Yashwanth, News18, Jaggayyapet
ఎన్టీఆర్ జిల్లా (NTR District) లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. జగ్గయ్యపేట నియోజకవర్గం పెనుగంచిప్రోలులోని తిరుపతమ్మ దేవాలయం సమీపంలోని దుకాణ సముదాయంలో విద్యుదాఘాతంతో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదంలో 20 దుకాణాలు అగ్నికి ఆహుతి అయ్యాయి. సుమారు రూ.50 లక్షల ఆస్తి నష్టం జరిగినట్టు బాధితులు తెలిపారుఫిబ్రవరి 5 నుంచి తిరుపతమ్మ అమ్మవారి తిరునాళ్ల ఉన్నందున పెద్ద ఎత్తున బొమ్మలు, గాజులు, పూజా సామగ్రిని వ్యాపారులు నిల్వ చేశారు. విద్యుత్తు షార్ట్ సర్క్యూట్ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. జగ్గయ్యపేట నుంచి వచ్చిన అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. ఘటనాస్థలిని ఆలయ ఈవో, ఛైర్మన్, తహశీల్దార్ పరిశీలించారు. తిరుపతమ్మ దేవస్థానం దుకాణ సముదాయంలో అగ్ని ప్రమాదం బాధితుల గోడు మాటాల్లో చెప్పలేం..!
ఫిబ్రవరి 5వ తేదీ నుంచి తిరుపతమ్మ తిరునాళ్లు, అదే వారంలో సూర్యాపేట సమీపంలోని లింగమంతుల స్వామి తిరునాళ్లు, నార్కట్ పల్లి సమీపంలోని చెరువుగట్టు రామలింగేశ్వర స్వామి తిరునాళ్లు ఉన్నందున వ్యాపార నిమిత్తం అక్కడికి వెళ్లేందుకు గడిచిన రెండు మూడు రోజులుగా హైదరాబాద్ , విజయవాడ నుంచి పెద్ద ఎత్తున సరుకు కొనుగోలు చేశామని బాధిత వ్యాపారులు చెబుతున్నారు.
ఒక్కొక్కరు రెండు నుంచి మూడు లక్షల విలువైన సరుకు దింపుకొని దుకాణాల్లో ఉంచామని, ప్రమాదానికి ఆ సరుకు మొత్తం బూడిదైందని వాపోతున్నారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరుతున్నారు. మంటల్లో దగ్ధమైన దుకాణాల్లో బొమ్మలు, గాజులు, ఇతర పలు రకాల వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. ప్రమాదం వల్ల వ్యాపారులు ఒక్కొక్కరు లక్షల్లో నష్టపోయామని చెబుతున్నారు. ఆలయం ఆవరణలో ఉన్న 20 దుకాణాలు లో వ్యాపించాయి మంటలు. సుమారు రూ.50 లక్షలకు పైగా ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Local News, Vijayawada