Anna Raghu, Guntur, News18
కరోనా కారణంగా చదువలన్నీ ఆన్ లైన్లోనే (Online Studies) సాగుతున్నాయి. నిన్నమొన్నటి వరకు ఆన్ లైన్లోనే క్లాసులు (Online Classes) జరిగాయి. దీంతో పిల్లలంతా మొబైల్ ఫోన్లు (Mobile Phones), ట్యాబ్ లు, కంప్యూటర్లకు అతుక్కుపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆన్లైన్ క్లాసుల కారణంగా మొబైల్ ఫోన్ల విషయంలో తల్లిదండ్రులు ఇచ్చిన స్వేచ్ఛను విద్యార్థులు వారి యొక్క పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి సద్వినియోగ పరుచుకోవాలి కానీ పిల్లలు స్కూల్ విద్యార్థుల నుంచి కాలేజీకి వెళ్లే స్టూడెంట్స్ వరకు గేమ్స్‌లో మునిగి తేలుతున్నారు.గేమ్స్ ఆడుతూ మొబైల్స్‌కు అతుక్కుపోతున్నారు.. ఈ గేమ్స్ పిచ్చి మరీ పరాకాష్టకు చేరింది. ఫ్రీ ఫైర్ అనే ఈ ఆన్‌లైన్ గేమ్ ఉచ్చులో పడి తిండి తిప్పలు కూడా మానేస్తున్నారు. రాత్రి పగలు అని తేడా లేకుండా ఎక్కడపడితే అక్కడ ఆడుకుంటూ ఉంటున్నారు.
వివరాల్లోకి వెళ్తే... ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని కృష్ణాజిల్లా (Krishna District) గన్నవరం మండలం ముస్తాబాద్ గ్రామానికి చెందిన విద్యార్థులు తమ ఆన్లైన్ క్లాసుల కోసం కొనిచ్చిన మొబైల్స్ లో రెండు వర్గాలుగా విడిపోయి ఫ్రీ ఫైర్ ఆన్లైన్ గేమ్ ఆడుతున్నారు. ఐతే ఫ్రీ ఫైర్ ఆన్లైన్ గేమ్ ఆడుతున్న సందర్భం లో ఇరువర్గాలకు గొడవలు జరిగాయి. ఐతే ముస్తాబాద గ్రామంలో కూడా విద్యార్థులు, యువకులు కొంతమంది ఈ గేమ్ ఆడుతూ మనస్పర్ధలు పెంచుకొని ఒకరిపై ఒకరు దూషణల నుండి ఇరువర్గాల గ్యాంగ్ వార్ కి దారితీసింది.
ఐతే ఈ గ్యాంగ్ వార్ పై గ్రామంలోని కొంతమంది యువకులు పోలీసులకు సమాచారం అందించారు. అప్రమత్తమైన పోలీసులు ఇరువర్గాల పిల్లలను అదుపులోకి తీసుకొని విచారించారు. తల్లి తండ్రులను పిలిపించి వారి సమక్షంలోనే విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. అనంతరం వారి మొబైల్ ఫోన్ల నుండి ఆన్లైన్ గేమ్స్ డిలీట్ చేయించారు.
ఆన్ లైన్ గేమ్స్ కు బానిసవడం ఒక నష్టమైతే.. ఇలా గొడవలు పడి కేసుల్లో చిక్కుకుంటే వారి భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని పోలీసులు హెచ్చరించారు. అలాగే పిల్లలు ఏ చేస్తున్నారో తల్లిదండ్రులు కూడా గమనిస్తూ ఉండాలని.. అలా చేయకపోతే నష్టపోతారని తల్లిదండ్రులకు కూడా గట్టిగా చెప్పారు. గతంలోనూ పలుసార్లు విద్యార్థులు ఆన్ లైన్ గేమ్స్ వల్ల రెండు వర్గాలుగా విడిపోయి తన్నుకున్న ఘటనలు చోటు చేసుకన్నాయి.
ఆన్ లైన్‌లో పాఠాలు నేర్చుకునే పిల్లలు లైంగిక వేధింపులకు గురయ్యే ప్రమాదం ఉందని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. మంచిచెడుల గురించి తెలియజేసే విషయాలను పాఠ్యాంశాలుగా ఆన్‌లైన్ అభ్యాసంలో చేర్చాలని సూచిస్తున్నారు. పిల్లల భద్రతకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రాధాన్యత ఇవ్వడం అత్యంత ముఖ్యమని చెబుతున్నారు. పిల్లల సైబర్ సేఫ్టీకి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలని యునిసెఫ్ కూడా చెబుతోంది. ఆన్లైన్ మాధ్యమాలను ఉపయోగించుకొని విద్యార్థులపై కొంతమంది దుర్మార్గులు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని యునిసెఫ్ చెప్పుకొచ్చింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Krishna District, Online classes, Video Games, Vijayawada