హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

కూతురిని హెలికాప్టర్‌లో అత్తారింటికి సాగనంపిన తండ్రి...!

కూతురిని హెలికాప్టర్‌లో అత్తారింటికి సాగనంపిన తండ్రి...!

హెలికాప్టర్ ముందు వధూవరులు

హెలికాప్టర్ ముందు వధూవరులు

సాధారణంగా వధూవరులను కారులో ఇంటికి పంపిస్తారు. కానీ వధువు తండ్రి ద్వారకానాథ్.. తమ కూతురు, అల్లుడిని ఏకంగా హెలికాప్టర్‌లో సాగనంపారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

పెళ్లి.. ప్రతి ఒక్కరి జీవితంలో అత్యంత మధురమైన ఘట్టం. జీవితాంతం గుర్తుండిపోయే అపురూప కార్యం. అందుకే ప్రతి ఒక్కరూ.. వివాహ వేడుకను అంగరంగ వైభవంగా జరుపుతారు. ఎంత ఖర్చుపెట్టేందుకైనా వెనకాడరు. ఇక సంపన్న కుటుంబాల్లో అయితే.. వారి ఇంట్లో పెళ్లి గురించి... ఊరుఊరంతా చర్చించేలా జరుపుతారు. ఆ చుట్టు పక్కల ఎవరూ చేయనంత ఘనంగా చేస్తారు. పెళ్లి పత్రికల నుంచి మొదలు వివాహం, ఊరేగింపు, అప్పగింతల వరకు... అన్ని ఘట్టాలకు అత్యంత అద్భుతంగా నిర్వహిస్తారు. ఏపీలో కూడా ఓ తండ్రి తన కూతురి పెళ్లి..ఇలాగే గ్రాండ్‌గా జరిపించారు. అప్పగింతల సమయంలో ఏకాంగా హెలికాప్టర్‌లో అత్తారింటికి పంపించారు. ప్రస్తుతం ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఏపీ టెన్త్ విద్యార్థులకు అలర్ట్.. ఈ సారి పరీక్షల్లో కొత్త రూల్స్.. పూర్తి వివరాలివే!

నెల్లూరు పట్టణాభివృద్ధి సంస్థ (NUDA) ఛైర్మన్‌ ముక్కాల ద్వారకానాథ్‌ కుమార్తె ఉషశ్రీకి శుక్రవారం వివాహం జరిగింది. విజయవాడకు చెందిన ప్రశాంత్‌తో అంగరంగ వైభవంగా ఆమె పెళ్లిని జరిపించారు. పెళ్లి తర్వాత వధూవరులిద్దరూ విజయవాడలోని వరుడి ఇంటికి వెళ్లాల్సి ఉంది. సాధారణంగా వధూవరులను కారులో ఇంటికి పంపిస్తారు. కానీ వధువు తండ్రి ద్వారకానాథ్.. తమ కూతురు, అల్లుడిని ఏకంగా హెలికాప్టర్‌లో సాగనంపారు. తన కూతురి కోసం అద్దె హెలికాప్టర్‌ను బుక్ చేసి.. అందులో అత్తారింటికి సాగనంపారు. తమ కోసం హెలికాప్టర్ రప్పించడంతో ఉషశ్రీ, ఆమె భర్త ప్రశాంత్ సంతోషపడ్డారు. ఆకాశంలో విహరిస్తూ... విజయవాడకు వెళ్లారు. ప్రస్తుతం ఆ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. కూతురంటే ఆ తండ్రికి ఎంత ప్రేమ అని కామెంట్స్ చేస్తున్నారు.

ఇటీవల ఓ వ్యాపారవేత్త కూడా పెళ్లి పత్రికలను పంచేందుకు హెలికాప్టర్‌లో వెళ్లారు. హైదరాబాద్‌కు చెందిన వ్యాపారి మధు యాదవ్ తన సోదరుడి పెళ్లి కార్డులు ఇచ్చేందుకు హెలికాప్టర్ లో వెళ్లి అందరి దృష్టిని ఆకర్షించారు. మధు యాదవ్ కుటుంబానికి ముంబయిలో బంధువులు ఉన్నారు. అక్కడే కొందరు మిత్రులు కూడా ఉన్నారు. అయితే వారికి వాట్సాప్ లోనే వెడ్డింగ్ కార్డు పంపకుండా.. స్వయంగా వెళ్లి ఆహ్వానించాలనుకున్నాడు. వారికి శుభలేఖలు ఇచ్చేందుకు ఆయన ప్రత్యేక హెలికాప్టర్ లో హైదరాబాదు నుంచి ముంబయి వెళ్లారు. అక్కడ బంధుమిత్రులందరికీ పెళ్లి కార్డులు ఇచ్చి ఆహ్వానించారు. ఈ విధంగా తన తమ్ముడిపై ఉన్న ప్రేమాభిమానాలను మధు చాటుకున్నారు. ఆ వీడియో కూడా ఇటీవల వైరల్ అయింది.

First published:

Tags: AP News, Local News, Nellore, Vijayawada