VIJAYAWADA FIVE STUDENTS GOES MISSING AFTER THEY WENT FOR SWMMING IN KRISHNA RIVER NEAR VIJAYAWADA ANDHRA PRADESH FULL DETAILS HERE PRN
Sad News: సంక్రాంతి సెలవుల్లో విషాదం.. కృష్ణానదిలో ఐదుగురు విద్యార్థుల గల్లంతు..
ప్రతీకాత్మకచిత్రం
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని కృష్ణా జిల్లా (Krishna District) లో ఘోర విషాదం చోటు చేసుకుంది. . కృష్ణా జిల్లా చందర్లపాటు మండలం ఏటూరు గ్రామానికి చెందిన ఐదుగురు విద్యార్థులు ఈతకు వెళ్లి గల్లంతయ్యారు.
సంక్రాంతి సెలవులొచ్చాయి. స్కూళ్లు లేకపోవడంతో వారంతా సరదాగా ఆడుకుంటున్నారు. అందరూ 12-13 ఏళ్ల వయసులోని వారే. బాగా ఆడుకొని అలసిపోయారో ఏమో.. సేదదీరేందుకు నదిలో ఈతకు దిగారు. లోతును అంచనా వేయలేక గల్లంతయ్యారు. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని కృష్ణా జిల్లా (Krishna District) లో ఘోర విషాదం చోటు చేసుకుంది. . కృష్ణా జిల్లా చందర్లపాటు మండలం ఏటూరు గ్రామానికి చెందిన ఐదుగురు విద్యార్థులు ఈతకు వెళ్లి గల్లంతయ్యారు. సంక్రాంతికి స్కూళ్లకు సెలవులు కావడంతో అప్పటివరకు ఆడుకొని సాయంత్రం మున్నేరు వైపు వెళ్లారు. చికటిపడినా పిల్లలు ఇంటికి రాకపోయేసరికి తల్లిదండ్రులు గాలించగా.. నది ఒడ్డున వారి బట్టలు, సైకిళ్లు కనిపించాయి. అప్పటివరకు సరదాగా ఆడుకున్నవారిని నది అమాంతం మింగేసింది.
ఏటూరు గ్రామానికి చెందిన జెట్టి అజయ్ (12), మాగులూరి సన్నీ (12), మైల రాకేష్ (12), జెర్రిపోతుల చరణ్ (13), కర్ల బాలయేసు (12), స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నారు. క్లాస్ మేట్స్ కావడంతో సెలవుల్లోనూ కలిసే ఆడుకుంటున్నారు. ఈ క్రమంలో నదిలో ఈతకు వెళ్లి కొట్టుకుపోయారు.
విద్యార్థులు గల్లంతైన సమాచారం అందుకున్న స్థానికులు, పోలీసులు నదిలో గాలింపు చర్యలు చేపట్టారు. గజ ఈతగాళ్లు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది విద్యార్థుల కోసం గాలిస్తున్నారు. ఏటూరు వద్ద నదీ ప్రవాహం ఎక్కవగా ఉండటం, లోతును అంచనా వేయలేకపోవడంతో విషాదం చోటు చేసుకుంది. కొందరు నాటుపడవలతో మున్నేరు వైపు గాలిస్తున్నారు. చీకట్లోనూ గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మరోవైపు అప్పటివరకు ఆడుతూ పాడుతూ వెళ్లిన పిల్లలు నదిలో గల్లంతయ్యే సరికి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నాయి. వారంతా ప్రాణాలతో తిరిగి రాకపోతారా అని ఆశగా ఎదురుచూస్తున్నారు.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.