Home /News /andhra-pradesh /

VIJAYAWADA FIRE MISHAP KRISHNA DISTRICT COLLECTOR CANCELS COVID 19 TREATMENT LICENCE TO RAMESH HOSPITAL DUE TO SWARNA PALACE FIRE ACCIDENT BA GNT

Vijayawada Fire Mishap | రమేష్ ఆస్పత్రిపై కృష్ణా కలెక్టర్ సంచలన నిర్ణయం..

విజయవాడలో కోవిడ్ కేర్ సెంటర్‌లో అగ్ని ప్రమాదం( ఫైల్ ఫోటో)

విజయవాడలో కోవిడ్ కేర్ సెంటర్‌లో అగ్ని ప్రమాదం( ఫైల్ ఫోటో)

విజయవాడ స్వర్ణప్యాలెస్ మోటల్లో అగ్నిప్రమాదం ఘటనపై జాయింట్‌ కలెక్టర్‌ కమిటీ ప్రాథమిక నివేదిక ఇచ్చింది.

    విజయవాడ స్వర్ణ హోటల్ లో అగ్ని ప్రమాదం జరిగి 10 మంది మరణించిన నేపథ్యంలో ఈ కేంద్రాన్ని నిర్వహిస్తున్న డాక్టర్ రమేష్ ఆస్పత్రి యాజమాన్యానికి గతంలో ఇచ్చిన కోవిడ్ చికిత్సల అనుమతులను రద్దు చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ ఎఎండి ఇంతియాజ్ ఆదేశాలు జారీ చేశారు. విజయవాడ స్వర్ణప్యాలెస్ మోటల్లో అగ్నిప్రమాదం ఘటనపై జాయింట్‌ కలెక్టర్‌ కమిటీ ప్రాథమిక నివేదిక ఇచ్చింది. హోటల్ నిర్వహణలో రమేష్ ఆస్పత్రి యంత్రాంగం జాగ్రత్తలు తీసుకోలేదని, కోవిడ్‌ చికిత్సలో రమేష్‌ ఆస్పత్రి.. ప్రభుత్వ నిబంధనలను భేఖాతరు చేసిందని నివేదికలో కమిటీ పేర్కొంది. కరోనా పేషెంట్ల నుంచి భారీగా ఫీజులను వసూలు చేశారని, ఆస్పత్రి రిజిస్ట్రేషన్‌ సర్టిఫికేట్‌ను ప్రభుత్వానికి స్వాధీనం చేయాలని కమిటీ అభిప్రాయపడింది. రమేష్‌ ఆస్పత్రిలో కేటగిరి 'ఏ' కోవిడ్‌ ట్రీట్‌మెంట్ సేవలను కలెక్టర్‌ రద్దు చేశారు. కమిటీ గుర్తించిన అంశాలపై ఈనెల 30లోపు డీఎంహెచ్‌వో ఆఫీసులో వివరణ ఇవ్వాలని రమేష్ ఆస్పత్రి యాజమాన్యానికి వైద్య ఆరోగ్యశాఖ ఆదేశించింది. స్వర్ణప్యాలెస్ అగ్నిప్రమాద ఘటనపై కృష్ణాజిల్లా యంత్రాంగం ఐదుగురు సభ్యులతో కమిటీని నియమించిన విషయం తెలిసిందే. జాయింట్‌ కలెక్టర్‌-2(అభివృద్ధి) ఎల్‌.శివశంకర్‌ నేతృత్వంలో ఏర్పాటైన ఈ కమిటీలో విజయవాడ సబ్‌కలెక్టర్‌ హెచ్‌ఎం.ధ్యానచంద్ర, కార్పొరేషన్‌(వీఎంసీ) చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ జి.గీతాబాయ్‌, వీఎంసీ రీజినల్‌ ఫైర్‌ ఆఫీసర్‌ టి.ఉదయ్‌కుమార్‌, సీపీడీసీఎల్‌ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ను సభ్యులుగా ఉన్నారు. హోటల్‌లో భద్రతా ప్రమాణాలు, ఆస్పత్రి నిర్వహణలో లోపాలు, ఆధిక ఫీజులపై నివేదిక ఇవ్వాలని కలెక్టర్‌, కమిటీని ఆదేశించారు.

    నివేదికలో మరికొన్ని అంశాలు..
    ‘ప్రభుత్వం ఇచ్చిన జీవో ఎంఎస్ నంబర్-77ను అతిక్రమించి కోవిడ్ బాధితుల నుంచి అధికంగా ఫీజులను వసూలు చేసింది. రూల్-9 ఏపీ అల్లోపతిక్, ప్రైవేట్ మెడికల్ కేర్ రిజిస్ర్టేషన్, రెగ్యులేషన్ రూల్స్‌ను రమేష్ హాస్పిటల్ పట్టించుకోలేదు. ఆసుపత్రి రిసెప్షన్‌లో అందిస్తున్న సేవల రేటు ఇంగ్లీష్‌లోనూ, తెలుగులోనూ ప్రదర్శించాలి. అలాంటి బోర్డును ఏదీ ఆసుపత్రి వద్ద ప్రదర్శించలేదు. మెట్రో పాలిటన్ హోటల్, ఎం- 5 హోటల్‌లో జిల్లా అధికారుల అనుమతి లేకుండా కోవిడ్ కేసులను జాయిన్ చేసుకుంది. డిఎంహెచ్‌వో క్యాంపు ఆఫీస్ వద్ద ఈ నెల 30లోపు కమిటీ గుర్తించిన అంశాలపై లిఖిత పూర్వక సమాధానం ఇవ్వాలని ఆదేశిస్తూ వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. వాదనలు వినిపించేందుకు న్యాయవాదిని ఏర్పాటు చేసుకుంటే విచారణకు వారం రోజుల ముందే తెలియజేయాలి. ఆసుపత్రి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్‌ను విచారణకు వచ్చే ముందు లేదా అదే రోజు తీసుకువచ్చి, స్వాధీనపరచాలి’ అని కమిటీ ఆదేశించింది.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: Andhra Pradesh, Vijayawada Fire Accident

    తదుపరి వార్తలు