరకు వెళ్ళడంతో ఫ్యాక్ట్ చెక్ ద్వారా క్లారిటీ ఇచ్చింది.
తొలుత వైసీపీ రంగులతో ఆలయాన్ని అలంకరించినట్లు సర్క్యులేట్ అవుతున్న ఫోటోలను ట్వీట్ చేసిన ఏపీ ఫ్యాక్ట్ చెక్ టీమ్.. పండుగ వేళ ఇలాంటి విషయాలపై ఫ్యాక్ట్ చెక్ రిక్వెస్టులు వస్తుండటం నిరుత్సాహానికి గురిచేస్తోందని పేర్కొంది. అంతేకాదు ప్రజలు ఇలాంటి వాటిని ఫార్వర్డ్ చేసేముందు అప్రమత్తంగా ఉండాలని కూడా సూచించింది.
It's disheartening to receive requests to fact-check such malicious content, on the festival that celebrates the victory of Truth. We urge the netizens to please stay alert while receiving or forwarding such content. pic.twitter.com/68sGoi29PP
ఇక కనకదుర్గమ్మ ఆలయానికి సంబంధించిన లైటింగ్ వీడియోలను కూడా ట్వీట్ చేసిన ఏపీ ప్రభుత్వం... దుర్గమ్మ దయతో ఎప్పటికీ సత్యమే విజయం సాధిస్తుందని.. ఎప్పుడైన తప్పుడు సమాచారంతో కూడిన స్క్రీన్ షాట్స్ వచ్చినప్పుడు నిజాలు తెలుసుకునేందుకు ఒరిజనల్ వీడియోలు చూడాలని సూచించింది. దీంతో పండుగ రోజు దుర్గగుడిపై జరుగుతున్న ప్రచారానికి ప్రభుత్వం చెక్ పెట్టినట్లైంది.
With the blessings of Maa Durga, may the Truth shall always prevail. #HappyNavratri
When you come across any screenshots with misleading text/information, always find the source video to get the facts right.
ఇటీవల ఇలాంటి ప్రచారమే జోరుగా జరిగింది. జగనన్న విద్యాకానుక కింద ఇచ్చిన కిక్షనరీల్లో దేవుడు గురించి అర్ధానికి ఓ మతానికి సంబంధించిన దేవుడ్ని ప్రస్తావించారని పేర్కొనడం, ఓ ప్రాంతంలో ఆటో వెనుక భాగంలో అంటించిన సీఎం జగన్ పోస్టర్ నుంచి విభూది రాలుతోందని.. ఇది జగన్ మహిమేనని ప్రజలు అనుకుంటున్నారంటూ సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు, వీడియోలు సర్క్యులేట్ అయ్యాయి.
అలాగే మటన్ కోయడంపై ఏపీ ప్రభుత్వం 3 వెలల ట్రైనింగ్ ఇస్తోందని.., తిరుమల శ్రీవారి బంగారాన్ని తాకట్టుపెట్టారన్న ప్రచారాలకు కూడా ఫ్యాక్ట్ చెక్ ఏపీ క్లారిటీ ఇచ్చింది. ప్రభుత్వంపై జరుగుతున్న ప్రచారాలపై నిజానిజాలను తేల్చేందుకు ఫ్యాక్ట్ చెక్ వెబ్ విభాగాన్ని గతంలో సీఎం వైఎస్ జగన్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి వివిధ అంశాలపై ఈ విభాగం స్పష్టతనిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.