హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Vijayawada: పదోతరగతి తప్పిన విద్యార్థులకు గుడ్ న్యూస్.. వారి కోసం ప్రత్యేక శిక్షణ.. ప్రత్యేకత ఏంటంటే?

Vijayawada: పదోతరగతి తప్పిన విద్యార్థులకు గుడ్ న్యూస్.. వారి కోసం ప్రత్యేక శిక్షణ.. ప్రత్యేకత ఏంటంటే?

X
పది

పది ఫెయిలైన విద్యార్థులకు శుభవార్త

Vijayawada: పదవ తరగతి తప్పిన విద్యార్థులకు గోల్డెన్ ఛాన్స్.. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల కోసం ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. రోజుకు రెండు సబ్జెక్టులు బోధిస్తూ.. విద్యార్థులతో ప్రాక్టీస్‌ చేయిస్తున్నారు.

 (ప్రజ్ఞా రాఘవేంద్ర, న్యూస్ 18 తెలుగు, విజయవాడ)

Vijayawada: ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం (AP Government) పదవ తరగతి ఫలితాలు (10th Result) విడుదల చేసింది.అయితే అందులో పాస్ పర్సంటేజ్ అంత ఆశాజనకంగా లేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం పదవ తరగతి ఫెయిలైన విద్యార్థులకు సువర్ణ అవకాశం కల్పించింది. రాష్ట్ర వ్యాప్తంగా పదవ తరగతి తప్పిన విద్యార్థులకు.. ప్రభుత్వ పాఠశాల (Government Schools) ల్లో ప్రత్యేక శిక్షణ తరగతులు ఇవ్వడానికి ప్లాన్‌ చేసింది. జూలై 6వ తేదీన నిర్వహించబోయే సప్లిమెంటరీ పరీక్షలు పూర్తి అయ్యేవరకు ఈ తరగతులు నిర్వహించాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ (Minster Botsa Satyanarayana) వెల్లడించారు. ప్రస్తుతం విజయవాడ (Vijayawada) నగర పాలక సంస్థలో పదో తరగతి తప్పిన విద్యార్ధుల కోసం నగరంలోని 8 నగర పాలక పాఠశాలలో ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రతి రోజూ ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ శిక్షణ నిర్వహిస్తున్నట్లు ఆయా పాఠశాలల హెడ్‌మాస్టర్‌లు తెలిపారు.

నగరంలోని శిక్షణతరగతులు నిర్వహిస్తున్న పాఠశాలలు ఇవే..!                                                1. కర్నాటి రామ మోహన్ రావు ప్రభుత్వ పాఠశాల 2. సివిఆర్ గవర్నర్‌పేట స్కూల్‌ 3. ఎంపీ బేగ్ స్కూల్‌, అజిత్ సింగ్ నగర్ 4. డాక్టర్ జంధ్యాల దక్షిణామూర్తి స్కూల్‌, వాంబే కాలనీ 5. పుచ్చలపల్లి సుందరయ్య పాఠశాల, ఎల్బీనగర్ 6. దేవినేని వెంకటరమణ పాఠశాల, న్యూ ఆర్ ఆర్ పేట 7. వి సుబ్బారెడ్డి పాఠశాల కండ్రిక 8. రాజీవ్ గాంధీ పాఠశాల రాజీవ్ నగర్.


జూన్‌ 30నుండి ఈ ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. పేదలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఈ బృహత్తర కార్యక్రమాన్ని చెప్పటిందని సి వి అర్ స్కూల్ హెడ్‌మాస్టర్ సుబ్రహ్మణ్యం చెబుతున్నారు. ప్రతిరోజు రెండు సబ్జెక్ట్‌ల కింద.. ఉపాద్యాయులకు కేటాయించిన సమయంలో విద్యార్థులకు శిక్షణ అందిస్తున్నారు. పోయినసారి రాసిన పరీక్షల్లో తప్పిన విద్యార్థులు దీన్ని సదవకాశంగా తీసుకోవాలని హెడ్‌మాస్టర్‌ నాంచరయ్య కోరారు.

ఇదీ చదవండి : ఎన్టీఆర్ టీడీపీ సొత్తు కాదు.. దమ్ముంటే చంద్రబాబు పోటీ చేయాలన్న కొడాలి నాని

విద్యార్థులకు మెరుగైన శిక్షణ అందించి వారిని పాస్ చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఉపాధ్యాయురాలు స్వర్ణ తెలిపారు. ప్రతి రోజు విద్యార్థులతో ప్రభుత్వం అందించిన ప్రేరణ మెటీరియల్‌ ప్రాక్టీస్‌ చేయిస్తున్నట్లు తెలిపారు. పదవ తరగతి తప్పిన విద్యార్ధులు ఈ అవకాశం సద్వినియోగ పరుచుకోవాలి కర్నాటి రామ్ మోహన్ రావు స్కూల్ హెడ్ మాస్టర్ నాంచారయ్య విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి: పబ్లిసిటీ కోసం పాదయాత్రలు అవసరం లేదు.. తాను బీజేపీ మనిషిని అంటూ మోహన్ బాబు యూటర్న్..

సప్లమెంటరీ పరీక్షలు కోసం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నట్లు ఇప్పటికే ఫెయిల్ అయిన విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చామంటున్నారు. అయితే వారిలో కొంతమంది తమ పిల్లలను ప్రత్యేక తరగతులు కోసం పంపిస్తున్నారు . ప్రస్తుతం ఫెయిల్‌ అయిన వారిలో 60 శాతం మంది విద్యార్థులు మాత్రమే ప్రత్యేక తరగతులకు హాజరు అవుతున్నారు. ఈ సదవకాశాన్ని విద్యార్థులు వినియోగించుకుని.  జూలై నెలలో నిర్వహించబోయే సప్లమెంటరీ లో అందరూ ఉత్తీర్ణులు కావాలని సి వి అర్ స్కూల్ హెడ్‌ మాస్టర్ సుబ్రమణ్యం విజ్ఞప్తి చేశారు.

First published:

Tags: 10th class results, Andhra Pradesh, AP News, EDUCATION, Vijayawada

ఉత్తమ కథలు