Home /News /andhra-pradesh /

VIJAYAWADA FLIGHT RESTAURANT ATTRACTING VIJAYAWADA PEOPLE YOU CAN EAT YOUR FAVOURITE FOOD FULL DETAILS HERE PRN VPR NJ

Vijayawada: ఈ ఫ్లైట్ ఎక్కాలంటే టికెట్ అవసరం లేదు.. ఫుడ్ ఆర్డర్ ఇస్తే చాలు..

విజయవాడ

విజయవాడ శివారులోని ఫ్లైట్ రెస్టారెంట్

Flight Restaurant: విమాన ప్రయాణం అంటే ఇష్టముండని వారుంటారా చెప్పండి. అలా గాల్లో ప్రయాణిస్తూ.., ఆ మేఘాలను చూస్తున్నప్పుడు కలిగే అనుభూతి మాటల్లో చెప్పలేం. ఇకపోతే విమానంలో విండో సీట్ సొంతమైతేచెప్పలేని ఆనందం మన సొంతం అయినట్లే, మరికొంత మంది ఆకాశవీధుల్లో విహారిస్తురుచికరమైన భోజనం చేయడానికి ఇష్టపడుతుంటారు.

ఇంకా చదవండి ...
  Prayaga Raghavendra Kiran, News18, Vijayawada

  విమాన ప్రయాణం అంటే ఇష్టముండని వారుంటారా చెప్పండి. అలా గాల్లో ప్రయాణిస్తూ.., ఆ మేఘాలను చూస్తున్నప్పుడు కలిగే అనుభూతి మాటల్లో చెప్పలేం. ఇకపోతే విమానంలో విండో సీట్ సొంతమైతేచెప్పలేని ఆనందం మన సొంతం అయినట్లే, మరికొంత మంది ఆకాశవీధుల్లో విహారిస్తురుచికరమైన భోజనం చేయడానికి ఇష్టపడుతుంటారు. కానీ సామాన్యులకు విమానం ఎక్కడమే ఓ కలలాంటిది. దాన్నెప్పుడూ అందని ద్రాక్షగానే భావిస్తుంటారు. ఫ్లైట్ జర్నీని కలలో మాత్రమే ఉహించుకునేవారి కలలు ఇప్పుడు నిజం చేసుకోవచ్చు. టికెట్ లేకుండానే ఫ్లైట్ ఎక్కి.. వెరైటీస్ ఆఫ్ ఫుడ్ ను ఎంచక్కా లాగించేయొచ్చు. ఎయిర్ పోర్టుకు వెళ్లకుండా.. బోర్డింగ్ పాస్ తీసుకోకండా ఫ్లైట్ ఎక్కేయొచ్చు. అదేలా సాధ్యమనుకుంటున్నారా.. ఆ ఫ్లైట్ ఎక్కాలంటే.. ముందు బెజవాడ బస్సెక్కాలి.

  రాష్ట్రంలో తొలి విమాన రెస్టారెంట్‌
  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని విజయవాడ (Vijayawada) కు సమీపంలో ఉన్న గన్నవరం విమానాశ్రయానికి అంత్యంత చేరువలో ఎయిర్ ఇండియాకు చెందిన పాత విమానాన్ని అందమైనరెస్టారెంట్‌గా తీర్చిదిద్దారు. దేశ వ్యాప్తంగా నేటి వరకు వివిధ రాష్ట్రాల్లో నాలుగు విమాన రెస్టారెంట్లు ఉండగా, తెలుగు రాష్ట్రాల్లో ఇదే మొట్ట మొదటి విమాన రెస్టారెంట్.

  ఇది చదవండి: ఈ కోళ్లను కొనాలంటే ఆస్తులమ్ముకోవాలి.. వాటికున్న డిమాండ్ అలాంటిది మరి.. మీరే చూడండి..!


  వేలంలో విమానాన్ని కొన్నారు..రెస్టారెంట్‌గా మార్చారు
  రెండు ఏళ్ల క్రితం ఢిల్లీలో జరగిన పాత విమానాల వేలంలో విజయవాడ కు చెందిన ప్రమఖులు విమానాన్ని కొనుగోలు చేసి భారీ ట్రక్ సహయంతో విజయవాడకు తరలించారు. రూపం లేని విమానానికి రూపాన్ని అందించి నూతన అధ్యయానికి శ్రీకారం చుట్టారు. విమానంలోపలికి వెళితే కళ్లుచెదిరే డిజైన్లు..., అద్భుతమైన ఇంటీరియర్‌ డిజైన్స్‌ చూపరులను ఆకట్టుకుంటున్నాయి. టేబుల్‌ అరెంజ్‌మెంట్స్‌ దగ్గర నుంచి.. వెయిటర్స్‌ వడ్డించే వరకు అన్నింటా కొత్తదనమే కనిపిస్తుంది.

  ఇది చదవండి: జీవం ఉట్టిపడటం అంటే ఇదే.. వారెవా ఏం టాలెంట్ గురూ..! చరిత్రకు జీవం పోస్తున్నారు..


  క్యూ కడుతున్న ఫుడ్‌ లవర్స్‌
  నాణ్యమైన భోజనం సరసమైన ధరలకే అందించడం మా లక్ష్యం అంటున్నారు ఈ రెస్టారెంట్‌ నిర్వాహకులు. ఈ రెస్టారెంట్‌లో తెలుగు రుచుల తోపాటు ,వెజ్ , నాన్ వెజ్ భిర్యనిలు, సూప్స్, స్టార్టర్స్, నార్త్ ఇండియన్, చైనీస్ వంటాల స్వాగతం పలుకుతాయి.ఎయిర్ హోస్టెస్ లేకపోయినా ఆప్యాయతతో భోజనం వడ్డించే సర్వర్లు. విమానం గాలిలో ఎగరకపోయినా విమాన ప్రయాణ అనుభూతి పొందాలానేకునే వారికి ఇదే పర్ ఫెక్ట్ స్పాట్ అని చెప్పొచ్చు. కేవలం రుచికరమైన భోజనం కోసమే కాకుండా ఈ విమానాన్ని చూసి ఎంజాయ్ చేయడం కోసం ఇక్కడకు అనేక మంది వస్తుంటారు. ఇక వీకెండ్స్ వస్తే పిల్లలతో కలిసి ఫ్యామిలీతో పాటు వచ్చి సందడి చేస్తున్నారు నగరవాసులు. విమానంతో సెల్ఫీలు తీసుకుంటూ ఎంజాయ్‌ చేస్తున్నారు.

  ఇది చదవండి: ముగ్గురు మిత్రుల వినూత్న ఐడియా.. ఇప్పుడు కాసులు కురిపిస్తోంది..!


  త్వరలోనే పిల్లల కోసం అదిరిపోయే ప్లే ఏరియా
  ఏడాదిన్నార క్రితం ఈ విమానాన్ని వేలంలో తీసుకుని రెస్టారెంట్‌గా మార్చామని.. గత ఆరునెలలుగా నగరవాసులకు అందుబాటులోకి వచ్చిందంటున్నారు నిర్వాహకులు రవిశంకర్‌. ఇంకా కొన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని.., త్వరలోనే పిల్లల కోసం ప్లేయింగ్ ఏరియాను సుందరంగా తీర్చిదిద్దుతామని, వెయిటింగ్ హాల్స్ కూడా ఏర్పాటు చేస్తామంటున్నారు. అతి తక్కువ కాలంలో ఇంత ఆదరణ పొందటం చాలా సంతోషంగా ఉందని.. విమాన అనుభూతి పొందాలనుకునే వారికి ఈ రెస్టారెంట్ ఎప్పుడూ స్వాగతం పలుకుతోందంటున్నారు.
  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Vijayawada

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు