హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

బెజవాడలో 'జర్నలిస్ట్' పై దాడి.. ఆ వీడియో తీయడమే కారణమట..

బెజవాడలో 'జర్నలిస్ట్' పై దాడి.. ఆ వీడియో తీయడమే కారణమట..

విజయవాడ ఫుడ్ కోర్టులో జర్నలిస్ట్ పై దాడి

విజయవాడ ఫుడ్ కోర్టులో జర్నలిస్ట్ పై దాడి

Vijayawada: స్థానిక ప్రజాప్రతినిధికి అడిగినంత ఇస్తే రోడ్డు మీదే అర్థరాత్రి అయిన సరే అక్కడ వ్యాపారాలు చేసుకునే సౌకర్యం ఒక్క విజయవాడలోనే కనిపిస్తోంది. ఇది ఇలా ఉంటే అధికారాన్ని అడ్డం పెట్టుకుని అర్ధరాత్రి వరకు ఫుడ్ కోర్టు నడపడమే కా కుండా అధికార పార్టీ నేతలమంటూ మీడియా వారిని చితకబాదడంతో కలకలం రేపింది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Vijayawada, India

K Pawan Kumar, News18, Vijayawada

విజయవాడ (Vijayawada) అంటేనే ఎక్కువగా ఫుడ్ ఐటమ్స్ గుర్తుకు వస్తాయి. అది ఫుడ్ లవర్స్ కి ఇందిరాగాంధీ స్టేడియం వద్ద ఉన్న ఫుడ్‌ కోర్టు ఒక గొప్ప వరం అని చెప్పాలి. అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ ఈ ఒక్క ఫుడ్ కోర్ట్ లోనే దొరుకుతాయి. ఈ ఫుడ్ కోర్టుకి నిత్యం వేల సంఖ్యలో జనం వస్తుంటారు. ఫుడ్ కోర్ట్ లో అమ్మే ఆహార పదార్ధాలు ధర అందరికి అందుబాటులో చాలా తక్కువ ధర ఉండటం అది కూడా హోటల్స్ లాంటివి కాకుండా రోడ్డు పైనే స్టాల్స్‌ ఉండటంతో అక్కడ ప్రజలుకు చాలా బాగా నచ్చుతుంది. దానితో అక్కడికి వచ్చే వారి డిమాండ్ చూసి వారికి ఇష్టమొచ్చినట్లుగా ఎక్కడ పడితే అక్కడ ప్రజా ప్రతినిధులు రోడ్ల మీద అర్థరాత్రి వ్యాపారాలు చేయడం మొదలు పెట్టారు.

స్థానిక ప్రజాప్రతినిధికి అడిగినంత ఇస్తే రోడ్డు మీదే అర్థరాత్రి అయిన సరే అక్కడ వ్యాపారాలు చేసుకునే సౌకర్యం ఒక్క విజయవాడలోనే కనిపిస్తోంది. ఇది ఇలా ఉంటే అధికారాన్ని అడ్డం పెట్టుకుని అర్ధరాత్రి వరకు ఫుడ్ కోర్టు నడపడమే కా కుండా అధికార పార్టీ నేతలమంటూ మీడియా వారిని చితకబాదడంతో కలకలం రేపింది. పోలీసులుకు వెళ్లి వెంటనే ఫిర్యాదు చేసినప్పటికీ కూడా ప్రయోజనం లేకుండా పోయింది. దాడి చేసిన వారు ఎమ్మెల్యే అనుచరులు కావడంతో పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉన్నారని బాధితులు ఆరోపిస్తున్నారు.

ఇది చదవండి: గ్రామాల్లో మూఢనమ్మకాలు.. స్వయంగా రంగంలోకి దిగిన ఎస్పీ

గత వారంలో ఫుడ్ కోర్టులోని ఓ స్టాల్‌లో వంట చేస్తుండగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. కానీ అదృష్టవశాత్తూ అక్కడి వారు స్టాల్ కి సంబంధించిన వారు వాటిని అదుపు చేయడంతో అక్కడి వారంతా ఊపిరి పీల్చుకున్నారు ఎంత అదుపు చేసినప్పటికీ కూడా పరిస్థితి మాత్రం చాలా ప్రమాదకరంగానే ఉందని సంగతి అక్కడ వెలుగులోకి వచ్చింది. ఇదిలా ఉండగా ఆదివారం ఫుడ్‌ కోర్టులో ఉన్న పరిస్థితులును అక్కడ జరుగుతున్న లోపాలను రికార్డు చేస్తున్నారు ఓ మీడియా ప్రతినిధి. దీంతో అక్కడే ఉన్న నిర్వహుకులు అతడిపై దాడి చేశారు. తాము ఎమ్మెల్యే మనుషులమని ఎవరూ ఏమీ చేయాలేరంటూ బెదిరింపులకు దిగారు.

ఫుడ్ కోర్టులో దాదాపు గంటపాటు ఈ ఘర్ణణ వాతావరణం నెలకొన్న పోలీసులు అటువైపు కన్నెత్తి చూడలేదు. ఐతే ఎమ్మెల్యే అనుచరులపై ఫిర్యాదు చేస్తే తిరిగి అక్రమ కేసులు బనాయిస్తామంటూ మరోసారి బెదిరింపులకు పాల్పడ్డారు. గతంలో కూడా ఇదే తరహాలో ఘటన ఫుడ్ కోర్టులో చోటు చేసుకుంది. బెజవాడకు హైకోర్టు న్యాయవాది భర్తతో కలిసి భోజనం చేద్దామని సరదాగా ఫుడ్‌ కోర్టుకు వెళ్లగా వారు అక్కడ తిన్న బిర్యానీ బాగోలేదని చెప్పారు. అలా చెప్పడంతో వారికి ఫుడ్‌ కోర్టు నిర్వాహకులతో గొడవ జరిగింది. దీంతో స్టాల్స్ నిర్వాహకులు అంత కలిసి దంపతులపై మూకుమ్మడిగా దాడి చేశారు. అధికార పార్టీ అనుచరుల మంటూ వారికి ఇష్టమొచ్చినట్లు రెచ్చిపోయారు. దాడిలో న్యాయవాది భర్తకు తీవ్రగాయాలయ్యా యి. ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోకపోవడంతో న్యాయవాదులంతా కలిసి ధర్నాకు దిగి కోర్టు దృష్టికి తీసుకెళ్తామని హెచ్చరించడంతో చివరకి కేసు నమోదు చేశారు.

First published:

Tags: Andhra Pradesh, Local News, Vijayawada

ఉత్తమ కథలు