Bad luck: దురదృష్టమంటే ఇదే..! 20 లక్షలు క్యాష్, 50 కాసుల బంగారం బుగ్గిపాలు

అగ్నికి ఆహుతైన నగదు

Thunder bolt: దురదృష్టం మనిషిని ఎటువైపు నుంచైనా వెంటాడుతుంది. అప్పటివరకూ బాగానే ఉన్న జాతకం ఒక్కసారిగా తలకిందులవుతుంది. ఎన్నో కష్టనష్టాలు ఓర్చుకొని సంపాదించినందతా బూడిదపాలవుతుంది.

 • Share this:
  దురదృష్టం మనిషిని ఎటువైపు నుంచైనా వెంటాడుతుంది. అప్పటివరకూ బాగానే ఉన్న జాతకం ఒక్కసారిగా తలకిందులవుతుంది. ఎన్నో కష్టనష్టాలు ఓర్చుకొని సంపాదించినందతా బూడిదపాలవుతుంది. అప్పుడప్పుడు అగ్నిప్రమాదాల్లో ఇళ్లు కాలిపోవడంతో సంపదంతా బుగ్గిపాలవుతుంది. కానీ వానాకాలం.. ఎక్కడా అగ్నిప్రమాదం జరగలేదు. అసలు అగ్గిపుట్టే అవకాశమేలేని చోటు ఆకాశం నుంచి అగ్గిదేవుడు విరుచుపడ్డాడు. పొలం అమ్మి సంపాదించిన సొమ్ము, ఏళ్లపాటు కష్టపడి సంపాదించిన సొమ్ముతో కొనుగోలు చేసిన బంగారం మంటల్లో కలిసిపోయాయి. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్  (Andhra Pradesh)లోని  పశ్చిమగోదావరి జిల్లా (West Godavari) చింతలపూడి మండలం గురుభట్లగ్రామం గ్రామంలోని శివాలయం వీధి పక్కన కాళ్ల కృష్ణవేణి అనే మహిళ ఇంటిపై పిడుగుపడింది. దీంతో ఇంట్లో మంటలు వ్యాపించాయి. దీంతో ఇంట్లో ఉన్న బంగారం, నగదు అగ్నికి ఆహుతయ్యాయి. తన కుమారుడ్ని అగ్రికల్చర్ బీఎస్సీ చదివించేందుకు తమకున్న పొలం అమ్మి రూ.20లక్షలు తీసుకొచ్చారు.

  పిడుగుపడటంతో బీరువాలో పట్టిన రూ.20 లక్షలు కాలి బూడిదయ్యాయి. చవుదుకోసం దాచిపెట్టిన డబ్బు కళ్లముందే కాలిపోవడంతో కుటుంబమతా కన్నీరుమున్నీరవుతోంది. ఉన్నదంతా అగ్నికి ఆహుతవడంతో కృష్ణవేణి కుటుంబం రోడ్డున పడింది. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని బాధితులు వేడుకుంటున్నారు. ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.

  ఇది చదవండి: వదినపైనే కన్నేసిన మరిది... తప్పని వారించినా వినలేదు.. చివరకి ఏం జరిగిందంటే..!  కృష్ణాజిల్లాలో చెదలు.., తెలంగాణలో ఎలుకలు..
  కృష్ణాజిల్లా (Krishna District) మైలవరంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇలాంటి ఘటనే జరిగింది. మైలవరంకు చెందిన బిజిలి జమలయ్య పందుల వ్యాపారం చేస్తున్నాడు. పందులను మేపి వాటిని విక్రయించడం అతడి వృత్తి. కుటుంబ సభ్యులు కూడా చిన్నచిన్న పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. తన వ్యాపారంలో వచ్చిన లాభాలను ఇంట్లో దాచి పెట్టుకున్నాడు. నిరక్షరాశ్యుడైన జమలయ్య బ్యాంక్ ఎకౌంట్లపై అవగాహన లేకపోవడంతో డబ్బులన్నీ ఓ తుప్పుపట్టిన ట్రంకుపెట్టెలో దాచాడు. ఇందులో రూ.500 నోట్ల నుంచి రూ.10 నోటు వరకు అన్నింటినీ జాగ్రత్తగా దాచిపెట్టాడు. వచ్చిన డబ్బులు వచ్చినట్లు ట్రంకు పెట్టెలో వేస్తున్నాడు గానీ ఏనాడు సరిగా చూసుకోలేదు.

  ఇది చదవండి: పేర్లు మార్చి అమ్మాయులకు వల.. మార్ఫింగ్ ఫోటోలతో బ్లాక్ మెయిల్.. వారిలో ఒకరి భర్తకు నేరుగా..


  ఈ క్రమంలో ఓ వ్యాపారికి లక్షరూపాయలు ఇవ్వాల్సి వచ్చి డబ్బుల కోసం ట్రంక్ పెట్టె తెరిచి చూశాడు. అంతే ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు. అతడు కూడబెట్టిన డబ్బులన్నీ చెదలు తినేశాయి. నోట్లకట్టలను ముక్కలుముక్కలు చేశాయి. రూ.5లక్షల్లో రూపాయి కూడా పనికిరాకుండా పోయింది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకోవడంతో బోరుమన్నాడు. గతంలో తెలంగాణలో ఎలుకలు నోట్ల కట్లను కొరికేశాయి.

  తాతాగా చింతలపూడిలో జరిగిన ఘటనలో బాధితులకు ప్రభుత్వం న్యాయం చేయాలని స్థానికులు కూడా కోరుతున్నారు. అటు పోలం అమ్మేసుకోవడం, డబ్బులు కాలిపోవడంతో బాధితులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. మరి ప్రభుత్వం వీరికి ఎలాంటి న్యాయం చేస్తుందో వేచి చూడాలి.
  Published by:Purna Chandra
  First published: