Yashwanth, News18, Jaggayyapet
రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని ఆ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు.ఎన్టీఆర్ జిల్లా పెనుగంచి ప్రోలు తిరుపతమ్మ తల్లి దేవాలయంలో రూ.13 కోట్ల వ్యయంతో చేపట్టిన అభివృద్ధి పనులకు శుక్రవారం ప్రభుత్వ విప్ సామినేని ఉదయ భానుతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఆలయ ఛైర్మన్ యింజం చెన్నకేశవరావు అధ్యక్షతన నిర్వహించిన సభలో మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో తిరుమల తర్వాత 8 పెద్ద దేవాలయాల్లో బృహత్ ప్రణాళిక అమలు చేస్తున్నామని తెలిపారు.ఆ తర్వాత మరో 36 దేవాలయాల బృహత్ ప్రణాళిక తయారు చేశామని వెల్లడించారు. విజయవాడ దుర్గగుడికి రూ.120 కోట్లు, సింహాచలం, అన్నవరం దేవస్థానాల అభివృద్ధికి రూ.50 కోట్ల చొప్పున వెచ్చించనున్నట్లు తెలిపారు.
పెను గంచిప్రోలు తిరుపతమ్మ దేవాలయానికి రూ. 10 కోట్లు మంజూరు చేయాలని కేంద్ర పర్యాటక శాఖను రాష్ట్ర ప్రభుత్వం తరుపున కోరినట్లు చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి ఆలయాన్ని రూ.10 లక్షలతో అభివృద్ధి చేస్తామని వివరించారు. దేవాదయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, ప్రభుత్వ విప్ సామినేని ఉదయభానుతో కలిసి పెనుగంచిప్రోలు తిరుపతమ్మ దేవాలయంలో అభివృద్ధి పనులకు శుక్రవారం శంకుస్థాపన చేశారు.
ఆలయ ఛైర్మన్ యింజం చెన్నకేశవరావు అధ్యక్షతన నిర్వహించిన సభలో మంత్రి మాట్లాడుతూ.. సచివాలయం, వాలంటీరు వ్యవస్థలతో ప్రజలకు మెరుగైన సేవలు అందుతున్నాయని పేర్కొన్నారు. ఉదయభాను మాట్లాడుతూ.. వచ్చే ఏడాది కల్లా అభివృద్ధి పనులు పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. మునేరు కర ట్ట రహదారి నిర్మాణానికి కృషి చేస్తామని చెప్పారు. తొలుత ఆలయంలో అమ్మవారికి పూజలు చేయించారు. ఈ కార్యక్రమంలో లీలాకుమార్, కేడీసీ సీబీ ఛైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు, ఎంపీపీ గాంధీ, జడ్పీటీసీ సభ్యురాలు నాగ మణి, సర్పంచి వేల్పుల పద్మకుమారి, వూట్ల నాగేశ్వరరావు, వేల్పుల రవికుమార్, బత్తుల రామారావు, చేని కుమారి, గుంటుపల్లి వాసు, కాకాని గోపయ్య, పద్మ, అధికారులు పాల్గొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Local News, Vijayawada