Home /News /andhra-pradesh /

VIJAYAWADA FEMALE AUTO DRIVERS GETTING SUCCESS IN VIJAYAWADA AS NGO SUPPORTING THEM FULL DETAILS HERE PRN VPR NJ

Vijayawada: మహిళల చేతిలో బ్రతుకు బండి.. స్పూర్తినిస్తున్న జీవిత గాధలు

ఆటో

ఆటో నడుపుతున్న మహిళ

Vijayawada: పోటీ ప్రపంచంలో మహిళలు అన్ని రంగాలలో రాణిస్తున్నారు. మహిళలు అన్ని రంగాల్లో తమదైన శైలిలో సేవలు అందిస్తు ఉన్నత శిఖరాలకు చేరుకుంటున్నారు. ఆకాశంలో ఎగిరే విమానం నుంచి నేల మీద ప్రయాణించే వాహనాల వరకు అన్ని రకాల విషయాల్లోనూ ప్రావీణ్యం సంపాదించి మగవారికి ఏమాత్రం తీసిపోకుండా మహిళలు ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్తున్నారు.

ఇంకా చదవండి ...
  Prayaga Raghavendra Kiran, News18, Vijayawada

  పోటీ ప్రపంచంలో మహిళలు అన్ని రంగాలలో రాణిస్తున్నారు. మహిళలు అన్ని రంగాల్లో తమదైన శైలిలో సేవలు అందిస్తు ఉన్నత శిఖరాలకు చేరుకుంటున్నారు. ఆకాశంలో ఎగిరే విమానం నుంచి నేల మీద ప్రయాణించే వాహనాల వరకు అన్ని రకాల విషయాల్లోనూ ప్రావీణ్యం సంపాదించి మగవారికి ఏమాత్రం తీసిపోకుండా మహిళలు ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్తున్నారు. అటువంటి కోవలోకే వస్తున్నారు ఈ మహిళా ఆటో డ్రైవర్లు. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) విజయవాడ నగరం (Vijayawada City) లో కొందరు మహిళలు ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. తమ కుటుంబ పోషణలో చేదోడుగా మారి ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు. 2006 వరకు సామాన్య గృహిణిగా జీవితం గడుపుతున్నా, ఒక్కసారిగా కష్టాలు వరదలు చుట్టుముట్టాయి.

  అటువంటి సందర్భంలో "పీపుల్ ఫర్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్" తమకు చేయూత నిచిందని ఈ మహిళా ఆటో డ్రైవర్లు అంటున్నారు. కొద్ది రోజులు పాటు ఆటో డ్రైవింగ్ శిక్షణ ఇచ్చిన సంస్థ అనంతరం సబ్సిడీలో ఆటో కూడా అందించటం తమ జీవితాలకు ప్రాణం పోసిందని మహిళ ఆటో డ్రైవర్లు అంటున్నారు.

  ఇది చదవండి: సిలంబం నేర్చుకుంటే శివంగిలా దూసుకుపోతారు.. ట్రైనింగ్ ఎక్కడ ఇస్తారంటే..!


  ఆటో డ్రైవర్‌గానే జీవనం ఎందుకు?
  ఆటో డ్రైవింగ్ అంటే మాములు విషయం కాదు. నగరంలోని ట్రాఫిక్ రద్దీలో ఎంతో జాగ్రత్తగా వాహనాన్ని నడపాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు మగవారు మాత్రమే ఈ వృత్తిలో కొనసాగుతున్నారు. అటువంటిది మహిళలు ఎంత మేర ఈ వృత్తిలో రాణిస్తున్నారు? అనేది వీరిని చూస్తేనే అర్ధం అవుతుంది. "పోటీ ప్రపంచంలో అనేక రంగాలు ఉన్నప్పటికీ ఆటో డ్రైవర్‌గా జీవనం సాగించడం చాలా సంతోషంగా ఉంది. ఏడు ఏళ్లుగా ఆటో నడుపుకుంటూ, ఇద్దరు పిల్లలకు అన్ని విధాల అండగా నిలుస్తున్నా" అంటూ ఆటో డ్రైవర్ అంజనా దేవి అన్నారు.

  ఇది చదవండి: వ్యర్థాల నుంచి విద్యుత్‌... ఏపీలో తొలి ప్లాంట్‌ అక్కడే..! ప్రత్యేకతలవే..!  కోవిడ్ వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనప్పటికీ మనో ధైర్యాన్ని కోల్పోకుండా ఉన్నామని తెలిపారు. నగరంలో అనేక రకాల పనులు లభిస్తాయని, కానీ పనికి తగిన ప్రతిఫలం లేకపోగా శ్రమ దోపిడీ జరుగుతుందని వారు అంటున్నారు. సొంతంగా ఆటో నడపడం వలన శ్రమకు తగిన ప్రతిఫలంతో పాటు కుటుంబ అవసరాలు తీరుతున్నాయని వారు పేర్కొన్నారు. స్వయం ఉపాధి వల్ల తాము ఆనందకరమైన జీవితం జీవిస్తునట్లు మహిళ ఆటో డ్రైవర్ అంజనా దేవి తెలిపారు. ప్రభుత్వం నుంచి కొంత సహాయం అందుతుందని దీంతో కుటుంబ పోషణకు ఇబ్బంది లేదని అన్నారు.

  ఇది చదవండి: ఆ ఇల్లే ఓ మాయాద్వీపం.. అంతకంటే పెద్ద మ్యూజియం.. అక్కడ అద్భుతాలెన్నో..!  అవహేళన చేసిన వారే శెభాష్ అంటున్నారు
  మగవారు చేసే ఏ పనైనా మహిళలు చేస్తే సమాజంలో ఒక రకమైన చులకన భావన ఉండేది. అటువంటి వాటిని సవాలుగా తీసుకుంటున్న మహిళలు సమాజ ధోరణిని పట్టించుకోకుండా ధైర్యంగా ముందుకు సాగుతున్నారు. అయితే కష్ట కాలంలో ఆదుకోవాల్సిన వారే.. ఆటో డ్రైవింగ్ చేస్తున్నావా అంటు అవహేళన చేశారు. "అయిన సరే లెక్క చేయక, కుటుంబ పోషణ కోసం తన వంతు సహాయ సహకారాలు అందించడమే ధ్యేయంగా ఏడేళ్ల నుంచి ఆటో డ్రైవింగ్ చేస్తున్నట్లు" మహిళా ఆటో డ్రైవర్ ప్రశాంతి తెలిపారు. అయితే మొదట్లో అవహేళన చేసిన వారే తమ విజయాన్ని చూసి శెభాష్ అంటున్నారని ఆమె తెలిపారు.  ప్రమాదాలు గమ్యస్థానాలకు
  నగరంలో ఆటో డ్రైవింగ్ సాధారణ విషయం కాదు. వేల కొద్ది వాహనాలు, గుంపులుగా జనం, వీటన్నిటిని దాటుకుంటూ ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాలి. నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్‌ను లెక్క చేయకుండా ప్రమాదాల భారిన పడకుండా ప్రయాణికులును సురక్షితంగా గమ్య స్థానాలకు చేరుస్తున్నామని ఈ మహిళా చోదకులు పేర్కొన్నారు. ప్రయాణికుల చేరవేతలో భాగంగా కొన్నిసార్లు దూరప్రాంతాలకు సైతం అవలీలగా వెళ్తుంటామని ఈ మహిళలు అంటున్నారు. దిశా యాప్ ఉండటం వల్ల మరింత భద్రత, ధైర్యంగా నగరంలో డ్రైవింగ్ చేస్తున్నట్లు మహిళ డ్రైవర్ ప్రశాంతి తెలిపారు. మహిళలు భయాన్ని వదిలి, బయటకు వస్తే అన్ని రంగాల్లో విజయం సాధించవచ్చని అంటున్నారు ఈ మహిళా ఆటో డ్రైవర్లు.
  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Local News, Vijayawada

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు