K Pawan Kumar, News18, Vijayawada
ఇంట్లో తల్లిదండ్రులు కష్టపడి సంపాదిస్తుంటే ఆ కష్టాన్ని గుర్తించక పోగా రోడ్లపై తిరుగుతూ రౌడీయిజం చెలాయిస్తున్నారు కొంతమంది యువకులు. కొందరు చక్కగా చదువుకొని నైతిక విలువలు నేర్చుకొని సమాజానికి ఉపయోగపడాల్సింది పోయి యువత చిన్నచిన్న వాటికిగొడవలు పడుతూ ఇంటికి, సమాజానికి చెడ్డ పేరు తెస్తున్నారు. అందుకు నిదర్శనం తాడేపల్లి పెట్రోల్ బంక్ లో జరిగిన మరో ఘటన. గుంటూరు జిల్లా (Guntur District) తాడేపల్లిలోని భారత్ పెట్రోల్ బంక్ లో యువకులు హల్ చల్ చేశారు. బైక్లో పెట్రోల్ కొట్టించుకొని డబ్బులు చెల్లించమని పెట్రోల్ బంక్ సిబ్బంది అడగటంతో డబ్బులు ఇవ్వ కుండా ఆసిబ్బందిపై దాడికి దిగారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
పెట్రోల్ బంక్ కి వచ్చి ద్విచక్ర వాహనంకి ఆయిల్ కొట్టించుకున్నారు. ఒక గ్యాంగ్ దానికి నగదు చెల్లించకుండా సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు.. ఆ గ్యాంగ్ లోని ఓ జేబు దొంగ అతడి అనుచరులు. పైగా నగదు చెల్లించాలని అడిగిన సిబ్బందిపై విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డారు జేబుదొంగ వారి అనుచరులు. సిబ్బందిని కొడుతూ నన్నే డబ్బులు అడుగుతావా మీ అంతు చూస్తా అంటూ సిబ్బందిపై ఆ గ్యాంగ్ దాడి దిగారు.
వారిలో ఒకడు తన అనుచరులను.. సిబ్బందిపై దాడి చేయమని ఆదేశం ఇవ్వడంతో వారిపై దాడికి దిగారు అనుచరులు వారిలో ఒకరికి తీవ్ర రక్తస్రావం కూడా అయ్యింది. ఈ దాడికి పాల్పడిన వారందరూ ప్రకాష్ నగర్ కు చెందిన వారుగా గుర్తించి చెప్తున్నారు బంకులోని సిబ్బంది. ఘటనపై తాడేపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసాడు బాధితుడు. దీనితో ఆ గ్యాంగ్ పని పడతారా లేదా ఏమి పట్టనట్లు వ్యవహరిస్తారో చూడాలి మరి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Guntur, Local News, Vijayawada