Prayaga Raghavendra Kiran, News18, Vijayawada
బెజవాడ నగర ప్రజలను గత కొన్ని రోజులుగా కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న దొంగలను పోలీసులు ఎట్టకేలకు పట్టుకునన్నారు. ఆధునిక టెక్నాలజీ ఆధారంగా గవర్నర్పేట్ పోలీసులు అరెస్ట్ చేశారు. విజయవాడ (Vijayawada), కృష్ణలంకకి చెందిన దాసరి శ్రీనివాసరావు అనే వ్యక్తి భవానిపురంలోని రామకృష్ణ లారీ ట్రాన్స్ పోర్ట్ ఆఫీస్లో గుమస్తాగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. మే 19న లారీ ట్రాన్స్ పోర్ట్ ఆఫీస్లో పని ముగించుకుని తిరిగి ఇంటికి బయల్దేరాడు. సుమారు 11 గంటల సమయంలో మోటార్ సైకిల్ పై పాత ప్రభుత్వ హాస్పిటల్ సమీపంలో వెనుక నుండి గుర్తు తెలియని వ్యక్తులు పల్సర్ బండి మీద వచ్చి చొక్కా జేబులో వున్నా POCO M3 మొబైల్ ఫోన్ ను లాక్కొని వెళ్లారు. దీంతో బాధితుడు వెంటనే గవర్నర్ పేట్ పోలీసులకు ఫిర్యాదుచేయగా.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చెప్పట్టారు.
ఇలా వరుసగా నగరంలో జరుగుతున్న ఘటనలపై ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా అధికారులను అలర్ట్ చేశారు. నిందితులను సాధ్యమైనంత త్వరగా పట్టుకోవాలని ఇన్స్పెక్టర్లను ఆదేశించారు. గవర్నర్ పేట్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ డి. సురేష్ సిబ్బందితో కలిసి సంఘటన స్ధలంకి చేరుకొని సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా నిందితులను గుర్తించి అదుపులోనికి తీసుకున్నారు.
నిందితులను బాపట్ల జిల్లా చుండూరు మండలం వలివేరుకు చెందిన కగ్గ ఆంజనేయులు(20), అదే గ్రామానికి చెందిన చొప్పవరపు వెంకటేష్(22), గుంటూరు జిల్లా తెనాలికి చెందిన మన్నవ సాయి వంశి(22), తెనాలికి చెందిన భిరోది భాను ప్రకాష్(22), యడ్లపల్లికి చెందిన పటాస్ గౌస్ ఖాస్(29)లుగా గుర్తించారు.నిందితుల నుంచి మొబైల్ ఫోన్, 27 మోటార్ సైకిళ్లను (Bullet-5, Pulsar- 16, Splendor-2, HF Deluxe-1, Access-1 Activa-1 Dio-1) స్వాధీనం చేసుకున్నట్లు ఇన్స్పెక్టర్ సురేష్ తెలిపారు.
అందరు చెడు వ్యసనాలకు బానిసై జల్సాలకు అలవాటు పడి దొంగతనాలు చేయడం ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. ఆ క్రమంలోనే పొన్నూరు, గుంటూరు, గుడివాడ, తణుకు, విజయవాడ మరియు తెలంగాణాలోని నేలకొండపల్లి, కోదాడలలో మోటార్ సైకిళ్లను దొంగతనాలు చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. వీటితో పాటు మొబైల్ ఫోన్లు కూడా దొంగతనలు చేసినట్లుగా సమాచారం.
నిందుతులు పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించిన గవర్నర్ పేట్ ఇన్స్పెక్టర్ సురేష్, ఎస్సై జి.ఫణేంధర్ మరియు సిబ్బందిని కమిషనర్ కాంతిరాణా అభినందించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Bike theft, Local News, Vijayawada