Home /News /andhra-pradesh /

VIJAYAWADA FIRE MISHAP DETAILS OF DECEASED IN SWARNA PALACE FIRE ACCIDENT BA

Vijayawada Fire Mishap | విజయవాడ ప్రమాదంలో మృతుల వివరాలు...

విజయవాడలో కోవిడ్ కేర్ సెంటర్‌లో అగ్ని ప్రమాదం

విజయవాడలో కోవిడ్ కేర్ సెంటర్‌లో అగ్ని ప్రమాదం

విజయవాడ స్వర్ణప్యాలెస్‌లో ఈ రోజు తెల్లవారుజామున జరిగిన అగ్నిప్రమాదంలో చనిపోయిన 10 మంది వివరాలను ప్రభుత్వం వెల్లడించింది.

    విజయవాడ స్వర్ణప్యాలెస్‌లో ఈ రోజు తెల్లవారుజామున జరిగిన అగ్నిప్రమాదంలో చనిపోయిన 10 మంది వివరాలను ప్రభుత్వం వెల్లడించింది. పది మృతదేహాల వివరాలను బంధువులు, అధికారులు గుర్తించారు. ప్రస్తుతం ఆ మృతదేహాలను ప్రభుత్వ ఆస్పత్రిలో ఉంచారు. ఈ ఘటనకు సంబంధించి అటు స్వర్ణ ప్యాలెస్ హోటల్, ఇటు ఆ హోటల్‌లో పేషెంట్లను ఉంచిన రమేష్ ఆస్పత్రిపై కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి నాలుగు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. 48 గంటల్లో దీనిపై నివేదిక వచ్చిన తర్వాత ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. స్వర్ణ ప్యాలెస్‌కు ఎలాంటి ఫైర్ సేఫ్టీ అనుమతులు లేవని స్పష్టంచేసింది.

    మృతుల వివరాలు..

    1. కొసరాజు సువర్ణలత (42), గృహిణి. గుంటూరు జిల్లా పొన్నూరు మండలం నిడబ్రోలు

    2.డొక్కు శివబ్రహ్మయ్య (59) బెల్‌ కంపెనీ మేనేజరు, మచిలీపట్నం

    3. పొట్లూరి పూర్ణచంద్రరరావు (80).. కొడాలి, ఘంటశాల కృష్ణా జిల్లా.

    4. సుంకర బాబూరావు (80) రిటైర్డ్‌ ఎస్సై. ఇందిరానగర్‌, అజిత్‌సింగ్‌నగర్‌, విజయవాడ

    5. మజ్జి గోపి (54) మచిలీపట్నం

    6. జి.వెంకట జయలక్ష్మి (52) కందుకూరు, ప్రకాశం జిల్లా

    7. వెంకట నర్సింహ పవన్‌ కుమార్‌, కందుకూరు, ప్రకాశం జిల్లా

    8. సబ్బిలి రత్న అబ్రహాం (48) పాస్టర్. జగ్గయ్యపేట
    9. సబ్బిలి రాజకుమారి(భార్యభర్తలు), జగ్గయ్యపేట (పాస్టర్ భార్య)

    10. మద్దాలి రఘు, మొగల్రాజపురం

    రమేశ్‌ ఆస్పత్రి యాజమాన్యం స్వర్ణ ప్యాలెస్ హోటల్‌ను అద్దెకు తీసుకుని దాన్ని అందులో కరోనా పేషెంట్లకు చికిత్స అందిస్తోంది. అయితే కరోనా పేషెంట్ల విషయంలో ప్రభుత్వానికి తప్పుడు నివేదిక ఇచ్చినట్లు అధికారులు గుర్తించినట్టు తెలిసింది. దీంతో పాటు భారీగా ఫీజులు వసూలు చేస్తున్నట్లు వెల్లడి కావడంతో ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ​అగ్ని ప్రమాదం అనంతరం వివరాలను తెలుసుకునే క్రమంలో రమేశ్‌ ఆస్పత్రి యాజమాన్యం తప్పుడు లెక్కలు చూపించినట్లు తెలిసింది. దాంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఏపీ ప్రభుత్వం.. ప్రమాద ఘటనతో పాటు అవతవకలపై విచారణకు ఆదేశించింది.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: Andhra Pradesh, Coronavirus, Vijayawada, Vijayawada Fire Accident

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు