Home /News /andhra-pradesh /

VIJAYAWADA FIRE MISHAP PMO ANNOUNCES EX GRATIA OF RS 2 LAKH FOR KIN OF DECEASED BA

Vijayawada Fire Mishap | విజయవాడ ప్రమాద మృతుల కుటుంబాలకు కేంద్రం పరిహారం..

ప్రధాని మోదీ(ఫైల్ ఫోటో)

ప్రధాని మోదీ(ఫైల్ ఫోటో)

విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్ హోటల్లో జరిగిన అగ్నిప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా ప్రకటించింది.

    విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్ హోటల్లో జరిగిన అగ్నిప్రమాదంలో చనిపోయిన 10 మంది కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. చనిపోయిన వారిలో ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున పరిహారం అందివ్వనున్నట్టు ప్రధానమంత్రి కార్యాలయం ప్రకటించింది. ఈ నిధులను PMNRF కింద విడుదల చేయనున్నారు. ఈ ఘటనలో గాయపడిన వారికి ఒక్కొక్కరికి రూ.50,000 చొప్పున అందించనున్నారు. మరోవైపు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చనిపోయిన వారి కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున పరిహారాన్ని ప్రకటించింది. ఈ విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలియజేశారు. విజయవాడలో ప్రమాదం గురించి తెలిసిన వెంటనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. సహాయకచర్యల గురించి ఆరా తీశారు. సీఎం జగన్ కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, చెల్లిస్తున్న పరిహారం గురించి తెలియజేశారు.



    స్వర్ణ ప్యాలెస్ అగ్ని ప్రమాదంలో మృతుల వివరాలు..

    1. కొసరాజు సువర్ణలత (42), గృహిణి. గుంటూరు జిల్లా పొన్నూరు మండలం నిడబ్రోలు

    2.డొక్కు శివబ్రహ్మయ్య (59) బెల్‌ కంపెనీ మేనేజరు, మచిలీపట్నం

    3. పొట్లూరి పూర్ణచంద్రరరావు (80).. కొడాలి, ఘంటశాల కృష్ణా జిల్లా.

    4. సుంకర బాబూరావు (80) రిటైర్డ్‌ ఎస్సై. ఇందిరానగర్‌, అజిత్‌సింగ్‌నగర్‌, విజయవాడ

    5. మజ్జి గోపి (54) మచిలీపట్నం

    6. జి.వెంకట జయలక్ష్మి (52) కందుకూరు, ప్రకాశం జిల్లా

    7. వెంకట నర్సింహ పవన్‌ కుమార్‌, కందుకూరు, ప్రకాశం జిల్లా

    8. సబ్బిలి రత్న అబ్రహాం (48) పాస్టర్. జగ్గయ్యపేట
    9. సబ్బిలి రాజకుమారి(భార్యభర్తలు), జగ్గయ్యపేట (పాస్టర్ భార్య)

    10. మద్దాలి రఘు, మొగల్రాజపురం

    రమేశ్‌ ఆస్పత్రి యాజమాన్యం స్వర్ణ ప్యాలెస్ హోటల్‌ను అద్దెకు తీసుకుని దాన్ని అందులో కరోనా పేషెంట్లకు చికిత్స అందిస్తోంది. అయితే కరోనా పేషెంట్ల విషయంలో ప్రభుత్వానికి తప్పుడు నివేదిక ఇచ్చినట్లు అధికారులు గుర్తించినట్టు తెలిసింది. దీంతో పాటు భారీగా ఫీజులు వసూలు చేస్తున్నట్లు వెల్లడి కావడంతో ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ​అగ్ని ప్రమాదం అనంతరం వివరాలను తెలుసుకునే క్రమంలో రమేశ్‌ ఆస్పత్రి యాజమాన్యం తప్పుడు లెక్కలు చూపించినట్లు తెలిసింది. దాంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఏపీ ప్రభుత్వం.. ప్రమాద ఘటనతో పాటు అవతవకలపై విచారణకు ఆదేశించింది.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: Andhra Pradesh, Vijayawada Fire Accident

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు