హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

16 ఏళ్లకే ప్రేమ.. పెళ్లికి ఒప్పుకోలేదని ఎంత పనిచేసింది..?

16 ఏళ్లకే ప్రేమ.. పెళ్లికి ఒప్పుకోలేదని ఎంత పనిచేసింది..?

కృష్ణాజిల్లాలో బాలిక ఆత్మహత్య

కృష్ణాజిల్లాలో బాలిక ఆత్మహత్య

ఈ మధ్య ఎక్కువగా ప్రేమ అనే మత్తులో పడి నేటి యువత జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ప్రేమ కోసం చనిపోవడం లేదా చంపడం లాంటివి చేస్తూ కుటుంబంలో అందరికి దుఃఖాన్ని మిగులుస్తున్నారు. అదే ప్రేమ మత్తులో పడ్డ ఓ బాలిక తన ప్రాణాలు తానే తీసుకుంది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Vijayawada | Andhra Pradesh

K Pawan Kumar, News18, Vijayawada

ఈ మధ్య ఎక్కువగా ప్రేమ అనే మత్తులో పడి నేటి యువత జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ప్రేమ కోసం చనిపోవడం లేదా చంపడం లాంటివి చేస్తూ కుటుంబంలో అందరికి దుఃఖాన్ని మిగులుస్తున్నారు. అదే ప్రేమ మత్తులో పడ్డ ఓ బాలిక తన ప్రాణాలు తానే తీసుకుంది. వివరాల్లోకి వెళ్తే.., కృష్ణా జిల్లా (Krishna District) పెనమలూరు మండలం కానూరు సనత్ నగర్ ప్రాంతానికి చెందిన భవాని స్థానికంగా ఓ జ్యూస్ షాప్ లో పని చేస్తూ ఉంటుంది. ఇదే షాపు వద్ద ఇంటర్ చదివే శివ అనే కుర్రాడితో పరిచయం ఏర్పడి అది కాస్తా ప్రేమగా మారింది. దీంతో భవానీ.. శివను పెళ్లి చేసుకోవాలనుకుంది.

తన ప్రేమ విషయాన్ని భవానీ తన తల్లిదండ్రులతో చెప్పింది. పెళ్లంటూ చేసుకుంటే శివనే చేసుకుంటానని చెప్పింది. ఐతే ఆమెకు 16 ఏళ్లే కావడంతో రెండు సంవత్సరాల తర్వాత ఆలోచిద్దామని తల్లిదండ్రులు చెప్పారు. కానీ తనకు శివనే కావాలంటూ తెగేసి చెప్పింది. కానీ తల్లిదండ్రులు అందుకు అంగీకరించలేదు.

ఇది చదవండి: ఆద‌మ‌రిచారా.. నిలువునా దోచేస్తున్నారు.. ఎక్క‌డో తెలుసా..!

ప్రేమించిన వాడితో పెళ్లికి తల్లిదండ్రులు నిరాకరించడంతో ఇంట్లో అందరూ ఉండగానే.. గదిలోకి వెళ్లి తలుపులు వేసుకొని ఫ్యాన్ కు ఉరివేసుకుంది. తల్లిదండ్రులు గమనించి తలుపులు పగలగొట్టి ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే ఆమె మృతి చెందినట్లు డాక్టర్లు ధృవీకరించారు.

భవానీ ఆత్మహత్యతే ఆమె కుటుంబం కన్నీరుమున్నీరవుతోంది. గత ఏడాది టెన్త్ ఫెయిల్ కావడంతో కొన్నాళ్లు కూలీ పనులకు వెళ్లిందని.. ఆ తర్వాత ఐస్ క్రీమ్ షాపులో పనికి పెట్టామని తల్లి సత్యవతి తెలిపింది. అయితే అదే ప్రాంతానికి చెందిన శివ అనే యువకుడు మూడు నెలలుగా ప్రేమ పేరుతో తమ కుమార్తె వెంట పడుతున్నాడని.. అందరూ చూసేలా ఆమెతో చనువుగా వ్యవహరిస్తుండటంతో భవానీ.. పెళ్లి చేయమని కోరిందని.. అందుకు తాము నిరాకరించడంతో ఇంతపని చేసిందని చెబుతోంది. శివ కారణంగానే భవానీ సూసైడ్ చేసుకుందని.. అతడ్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తోంది.

First published:

Tags: Andhra Pradesh, Local News, Vijayawada

ఉత్తమ కథలు