హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

MLA Vallabhaneni Vamsi: పాలిటిక్స్ లోనే కాదు చదువులోనూ టాపర్.. స్టూడెంట్ నెం.1గా ఎమ్మెల్యే.. ప్రతిష్టాత్మక సంస్థలో సీటు

MLA Vallabhaneni Vamsi: పాలిటిక్స్ లోనే కాదు చదువులోనూ టాపర్.. స్టూడెంట్ నెం.1గా ఎమ్మెల్యే.. ప్రతిష్టాత్మక సంస్థలో సీటు

వల్లభనేని వంశీ (ఫైల్)

వల్లభనేని వంశీ (ఫైల్)

రాజకీయ నాయకుడు (Politician) కావాలంటే పెద్దగా చదువు అవసరం లేదు. కనీసం సంతకం కూడా చేయడం రానివాళ్లు సీఎంలు అయిన సందర్భాలున్నాయి.

రాజకీయ నాయకుడు కావాలంటే పెద్దగా చదువు అవసరం లేదు. కనీసం సంతకం కూడా చేయడం రానివాళ్లు సీఎంలు అయిన సందర్భాలున్నాయి. ఇక ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధుల సంగతైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అనుచర గణం, కోట్లు ఖర్చు చేయగలిగే దమ్ముంటే చాలు.. చదువుతో పనిలేదు. కానీ ఎమ్మెల్యే మాత్రం ప్రజాసేవ చేయాలంటే ఉన్నత చదువులు అవసరమని భావించారు. వైద్యవిద్యను అభ్యసించినా... ప్రజాప్రతినిథికి అవసరమైన కోర్సు చదవాలని అనుకున్నారు. ఆయన తలచుకుంటే రాష్ట్రంలోని ఏదో ఒక యూనివర్సిటీలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లేదా ఇతర కోర్సులను డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సెంటర్ ద్వారా చదువుకోవచ్చు. కానీ చదువుకున్న రోజుల్లో గోల్డ్ మెడలిస్ట్ అయిన ఆయన... ఆ స్థాయిలోనే మరోసారి స్టూటెండ్ అవతారమెత్తారు. జాతీయస్థాయిలో జరిగే పోటీ పరీక్షకు హాజరై విద్యార్థులతో పోటీపడి ప్రతిష్టాత్మక సంస్థలో సీటు సంపాదించారు. ఆయనే కృష్ణాజిల్లా గన్నవరం ఎమ్మెల్యే డాక్టర్. వల్లభనేని వంశీ మోహన్. ఆయన ఏకంగా హైదరాబాద్ లోని ప్రతిష్టాత్మక ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో సీటు సంపాదించారు.

ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో పబ్లిక్ పాలసీలో అడ్వాన్స్డ్ మెనేజే మెంట్ కోర్సులో వల్లభనేని వంశీ సీటు సాధించారు. ఈ కోర్సును భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ పాలసీ, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ కలసి సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. ఇందులో ప్రపంచంలోని ప్రతిష్టాత్మక టఫ్ట్స్ యూనివర్సిటీ కి చెందిన ఫ్లెచర్ స్కూల్ ఆఫ్ లా అండ్ డిప్లమసీ కూడా పాలు పంచుకోవడం విశేషం.

ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ (ఫైల్)

సాధారణంగా ఇండియన్ సివిల్ సర్వీస్, ఇండియన్ ఫారిన్ సర్వీస్ అధికారులతో పాటు ఇతర విభాగాల్లో ప్రతిభావంతులైన వారు ఈ కోర్సుకోసం పోటీ పడతారు. అలాంటి పరీక్షలో ఎమ్మెల్యే వంశీ ఉత్తీర్ణత సాధించారు. మేనేజ్మెంట్ కోర్సుల్లో ప్రముఖమైన ఈ కోర్సుకు విద్యార్థుల ఎంపిక కోసం జాతీయ స్థాయిలో మూడు విభాగాలుగా ఎంట్రెన్స్ టెస్ట్ నిర్వహించారు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు దీనికోసం పోటీ పడ్డారు. ఇందులో అత్యంత కఠినమైన రాత పరీక్షతో పాటు ఇంటర్వ్యూలోనూ వంశీ ఉత్తీర్ణులయ్యారు. అంతేకాదు 40 శాతం స్కాలర్షిప్ తో సీటు సంపాదించడం విశేషం. 1995లోనే తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ నుంచి గోల్డ్ మెడల్ తో ఎంవీఎస్సీ పూర్తి చేసిన వంశీ 20 సంవత్సరాల తర్వాత మళ్లీ కాలేజీ బాటపట్టనున్నారు.

దీనిపై స్పందించిన ఎమ్మెల్యే వంశీ ప్రతిష్టాత్మక బిజినెస్ స్కూల్లో సీటు పొందడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. ఈ కోర్సులో చేరడం ద్వారా నియోజకవర్గ ప్రజలకు మరింత మెరుగైన సేవలందించేందుకు తోడ్పడుతుందని భావిస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో ప్రజలకు మరింతగా చేరువల్లో అవకాశముంటుందన్నారు.

First published:

Tags: Andhra Pradesh, Gannavaram, Vallabaneni Vamsi

ఉత్తమ కథలు