హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

NTR District: వైభవంగా తిరుపతమ్మ కల్యాణం.. ఇక్కడ ప్రత్యేకత అదే..!వైభవంగా శ్రీ గోపయ్య సమేత తిరుపతమ్మ అమ్మవారి కళ్యాణం 

NTR District: వైభవంగా తిరుపతమ్మ కల్యాణం.. ఇక్కడ ప్రత్యేకత అదే..!వైభవంగా శ్రీ గోపయ్య సమేత తిరుపతమ్మ అమ్మవారి కళ్యాణం 

తిరుపతమ్మ కళ్యాణం

తిరుపతమ్మ కళ్యాణం

Andhra Pradesh: శ్రీ గోపయ్య సమేత తిరుపతమ్మ అమ్మవారి కల్యాణ మహోత్సవం మాఘ శుద్ధ పౌర్ణమి ఆదివారం రాత్రి 8.42 కన్నుల పండువగా నిర్వహించారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Andhra Pradesh, India

Yashwanth, News18, Jaggayyapet

శ్రీ గోపయ్య సమేత తిరుపతమ్మ అమ్మవారి కల్యాణ మహోత్సవం మాఘ శుద్ధ పౌర్ణమి ఆదివారం రాత్రి 8.42 కన్నుల పండువగా నిర్వహించారు. గ్రామానికి చెందిన గోపయ్యస్వామి వంశీకుల తరఫున కాకాని రంజిత్‌ కుమార్‌- నిషిత దంపతులు, తిరుపతమ్మ వం శీకుల తరఫున కొల్లా రాజశేఖర్‌-అపర్ణ దంపతులు మేళతాళాలతో ఊరేగింపుగా వచ్చి పట్టు వస్త్రాలు, పసుపుకొమ్ములు సమర్పించి కల్యాణం పీటలపై కూర్చున్నారు. శ్రీ గోపయ్య సమేత తిరుపతమ్మ అమ్మవారి ఉత్సవమూర్తులను ఆలయం నుంచి మేళతాళాలు మంగళవాయిద్యాలతో వేదికపైకి తీసుకువచ్చి కల్యాణాన్ని ప్రారంభించారు.

ప్రభుత్వం తరఫున ప్రభుత్వ విప్‌ సామినేని ఉదయ భాను-విమలాభాను దంపతులు పట్టువస్త్రాలను అమ్మవారికి సమర్పించి పీటలపై కూర్చున్నారు. కల్యాణం పీటలపై కూర్చున్న వారిలో చైర్మన్‌ ఇంజం చెన్నకేశవరావు దంపతులు, ఈవో జీవీడీఎల్‌ లీలాకుమార్‌ దంపతులు, నందిగామ ఆర్డీవో ఎ.రవీంద్రరావు దంపతులు, తహసీల్దార్‌ కె.లక్ష్మీ కల్యాణి దంపతులు, నందిగామ ఏసీపీ జి.నాగేశ్వరరెడ్డి దంపతులు, ఏపీ బీవరేజెస్‌ కార్పొరేషన్‌ ఎండీ దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి దంపతులు ఉన్నారు.

andh

తిరుపతమ్మ పెద్ద తిరునాళ్ల మహోత్సవాలను ఆదివారం ఈవో జీవీడీఎల్‌ లీలాకుమార్‌, చైర్మన్‌ ఇంజం చెన్నకేశవరావు ప్రత్యేక పూజలు చేసి అఖండ దీపాన్ని వెలిగించి ప్రారంభించారు. 41 రోజుల పాటు దీక్షలుచేసిన స్వాములకు స్థానిక శివాలయంలో ఆలయ ప్రధాన అర్చకుడు మర్రిబోయిన వెంకటరమణ ఆధ్వర్యంలో ఇరుముడులు కట్టారు. స్వాములు ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసి అమ్మవారికి ఇరుముడులు సమర్పించారు.

రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రభుత్వ విప్పు సామినేని ఉదయభాను దంపతులు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు తీసుకువచ్చి అమ్మవారికి సమర్పించారు. ఆలయ వంశ ఆచారం ప్రకారం వేద మంత్రోచ్ఛారణ నడుమ పురోహితులు వైభవంగా కళ్యాణం తంతును జరిపించారు. సుమారు లక్ష మంది భక్తులు కళ్యాణాన్ని వీక్షించారు. కళ్యాణం అందరికీ కనిపించేలా వేదిక వద్ద 14 డిజిటల్ తెరలు ఏర్పాటు చేశారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది జరగకుండా వేదిక వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లను పోలీసులు నిర్వహించారు. ఏర్పాట్లను డీసీపీ మేరీ ప్రశాంతి పర్యవేక్షించారు.

First published:

Tags: Andhra Pradesh, Local News, Vijayawada

ఉత్తమ కథలు