Yashwanth, News18, Jaggayyapeta
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని పలు జిల్లాలు వర్షాలకు అతలాకుతలమవుతున్న సంగతి తెలిసిందే. అకాల వర్షాల ధాటికి వేలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. అలాగే లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత వారం రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు తెలంగాణ (Telangana) రాష్ట్రంలో కురిసిన వర్షాలకు జలాశయాలు నిండు కుండల ఉండటంతో అక్కడ అధికారులు వరద నీరును కింద ప్రాంతాలకువిడుదల చేశారు ఈ తరుణంలో ఎన్టీఆర్ జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. నందిగామ ఆర్డీవో వీరేంద్రనాథ్ కిందిస్థాయి అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు.
ఎగుప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు మంగళవారం రాత్రికి పెనుగంచిప్రోలు మునేరు, వైరా ఏరు, కట్టలేరుకు ఎగు ప్రాంతాల నుంచి భారీ వరద నీరు వచ్చి చేరుతుందని ఈ నేపథ్యంలోనే ఉపనదులు తీర ప్రాంత ప్రజలు మున్నేరు పరివాహ గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
అదే విధంగా నందిగామ మండలంలోని ప్రస్తుతానికి కూడెల్లి గ్రామంలోని కాజ్ వే పై నుంచి వరద నీరు ప్రవహిస్తుందని దీంతో సమీప గ్రామ ప్రజలు పంట పొలాల కోసం కానీ, గేదెలు, జీవాలు, ఆవులు, ఎద్దుల మేత కోసం వరదనీటిలో వెళ్ళవద్దని గ్రామంలోని చాటింపు దొర తెలియజేయాలని ఆ గ్రామ అధికారులకు నందిగామ ఆర్డీవో వీరేందర్ తెలియజేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP Floods, Local News, Vijayawada